Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rava Idli: ఇంట్లోనే వెరైటీ ఇడ్లీని తయారు చేయండి.. సూపర్‌ టేస్ట్‌ని ఆస్వాదించండి..

Rava Idli: రవ్వ ఇడ్లీ అనేది రవ్వ, పెరుగుతో తయారు చేసే ఒక ప్రసిద్ధ దక్షిణ భారతీయ వంటకం. ఈ అల్పాహారం సులభంగా జీర్ణమవుతుంది అంతేగాక పోషకాలతో నిండి ఉంటుంది.

Rava Idli: ఇంట్లోనే వెరైటీ ఇడ్లీని తయారు చేయండి.. సూపర్‌ టేస్ట్‌ని ఆస్వాదించండి..
Rava Idli
Follow us
uppula Raju

|

Updated on: Nov 17, 2021 | 5:54 AM

Rava Idli: రవ్వ ఇడ్లీ అనేది రవ్వ, పెరుగుతో తయారు చేసే ఒక ప్రసిద్ధ దక్షిణ భారతీయ వంటకం. ఈ అల్పాహారం సులభంగా జీర్ణమవుతుంది అంతేగాక పోషకాలతో నిండి ఉంటుంది. మీరు ఇంట్లోనే ఈ వంటకాన్ని సులువుగా తయారుచేసుకోవచ్చు. ఈ ఇడ్లీ సుగంధ ద్రవ్యాలు, రవ్వ మిశ్రమం. కరివేపాకు రుచికోసం వేస్తారు. ఇది ఒక గొప్ప అల్పాహారం, చిరుతిండి వంటకమని చెప్పవచ్చు. ఇది రోజులో ఎప్పుడైనా తినవచ్చు. మీ ఇంటికి అకస్మాత్తుగా అతిథులు వస్తే భోజనాన్ని సిద్ధం చేయడానికి సమయం లేకుంటే ఇది చాలా తక్కువ సమయంలో చేయవచ్చు. అంతేకాదు వారు కూడా ఇష్టపడుతారు.

అంతేకాదు ఇంట్లో మీరు ఏదైనా పార్టీ ఏర్పాటు చేస్తే మసాలాలు లేదా కొబ్బరి చట్నీతో పార్టీ స్నాక్‌గా అందించవచ్చు. మీకు నచ్చిన పదార్థాలను కలపడం ద్వారా ఈ ఇడ్లీ మరింత రుచిగా మారుతుంది. ఉదాహరణకు మీరు పనీర్ ప్రియులైతే కొంచెం తురిమిన పనీర్‌ను చల్లుకోవచ్చు. మీరు చట్నీ ప్రియులైతే చట్నీతో కూడా తినవచ్చు. అద్భుత రుచిని ఆస్వాదించవచ్చు. వేడి వేడి టీ లేదా ఫిల్టర్ కాఫీతో రవ్వ ఇడ్లీ రుచిగా ఉంటుంది. మీరు దీన్ని సాంబార్‌తో పాటు భోజనంగా కూడా తినవచ్చు. ఇది కూరగాయలు, పప్పులు, సుగంధ ద్రవ్యాల మిశ్రమం. కనుక భోజనంలో భాగం చేసుకుంటే పోషకాల పరంగా ఒక మెట్టు ఎక్కినట్లే.

రవ్వ ఇడ్లీకి కావలసిన పదార్థాలు 1 కప్పు సెమోలినా 1/4 టేబుల్‌స్పూన్ ఆవాలు 1 టేబుల్‌స్పూన్ శనగ పప్పు 10 జీడిపప్పులు 5 సన్నగా తరిగిన పచ్చిమిర్చి 1/2 కప్పు పెరుగు 6 ఆకులు కరివేపాకు 1 చిటికెడు ఉప్పు

రవ్వ ఇడ్లీ ఎలా తయారు చేయాలి 1. ఒక పాన్ తీసుకొని కొద్దిగా నూనె వేసి ఆవాలు, కరివేపాకు, పప్పు, జీడిపప్పు, పచ్చిమిర్చి వేసి ఒక నిమిషం పాటు వేయించాలి. తర్వాత రవ్వ వేసి గోల్డ్‌ కలర్ వచ్చేవరకు వేయించాలి. తర్వాత తీసి చల్లార్చాలి. ఇప్పుడు ఇడ్లీ పిండిలో పెరుగు, ఉప్పు వేసి బాగా కలపాలి. 20 నుంచి 30 నిమిషాలు పక్కన పెట్టాలి. తర్వాత కొంచెం నీళ్లు పోసి మళ్లీ కలపాలి.ఇడ్లీ ప్లేట్‌కు నెయ్యి రాసి అందులో చిన్న స్పూన్ల పిండిని వేయాలి. 6-8 నిమిషాలు ఆవిరిలో ఉడికించాలి. కొబ్బరి చట్నీ, సాంబార్‌తో వేడిగా వడ్డిస్తే వేడి వేడి ఇడ్లీ రెడీ.

AP IAS Officers Transfer: ఏపీలో పలువురు ఐఏఎస్‌ అధికారుల బదిలీ.. ఎవరెవరికి ఏ శాఖలు కేటాయించారంటే..?

పెద్దవారిలో ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా..! అయితే కచ్చితంగా ఆ వ్యాధే..?

Viral Photos: భూమిపై ఉన్న అందమైన భవంతి ఈ హోటల్‌.. 6000 అడుగుల ఎత్తులో నిర్మించారు..