AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kerala Chicken Fry: ఘుమఘుమలాడే కేరళ స్టైల్ చికెన్ ఫ్రై.. నోరూరించే ఈ రెసిపీని ఎప్పుడైనా ట్రై చేశారా?

బయట వర్షం పడుతున్నప్పుడు కారంగా, రుచిగా ఏదైనా తినాలనిపిస్తే చికెన్ ఫ్రై కంటే ఉత్తమమైనది ఏముంటుంది? అయితే ఎప్పుడూ చేసే రొటీన్ చికెన్ 65 కాకుండా, కేరళలో ఫేమస్ అయిన 'తట్టుకడై' (రోడ్డు పక్కన ఉండే చిన్న హోటల్స్) స్టైల్ చికెన్ ఫ్రైని ఒకసారి ప్రయత్నించండి. ఈ వంటకంలో వాడే కొబ్బరి నూనె, కరివేపాకు ప్రత్యేకమైన మసాలా పేస్ట్ దీనికి ఒక అద్భుతమైన సువాసనను, రుచిని ఇస్తాయి.

Kerala Chicken Fry: ఘుమఘుమలాడే కేరళ స్టైల్ చికెన్ ఫ్రై.. నోరూరించే ఈ రెసిపీని ఎప్పుడైనా ట్రై చేశారా?
Kerala Style Thattukada Chicken Fry Recipe
Bhavani
|

Updated on: Jan 27, 2026 | 6:59 PM

Share

కేరళ స్టైల్ చికెన్ ఫ్రై ప్రత్యేకత ఏమిటంటే.. ఇందులో చికెన్‌తో పాటు వేయించిన పచ్చిమిర్చి, కొబ్బరి తురుము ముక్కలు కూడా ఎంతో కరకరలాడుతూ తగులుతాయి. చిన్న ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లి కాశ్మీరీ మిర్చిలతో తయారు చేసిన మసాలా చికెన్‌కు మంచి రంగును, ఘాటును అందిస్తుంది. రసం అన్నంలోకి సైడ్ డిష్‌గా లేదా స్నాక్‌లా నేరుగా తినడానికి కూడా ఇది ఎంతో బాగుంటుంది. మరి ఈ నోరూరించే చికెన్ ఫ్రైని ఇంట్లోనే ఎలా తయారు చేయాలో స్టెప్-బై-స్టెప్ ప్రాసెస్ ఇప్పుడు చూద్దాం.

కావలసిన పదార్థాలు:

చిన్న ఉల్లిపాయలు (20),

వెల్లుల్లి రెబ్బలు (5),

అల్లం ముక్క,

కాశ్మీరీ ఎండుమిర్చి (3),

పచ్చిమిర్చి (2),

గుప్పెడు కొత్తిమీర.

మ్యారినేషన్ కోసం: చికెన్ (400 గ్రాములు), సగం నిమ్మకాయ, సోంపు (1 టీస్పూన్), పసుపు (1/2 టీస్పూన్), కాశ్మీరీ కారం (2 టీస్పూన్లు), మిరియాల పొడి (1/2 టీస్పూన్), సోంపు పొడి (1/4 టీస్పూన్), జీలకర్ర పొడి (1 టీస్పూన్), గరం మసాలా (1 టీస్పూన్), బియ్యం పిండి (1 టేబుల్ స్పూన్), ఒక గుడ్డు, రుచికి సరిపడా ఉప్పు.

ఫ్రై కోసం: కొబ్బరి నూనె (2 టేబుల్ స్పూన్లు), కరివేపాకు, పచ్చిమిర్చి (5), కొబ్బరి తురుము (2 టేబుల్ స్పూన్లు).

తయారీ విధానం:

ముందుగా ఉల్లిపాయలు, వెల్లుల్లి, అల్లం, మిర్చి, కొత్తిమీర కలిపి మిక్సీలో మెత్తటి పేస్ట్‌లా రుబ్బుకోవాలి.

