AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సమ్మర్‌ స్పెషల్.. నోరూరించే మామిడికాయ పులిహోర..ఈ సింపుల్ టిప్స్ పాటిస్తే టేస్ట్ అదిరిపోతుంది!

వేసవి కాలం వచ్చిందంటే చాలు పచ్చి మామిడికాయలతో రకరకాల వంటకాలు మొదలవుతాయి. అందులో అందరికీ ఇష్టమైనది మామిడికాయ పులిహోర. దీని తయారీ విధానంలో ఒక్కొక్కరిదీ ఒక్కో పద్ధతి.. ఎవరు ఎలా తయారు చేసిన మామిడికాయ పులిహోరకు ఫ్యాన్స్‌ మాత్రం ఎక్కువే అని చెప్పాలి. కానీ, కొన్ని సింపుల్‌ టిప్స్‌ పాటించటం వల్ల మనం ఇంట్లో చేసుకునే పులిహోర కూడా గుడిలో ప్రసాదంలా కమ్మటి రుచితో వస్తుంది. దీని కోసం ఈ సులభమైన రెసిపీని ట్రై చేయండి.. మీరు కూడా ఇంట్లోనే రుచికరమైన పులిహోరను తయారు చేసుకోవచ్చు.

సమ్మర్‌ స్పెషల్.. నోరూరించే మామిడికాయ పులిహోర..ఈ సింపుల్ టిప్స్ పాటిస్తే టేస్ట్ అదిరిపోతుంది!
Mamidikaya Pulihora
Jyothi Gadda
|

Updated on: Apr 08, 2026 | 10:51 AM

Share

మామిడికాయ పులిహోర ఆంధ్ర, తెలంగాణ ఇళ్లలో అత్యంత ప్రజాదరణ పొందిన కాలానుగుణ వంటకం. మామిడి పండ్ల సీజన్‌లో ప్రత్యేకంగా చేసుకునే మామిడికాయ పులిహోర (Mamidikaya Pulihora) తయారీ విధానం, దానికి కావలసిన పదార్థాల గురించి ఇక్కడ వివరించబడింది. చింతపండు పులిహోర కంటే భిన్నమైన రుచితో, పుల్లపుల్లగా ఉండే ఈ వంటకం వేసవిలో ఎంతో ఇష్టంగా తింటారు. దీని తయారీకి పుల్లని పచ్చి మామిడికాయలు ప్రధానమైనవి. కావలసిన పదార్థాలు, తయారీ విధానం ఇప్పుడు చూద్దాం..

కావాల్సినవి:

అన్నం – 2 కప్పులు

ఇవి కూడా చదవండి

పచ్చి మామిడికాయ తురుము – 1 కప్పు (పులుపును బట్టి)

పచ్చి మిర్చి – 5 (నిలువుగా చీల్చినవి)

అల్లం ముక్కలు – కొద్దిగా

తాలింపు గింజలు (ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు)

వేరుశనగ పప్పులు – 3 చెంచాలు

ఎండుమిర్చి – 4

కరివేపాకు, కొత్తిమీర – తగినంత

పసుపు, ఉప్పు, ఇంగువ, నూనె.

తయారీ విధానం: ముందుగా అన్నాన్ని పొడిపొడిగా వండుకోవాలి. అన్నం వేడిగా ఉన్నప్పుడే ఒక చెంచా నూనె, కొంచెం పసుపు కలిపి పక్కన పెట్టుకోవాలి. దీనివల్ల అన్నం ముద్ద అవ్వకుండా ఉంటుంది. ఇప్పుడు పచ్చి మామిడికాయను కడిగి, పైన చెక్కు తీసి తురుముకోవాలి. పులుపు ఎక్కువగా ఉంటే తురుమును కొంచెం తగ్గించి వేసుకోవచ్చు. ఇప్పుడు సౌవ్‌పై ఒక బాణలిలో నూనె వేసి వేడయ్యాక వేరుశనగ పప్పులు, తాలింపు గింజలు వేసి వేయించాలి. అవి వేగాక ఎండుమిర్చి, పచ్చిమిర్చి, అల్లం ముక్కలు, కరివేపాకు, చిటికెడు ఇంగువ వేయాలి.

