AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

2025 కుంభమేళాలో ఫేమస్ IIT బాబా పెళ్లి! ఇంటర్‌నెట్‌లో ఇప్పడిదే హాట్‌టాపిక్..? ఎందుకంటే..

2025 మహాకుంభమేళాలో IIT బాబాగా సోషల్ మీడియాలో విపరీతమైన పాపులారిటీ సంపాదించిన సిద్ధాంత్ గిరి, తాజాగా బెంగళూరుకు చెందిన ఒక సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌ను వివాహం చేసుకుని వార్తల్లో నిలిచారు. ఆధ్యాత్మికత, ఆధునిక విద్య కలయికతో ఆయన ప్రయాణం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఆధ్యాత్మికత మార్గంలో ఉన్న ఒక వ్యక్తి మళ్ళీ సాధారణ జీవితంలోకి రావడం, ఒక విద్యావంతురాలైన యువతిని పెళ్లి చేసుకోవడం ఇప్పుడు ఇంటర్నెట్‌లో హాట్ టాపిక్‌గా మారింది. మహాకుంభమేళా 2025లో సుమారు 45 లక్షల మంది ఫాలోవర్లతో సెన్సేషన్‌గా మారిన సిద్ధాంత్ గిరి ఎవరు, ఏంటి ఇక్కడ చూద్దాం..

2025 కుంభమేళాలో ఫేమస్ IIT బాబా పెళ్లి! ఇంటర్‌నెట్‌లో ఇప్పడిదే హాట్‌టాపిక్..? ఎందుకంటే..
Iit Baba Story
Jyothi Gadda
|

Updated on: Apr 07, 2026 | 12:45 PM

Share

మహాకుంభమేళా అంటేనే అఘోరాలు, సన్యాసులు గుర్తొస్తారు. కానీ 2025 కుంభమేళాలో ఒక యువ సన్యాసి తన చదువు, వేషధారణతో ప్రపంచం దృష్టిని ఆకర్షించారు. ఆయనే సిద్ధాంత్ గిరి, అలియాస్ IIT బాబా. తాజాగా ఆయన ఒక ఇంటివాడయ్యారనే వార్త వైరల్ అవుతోంది. సిద్ధాంత్ గిరి నేపథ్యం చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఆయన ఉత్తరప్రదేశ్‌లోని బరేలీ నివాసి. IIT ఖరగ్‌పూర్ వంటి అత్యున్నత విద్యాసంస్థలో మెకానికల్ ఇంజనీరింగ్ చదివి, ఆ తర్వాత అమెరికాకు చెందిన ఒక మల్టీనేషనల్ కంపెనీలో భారీ ప్యాకేజీతో ఉద్యోగం చేశారు. కానీ, శాంతి కోసం అన్వేషిస్తూ ఉద్యోగాన్ని వదిలి సన్యాసం స్వీకరించారు. 2025 కుంభమేళా సమయంలో ఆయన ఇంగ్లీష్‌లో అనర్గళంగా మాట్లాడుతూ ఆధ్యాత్మిక ప్రసంగాలు చేయడంతో సోషల్ మీడియాలో మిలియన్ల కొద్దీ వ్యూస్ వచ్చాయి.

ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నప్పటికీ, జీవితంలో తోడు అవసరమని భావించిన సిద్ధాంత్, గృహస్థాశ్రమంలోకి తిరిగి రావాలని నిర్ణయించుకున్నారు. బెంగళూరులో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్న ఒక యువతిని ఆయన వివాహం చేసుకున్నారు. ఆమె కూడా ఉన్నత విద్యావంతురాలు కావడం విశేషం. వీరి వివాహం అతి తక్కువ మంది బంధువుల సమక్షంలో సంప్రదాయబద్ధంగా జరిగింది.

IIT చదువుకున్న వ్యక్తి సన్యాసి కావడం ఆశ్చర్యం. మళ్ళీ పెళ్లి చేసుకోవడం ఇంకా పెద్ద ఆశ్చర్యం అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఆధ్యాత్మికత అంటే కేవలం అడవుల్లో ఉండటం మాత్రమే కాదు, బాధ్యతలను నెరవేరుస్తూ కూడా దైవ చింతనలో ఉండవచ్చని సిద్ధాంత్ అనుచరులు పేర్కొంటున్నారు. ఏది ఏమైనా, ఒక మేధావి సన్యాసిగా మారి మళ్ళీ సామాన్యుడిలా జీవితాన్ని ప్రారంభించడం భారతీయ ఆధ్యాత్మిక చరిత్రలో ఒక అరుదైన మలుపుగా పలువురు తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి…

Follow Us
సగ్గుబియ్యం వడలు.. ఇలా చేస్తే తింటే వంద రోగాలు మాయం!
సగ్గుబియ్యం వడలు.. ఇలా చేస్తే తింటే వంద రోగాలు మాయం!
ఈ ఒక్కటి వేసి పెరుగు పులుసు చేయండి.. అబ్బో అద్భుతం.. అమోఘం
ఈ ఒక్కటి వేసి పెరుగు పులుసు చేయండి.. అబ్బో అద్భుతం.. అమోఘం
వానాకాలంలో ఈ ఆకు కూరల జోలికి అస్సలు వెళ్లకండి..
వానాకాలంలో ఈ ఆకు కూరల జోలికి అస్సలు వెళ్లకండి..
స్విగ్గీ, జొమాటోలకు పోటీగా.. ఫ్లిప్‌కార్ట్‌లో ఫుడ్ డెలివరీ..!
స్విగ్గీ, జొమాటోలకు పోటీగా.. ఫ్లిప్‌కార్ట్‌లో ఫుడ్ డెలివరీ..!
ఆరోగ్యానికి మేలు చేసే... టేస్టీ హెల్దీ రాగి వెజిటెబుల్ సూప్!
ఆరోగ్యానికి మేలు చేసే... టేస్టీ హెల్దీ రాగి వెజిటెబుల్ సూప్!
అన్నంలోకి సూపర్ గా ఉండే మీల్ మేకర్ ఫ్రై!
అన్నంలోకి సూపర్ గా ఉండే మీల్ మేకర్ ఫ్రై!
నెలకు రూ.25,000 జీతం ఉంటే.. చివరికి PF ఎంత వస్తుందో తెలిస్తే..
నెలకు రూ.25,000 జీతం ఉంటే.. చివరికి PF ఎంత వస్తుందో తెలిస్తే..
అరటిపండు తింటే కలిగే ఈ 5 ఆరోగ్య ప్రయోజనాల గురించి మీకు తెలుసా..?
అరటిపండు తింటే కలిగే ఈ 5 ఆరోగ్య ప్రయోజనాల గురించి మీకు తెలుసా..?
మందుబాబులపై ఉక్కుపాదం.. హైదరాబాద్‌లో పోలీసుల ప్రత్యేక డ్రైవ్‌లు
మందుబాబులపై ఉక్కుపాదం.. హైదరాబాద్‌లో పోలీసుల ప్రత్యేక డ్రైవ్‌లు
శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్‌లో తీవ్ర విషాదం.. నీటిలో పడి నలుగురు మృతి
శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్‌లో తీవ్ర విషాదం.. నీటిలో పడి నలుగురు మృతి