AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అది ఇది వద్దు.. జస్ట్ 5 నిమిషాల్లోనే సూపర్‌ఫుడ్.. మన పెద్దోళ్ల ఆరోగ్య రహాస్యం ఇదే

జొన్న జావ ఒక సాంప్రదాయక, ఆరోగ్యకరమైన పానీయం. జొన్న జావ శ్రేష్టమైన రుచితో పాటు అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందించే ఒక అద్భుతమైన పానీయం. జొన్నలు (Jowar) శరీరానికి ఎంతో మేలు చేసే మిల్లెట్లలో ఒకటి. వవీటిలో అధికంగా ఉండే ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరచి, మలబద్ధకాన్ని నివారిస్తుంది. మధుమేహ వ్యాధిగ్రస్తులకు, బరువు తగ్గాలనుకునే వారికి ఇది మంచి ఎంపిక.

అది ఇది వద్దు.. జస్ట్ 5 నిమిషాల్లోనే సూపర్‌ఫుడ్.. మన పెద్దోళ్ల ఆరోగ్య రహాస్యం ఇదే
Jonna Java
Shaik Madar Saheb
|

Updated on: Apr 08, 2026 | 12:36 PM

Share

జొన్న జావ అనేది కేవలం రుచికరమైన పానీయం మాత్రమే కాదు. అది ఆరోగ్యానికి అపారమైన ప్రయోజనాలను అందించే ఒక సాంప్రదాయక ఆహారం. పూర్వ కాలం నుండి మన పెద్దలు తమ ఆహారంలో భాగంగా చేసుకున్న జొన్నలు.. నేటి ఆధునిక జీవనశైలిలో తిరిగి ప్రాముఖ్యతను సంతరించుకుంటున్నాయి. ఫైబర్, విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉన్న జొన్నలు, మన శరీరానికి ఎన్నో విధాలుగా మేలు చేస్తాయి. జొన్న జావ బరువు తగ్గడానికి, మధుమేహాన్ని నియంత్రించడానికి.. జీర్ణక్రియను మెరుగుపరచడానికి ఎంతో సహాయపడుతుంది. ఇందులో పీచు పదార్థం, ప్రోటీన్లు, కాల్షియం, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి. ఇది శరీరానికి చలువ చేసి, రోజంతా శక్తిని అందిస్తుంది. ఎండాకాలం డైలీ తాగితే చాలా మంచిది.

జొన్నల ఆరోగ్య ప్రయోజనాలు:

జొన్నలు అధిక ఫైబర్ కలిగి ఉండటం వల్ల జీర్ణక్రియను గణనీయంగా మెరుగుపరుస్తాయి. ఇది మలబద్ధకం వంటి సమస్యలను నివారిస్తుంది. మధుమేహ వ్యాధిగ్రస్తులకు జొన్నలు చాలా మంచివి.. ఎందుకంటే ఇవి రక్తంలో చక్కెర స్థాయిలను స్థిరీకరించడంలో సహాయపడతాయి. బరువు తగ్గాలనుకునే వారికి జొన్న జావ ఒక అద్భుతమైన ఎంపిక.. ఎందుకంటే ఇది కడుపు నిండిన అనుభూతిని ఇస్తుంది.. తద్వారా అతిగా తినడాన్ని తగ్గిస్తుంది. ఇంకా, జొన్నలు గుండె ఆరోగ్యానికి మంచివి అని, అధిక రక్తపోటు (బీపీ) ఉన్నవారికి కూడా ప్రయోజనకరంగా ఉంటాయని చెబుతారు. వేసవి కాలంలో శరీరం వేడిని తగ్గించడానికి జొన్న జావ ఒక ఉత్తమమైన శీతలీకరణ పానీయం. ఇది తక్కువ ఖర్చుతో ఎక్కువ పోషకాలను అందిస్తుంది, శరీరాన్ని శక్తివంతంగా ఉంచుతుంది.

జొన్న జావ తయారీ పద్ధతులు..