చికెన్ ముక్కలను శుభ్రంగా కడిగి ఒక గిన్నెలో తీసుకోండి. అందులో రుబ్బిన మసాలా పేస్ట్, పైన పేర్కొన్న పొడి మసాలాలు, నిమ్మరసం, బియ్యం పిండి మరియు గుడ్డు వేసి బాగా కలపాలి. దీనిని కనీసం 2 గంటల పాటు పక్కన పెడితే ముక్కలకు మసాలా బాగా పడుతుంది.

పాన్‌లో కొబ్బరి నూనె వేడి చేసి, మ్యారినేట్ చేసిన చికెన్ ముక్కలను వేసి మీడియం మంట మీద ఒకవైపు వేయించాలి.

చికెన్ ముప్పావు వంతు వేగిన తర్వాత.. మిగిలిన మసాలాలో కొబ్బరి తురుము, కరివేపాకు, తరిగిన పచ్చిమిర్చి కలిపి పాన్‌లో వేయాలి.

చికెన్ కొబ్బరి మిశ్రమం బాగా వేగి, మంచి సువాసన వస్తున్నప్పుడు స్టవ్ ఆర్పేయాలి. అంతే! వేడివేడి కేరళ తట్టుకడై చికెన్ ఫ్రై సిద్ధం.

బంగారం ఆభరణాలు వేసుకుని మహిళలు ప్రయాణాలు చేస్తున్నారా?
బంగారం ఆభరణాలు వేసుకుని మహిళలు ప్రయాణాలు చేస్తున్నారా?
ఒకప్పుడు బిస్కెట్స్‌తో కడుపు నింపుకొన్నాడు.. ఇప్పుడు స్టార్ హీరో
ఒకప్పుడు బిస్కెట్స్‌తో కడుపు నింపుకొన్నాడు.. ఇప్పుడు స్టార్ హీరో
వేడివేడి అన్నం, రసంలోకి ఈ కేరళ చికెన్ ఫ్రై ఉంటే స్వర్గమే!
వేడివేడి అన్నం, రసంలోకి ఈ కేరళ చికెన్ ఫ్రై ఉంటే స్వర్గమే!
కష్టాలను తరిమికొట్టే చాణక్య మంత్రం.. ఇవి ఫాలో అయితే మిమ్మల్ని..
కష్టాలను తరిమికొట్టే చాణక్య మంత్రం.. ఇవి ఫాలో అయితే మిమ్మల్ని..
ఆన్‌లైన్ ద్వారా పతంజలి ఉత్పత్తులను కొనుగోలు చేయడం ఎలా..?
ఆన్‌లైన్ ద్వారా పతంజలి ఉత్పత్తులను కొనుగోలు చేయడం ఎలా..?
పవర్‌స్టార్‌ మూడు ప్రాజెక్టులు లైన్లో పెడుతున్నారా
పవర్‌స్టార్‌ మూడు ప్రాజెక్టులు లైన్లో పెడుతున్నారా
జానర్ మార్చిన నితిన్‌.. ఈ సారైనా కలిసొస్తుందా
జానర్ మార్చిన నితిన్‌.. ఈ సారైనా కలిసొస్తుందా
కీలక గ్రహాల అనుకూలత.. త్వరలో వారు మిలియనీర్లు కావడం ఖాయం!
కీలక గ్రహాల అనుకూలత.. త్వరలో వారు మిలియనీర్లు కావడం ఖాయం!
పాత నగలు కొత్తవిగా మెరవాలంటే,ఇవి ట్రై చేయండి..ఖర్చులేదు, పని ఈజీ!
పాత నగలు కొత్తవిగా మెరవాలంటే,ఇవి ట్రై చేయండి..ఖర్చులేదు, పని ఈజీ!
నయన్‌కి హిట్‌ ఇచ్చిన చిరు.. మరి త్రిష మాటేంటి
నయన్‌కి హిట్‌ ఇచ్చిన చిరు.. మరి త్రిష మాటేంటి