AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మసాలా దినుసుల రారాజు జాపత్రి అంటే ఏమిటి..? సాగుతో సిరుల వర్షమే..! ఆసక్తికర విశేషాలు

వంట గదిలో ఉండే పోపుల పెట్టెలో జాపత్రికి ఉండే సువాసన వేరు. బిర్యానీ అయినా, గరం మసాలా అయినా జాపత్రి పడితేనే ఆ రుచికి పరిపూర్ణత వస్తుంది. ప్రపంచవ్యాప్తంగా సరఫరా అవుతున్న జాపత్రిలో సింహభాగం ఇండోనేషియా నుండే వస్తోంది. అయితే ఈ విలువైన సుగంధ ద్రవ్యం వెనుక ఉన్న చరిత్ర, ఉత్పత్తికి సంబంధించిన ఆసక్తికర విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.

మసాలా దినుసుల రారాజు జాపత్రి అంటే ఏమిటి..? సాగుతో సిరుల వర్షమే..! ఆసక్తికర విశేషాలు
Javitri
Jyothi Gadda
|

Updated on: Apr 08, 2026 | 12:25 PM

Share

మసాలా దినుసుల ప్రపంచంలో జాపత్రి (Mace) కి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. దీని సువాసన, ఘాటు వంటకాలకు అద్భుతమైన రుచిని ఇస్తాయి. ఈ విలువైన సుగంధ ద్రవ్యాన్ని అత్యధికంగా ఉత్పత్తి చేసే దేశంగా ఇండోనేషియా తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తోంది. జాపత్రి సాగుకు అవసరమైన వేడి, తేమతో కూడిన వాతావరణం ఇండోనేషియాలో పుష్కలంగా ఉంది. ఇక్కడి అగ్నిపర్వత నేలలు జాజికాయ చెట్లు పెరగడానికి ఎంతో అనుకూలం. ప్రపంచవ్యాప్తంగా సరఫరా అవుతున్న జాపత్రిలో సింహభాగం ఇక్కడి నుండే ఎగుమతి అవుతుంది. చరిత్రలో కూడా ఈ ప్రాంతాన్ని స్పైస్ ఐలాండ్స్ (Spice Islands) అని పిలిచేవారు.

జాపత్రి అంటే ఏమిటి?:

చాలామందికి జాపత్రి, జాజికాయ మధ్య ఉన్న సంబంధం తెలియదు. జాజికాయ విత్తనం పైన ఉండే ఎర్రటి రక్షణ కవచమే జాపత్రి. పండు పక్వానికి వచ్చాక ఈ పొరను జాగ్రత్తగా తీసి ఎండబెడతారు. ఎండిన తర్వాత అది నారింజ లేదా పసుపు రంగులోకి మారుతుంది. ఇది జాజికాయ కంటే కొంచెం ఘాటుగా, మరింత సుగంధభరితంగా ఉంటుంది.

ఇవి కూడా చదవండి

మొత్తం సుగంధ ద్రవ్యాల ఉత్పత్తి, వినియోగంలో భారతదేశం ప్రపంచంలోనే నంబర్ వన్ స్థానంలో ఉంది. భారత్‌లో ముఖ్యంగా కేరళ రాష్ట్రంలో జాపత్రి సాగు అధికంగా జరుగుతుంది. అయినప్పటికీ, అంతర్జాతీయ మార్కెట్లో ఎగుమతుల పరంగా ఇండోనేషియా తర్వాత వియత్నాం, శ్రీలంక దేశాలు గట్టి పోటీనిస్తున్నాయి.

జాపత్రిని కేవలం బిర్యానీ లేదా గరం మసాలాలోనే కాకుండా, ఆయుర్వేద మందులలో కూడా ఉపయోగిస్తారు. ఇది జీర్ణక్రియను మెరుగుపరచడానికి, ఒత్తిడిని తగ్గించడానికి, చర్మ సౌందర్యానికి ఎంతో మేలు చేస్తుంది.

మరిన్ని హ్యుమన్‌ ఇంట్రెస్ట్‌ వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us
ఈ ఒక్కటి వేసి పెరుగు పులుసు చేయండి.. అబ్బో అద్భుతం.. అమోఘం
ఈ ఒక్కటి వేసి పెరుగు పులుసు చేయండి.. అబ్బో అద్భుతం.. అమోఘం
వానాకాలంలో ఈ ఆకు కూరల జోలికి అస్సలు వెళ్లకండి..
వానాకాలంలో ఈ ఆకు కూరల జోలికి అస్సలు వెళ్లకండి..
స్విగ్గీ, జొమాటోలకు పోటీగా.. ఫ్లిప్‌కార్ట్‌లో ఫుడ్ డెలివరీ..!
స్విగ్గీ, జొమాటోలకు పోటీగా.. ఫ్లిప్‌కార్ట్‌లో ఫుడ్ డెలివరీ..!
ఆరోగ్యానికి మేలు చేసే... టేస్టీ హెల్దీ రాగి వెజిటెబుల్ సూప్!
ఆరోగ్యానికి మేలు చేసే... టేస్టీ హెల్దీ రాగి వెజిటెబుల్ సూప్!
అన్నంలోకి సూపర్ గా ఉండే మీల్ మేకర్ ఫ్రై!
అన్నంలోకి సూపర్ గా ఉండే మీల్ మేకర్ ఫ్రై!
నెలకు రూ.25,000 జీతం ఉంటే.. చివరికి PF ఎంత వస్తుందో తెలిస్తే..
నెలకు రూ.25,000 జీతం ఉంటే.. చివరికి PF ఎంత వస్తుందో తెలిస్తే..
అరటిపండు తింటే కలిగే ఈ 5 ఆరోగ్య ప్రయోజనాల గురించి మీకు తెలుసా..?
అరటిపండు తింటే కలిగే ఈ 5 ఆరోగ్య ప్రయోజనాల గురించి మీకు తెలుసా..?
మందుబాబులపై ఉక్కుపాదం.. హైదరాబాద్‌లో పోలీసుల ప్రత్యేక డ్రైవ్‌లు
మందుబాబులపై ఉక్కుపాదం.. హైదరాబాద్‌లో పోలీసుల ప్రత్యేక డ్రైవ్‌లు
శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్‌లో తీవ్ర విషాదం.. నీటిలో పడి నలుగురు మృతి
శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్‌లో తీవ్ర విషాదం.. నీటిలో పడి నలుగురు మృతి
శ్రావణ మాసంలో లక్ష్మీదేవి అనుగ్రహం.. వీరి పంట పండినట్లే
శ్రావణ మాసంలో లక్ష్మీదేవి అనుగ్రహం.. వీరి పంట పండినట్లే