ఐదు నిమిషాల్లోనే సూపర్‌ఫుడ్

లేకపోతే.. జొన్న పొడిని.. నీటిలో వేసుకోని మరిగించి కూడా నేరుగా తీసుకోవచ్చు.. కేవలం ఐదు నిమిషాల్లోనే ఈ జావ తయారీ అయిపోతుంది. ముందుగా కొంచెం నీటిలో జొన్న పొడిని కలుపుకోవాలి.. ఆ తర్వాత గిన్నెలో నీటిని వేడి చేసుకోవాలి. నీరు మరిగిన తర్వాత.. జొన్న పొడిని కలిపిన నీటిని దానిలో వేయాలి.. ఒక్కనిమిషంలో జావ తయారు అవుతుంది. దీనిలో కొంచెం ఉప్పు, నిమ్మకాయ, ఉల్లి, కొత్తిమీర కలుపుకోవచ్చు..

రుచికరమైన, ఆరోగ్యకరమైన జొన్న జావను తయారు చేయడానికి చిట్కాలు..

జొన్నల ఎంపిక, నానబెట్టడం: ముందుగా ఒక కప్పు పెద్ద రకం జొన్నలను తీసుకుని శుభ్రంగా కడగాలి. వాటిని నీటిలో పూర్తిగా మునిగేలా చేసి, కనీసం ఎనిమిది గంటల పాటు నానబెట్టాలి. రాత్రంతా నానబెట్టడం ఉత్తమం. ఇది జొన్నలలోని పోషకాలను నిలుపుకోవడానికి, వాటిని సులభంగా జీర్ణం కావడానికి సహాయపడుతుంది.

కూరగాయల తయారీ: నానబెట్టిన జొన్న జావ కోసం, కొద్దిగా అల్లం తరుగు, క్యారెట్, క్యాప్సికం, పచ్చిమిర్చి, లాంగ్‌బీన్, ముఖ్యంగా స్వీట్‌కార్న్ వంటి కూరగాయలను సన్నగా తరిగి సిద్ధం చేసుకోవాలి. పచ్చిమిర్చిని తగ్గించి, దాని స్థానంలో నల్ల మిరియాల పొడిని ఉపయోగించడం పిల్లలకు లేదా కారం తక్కువగా తినేవారికి మంచిది. కూరగాయలను త్వరగా ఉడకబెట్టడానికి మిక్సీలో కోర్స్‌గా గ్రైండ్ చేసుకోవచ్చు.

వేయించడం: ఒక గిన్నెలో కొద్దిగా నూనె లేదా నెయ్యి వేసి, అల్లం తరుగుతో పాటు తరిగిన కూరగాయలను రెండు నుండి మూడు నిమిషాల పాటు చిన్న మంటపై వేయించాలి. కూరగాయలు పూర్తిగా మెత్తబడాల్సిన అవసరం లేదు.

జొన్నల మిశ్రమం: నానబెట్టిన జొన్నలను నీరు పోసి, మిక్సీలో పాల వలె మెత్తగా, బరకగా రుబ్బుకోవాలి.

జావ తయారీ: వేయించిన కూరగాయల మిశ్రమంలో రుబ్బిన జొన్నల మిశ్రమాన్ని చేర్చాలి. ఒక కప్పు జొన్నల మిశ్రమానికి మూడు నుండి నాలుగు కప్పుల నీటిని పోయాలి. మరింత పల్చగా కావాలంటే ఇంకొక కప్పు నీరు కలుపుకోవచ్చు. రుచి కోసం కొద్దిగా కరివేపాకు, నల్ల మిరియాల పొడిని చేర్చాలి.

వంట: ఈ మిశ్రమాన్ని చిన్న మంటపై ఉంచి, బబుల్స్ వచ్చే వరకు నెమ్మదిగా కలుపుతూ ఉడికించాలి. జావ చిక్కబడుతున్నప్పుడు స్టవ్ ఆపివేయాలి.

ఈ పద్ధతిలో తయారుచేసిన జొన్న జావ కడుపుకు హాయిగా ఉండటమే కాకుండా.. శరీరానికి అవసరమైన పోషకాలను అందించి, ఆరోగ్యంగా ఉండటానికి తోడ్పడుతుంది. ఇది మధుమేహ వ్యాధిగ్రస్తులకు, బరువు తగ్గాలనుకునే వారికి, సాధారణ ఆరోగ్య సంరక్షణకు 100 నుండి 200 శాతం ఆరోగ్యకరమైన ఎంపిక..

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us