Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Global Rankings: ప్రపంచంలోనే బెస్ట్ ఫుడ్ ఇక్కడే దొరుకుతుందట.. రికార్డుకెక్కిన భారతీయ నగరం..

పానీ పూరి మొదలుకుని పావ్ బాజీ వరకు కట్లెట్ నుంచి కచోరీ వరకు ఏం తినాలన్నా ఏం రుచిచూడాలన్నా మనందరికి ముందుగా గుర్తొచ్చేది ముంబై నగరమే. స్ట్రీట్ ఫుడ్ లవర్స్ కి ఇదొక స్వర్గధామం. ఇక్కడ దొరికనన్నీ వెరైటీలు మరెక్కడా చూసుండరేమో అనేలా ఉంటాయి. ఎటు చూసినా భోజనప్రియులతో నిండి ఉండే గల్లీలు లోపలికి రారమ్మంటూ ఆహ్వానిస్తున్నట్టుగా వచ్చే తాళింపు సువాసనలు.. ఆహా వింటూనే నోట్లో నీళ్లూరుతున్నాయి కదా.. ఇంత మంది ప్రేమను గెలుచుకున్న ముంబై నగరం తాజాగా మరో రికార్డును కూడా కొల్లగొట్టింది.

Global Rankings: ప్రపంచంలోనే బెస్ట్ ఫుడ్ ఇక్కడే దొరుకుతుందట.. రికార్డుకెక్కిన భారతీయ నగరం..
Street Food World Best Place In India
Follow us
Bhavani

|

Updated on: Mar 13, 2025 | 7:30 PM

ప్రపంచంలోనే బెస్ట్ ఫుడ్ దొరికే 20 నగరాల జాబితాను ప్రముఖ గ్లోబల్ ప్రచురణ సంస్థ టైమ్ అవుట్ ఇటీవల విడుదల చేసింది. అందులో ఒకే ఒక 2025 సంవత్సరానికి గానూ ఓ భారతీయ నగరం చోటు దక్కించుకుంది. అదే ముంబై. ఈ సంవత్సరం ఆహారం కోసం ప్రపంచంలోని 20 ఉత్తమ నగరాల కోసం టైమ్ అవుట్ ఇటీవల తన ర్యాంకింగ్‌లను విడుదల చేసింది. ముంబై 14వ స్థానాన్ని ఆక్రమించింది. గత సంవత్సరం ఇది ప్రపంచవ్యాప్తంగా 8వ స్థానంలో ఉంది. టైమ్ అవుట్ ముఖ్యంగా నగరంలోని వైవిధ్యమైన స్ట్రీట్ ఫుడ్ దొరికే ప్రదేశాల్ని హైలెట్ చేస్తూ ఈ జాబితాను విడుదల చేసింది. ఆకలితో ఉన్నప్పుడు కచ్చితంగా టేస్టీ ఫుడ్ కోసం వెళ్లవలసిన ప్రదేశాలు దక్షిణ జవేరి బజార్ నుండి ఉత్తర ఘట్కోపర్ వరకు ఉన్న ఖావ్ గల్లీస్ (ఆహార వీధులు)ను ఇందులో చేర్చారు. రుచికరమైన చాట్, జంబో-శాండ్‌విచ్‌లు, కూరగాయలు నిండిన ‘పిజ్జాలు’, బీరుట్ తో చేసే ఫ్రాంకీ-ర్యాప్‌లు మరియు డ్రై-ఫ్రూట్-టాప్డ్ ఫలూదా వంటివన్నీ ఇక్కడి ప్రత్యేకతలుగా తెలిపింది. ఇందులో ముంబైకి 14వ స్థానం దక్కగా.. తొలిస్థానంలో యూఎస్ ఏ లోని న్యూ ఓర్లిన్స్ ఉంది. ఆ తర్వాతి స్థానాల్లో థాయిలాండ్ కొలంబియాకు చెందిన నగరాలున్నాయి.

టాప్ 20 నగరాలు..

న్యూ ఓర్లీన్స్, యూఎస్‌ఏ

బ్యాంకాక్, థాయిలాండ్ మెడెల్లిన్, కొలంబియా కేప్ టౌన్, దక్షిణాఫ్రికా మాడ్రిడ్, స్పెయిన్ మెక్సికో నగరం, మెక్సికో లాగోస్, నైజీరియా షాంఘై, చైనా పారిస్, ఫ్రాన్స్ టోక్యో, జపాన్ మారకేష్, మొరాకో లిమా, పెరూ రియాద్, సౌదీ అరేబియా ముంబై, ఇండియా అబుదాబి, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కైరో, ఈజిప్ట్ పోర్టో, పోర్చుగల్ మాంట్రియల్, కెనడా నేపుల్స్, ఇటలీ శాన్ జోస్, కోస్టా రికా

ఈ జాబితాను ఎలా తయారు చేస్తారు..

ఈ జాబితాను రూపొందించడానికి ప్రపంచవ్యాప్తంగా వేలాది మందిని సర్వే చేసినట్లు టైమ్ అవుట్ తెలిపింది. రకాల ఆహారీలకు రేటింగ్ ఇవ్వాలని స్థానికులను కోరారు. అందులో నాణ్యత, రుచి, వెరైటీ ఇలా పలు కేటగిరీల ఆధారంగా వీటిని వేరు చేస్తారు. విమర్శకుల ప్రశంసలందుకున్న ఫుడ్, అది లభించే నగరాల ఆధారంగా ఈ ర్యాంకింగ్స్ ను అందించారు.