ఇప్పుడు తాలింపులో మామిడికాయ తురుము వేసి ఒక్క నిమిషం పాటు వేయించాలి. ఎక్కువ సేపు వేయించకూడదు, పులుపు తగ్గిపోతుంది. చివరిగా ఈ తాలింపును అన్నంలో వేసి, తగినంత ఉప్పు కలిపి బాగా కలుపుకోవాలి. పులిహోర కలిపిన తర్వాత కనీసం అరగంట పాటు పక్కన పెడితే, మామిడికాయలోని పులుపు అన్నానికి బాగా పట్టి రుచి పెరుగుతుంది. పండు మామిడికాయల కంటే కలెక్టర్ మామిడి లేదా కొత్తపల్లి కొబ్బరి రకాలు పులిహోరకు చాలా బాగుంటాయి.

మరిన్ని హ్యుమన్‌ ఇంట్రెస్ట్‌ వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us
భారత ట్రక్కు డ్రైవర్లు.. వెళ్లిపొండి! సిక్కు సంఘాలు సీరియస్
భారత ట్రక్కు డ్రైవర్లు.. వెళ్లిపొండి! సిక్కు సంఘాలు సీరియస్
పుతిన్, జిన్‌పింగ్‌కు స్పెషల్ సెక్యూరిటీ.. ఏ రేంజ్‌లో ఉందంటే!
పుతిన్, జిన్‌పింగ్‌కు స్పెషల్ సెక్యూరిటీ.. ఏ రేంజ్‌లో ఉందంటే!
మరో వారంలో వీరికి జాక్‌పాట్.. కెరీర్‌లో పురోగతి, చేతిలో డబ్బు!
మరో వారంలో వీరికి జాక్‌పాట్.. కెరీర్‌లో పురోగతి, చేతిలో డబ్బు!
SBIలో ఎఫ్‌డీపై రూ. 1 లక్ష డిపాజిట్‌ చేస్తే మెచ్యూరిటీ సమయంలో ఎంత?
SBIలో ఎఫ్‌డీపై రూ. 1 లక్ష డిపాజిట్‌ చేస్తే మెచ్యూరిటీ సమయంలో ఎంత?
రైలు పట్టాల కింద కంకర రాళ్లు ఎందుకు పోస్తారో తెలుసా?
రైలు పట్టాల కింద కంకర రాళ్లు ఎందుకు పోస్తారో తెలుసా?
బొజ్జ గణపయ్యకి ఇష్టమైన బెల్లం కుడుములు..ఇలా చేస్తే రుచి అద్భుతమే
బొజ్జ గణపయ్యకి ఇష్టమైన బెల్లం కుడుములు..ఇలా చేస్తే రుచి అద్భుతమే
కనకాంబరం మొక్క పూలు పూయట్లేదా? ఇంట్లో దొరికే ఈ మూడు కలిపి వేయండి
కనకాంబరం మొక్క పూలు పూయట్లేదా? ఇంట్లో దొరికే ఈ మూడు కలిపి వేయండి
భారత్‌ అమ్ములపొదిలో 190 అణు వార్‌హెడ్లు.. తయారీ దశలో మరో 35
భారత్‌ అమ్ములపొదిలో 190 అణు వార్‌హెడ్లు.. తయారీ దశలో మరో 35
ఎండుమిరపకాయల పప్పు.. వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసి తింటే.. అబ్బో
ఎండుమిరపకాయల పప్పు.. వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసి తింటే.. అబ్బో
నిమ్మకాయలు నెల రోజులైనా ఫ్రెష్‌గా ఉంటాయ్.. ఈ సింపుల్ ట్రిక్స్..
నిమ్మకాయలు నెల రోజులైనా ఫ్రెష్‌గా ఉంటాయ్.. ఈ సింపుల్ ట్రిక్స్..