AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

హాలో లేడీస్‌ బంపర్‌ న్యూస్‌.. తగ్గుతున్న బంగారం, వెండి ధరలు.. ఇవాళ తులం ఎంతో తెలిస్తే పరుగులు తీస్తారు..!

పసిడి ప్రియులకు సూపర్‌ గుడ్‌న్యూస్‌.. మగువలకే పండగే.. అవును మరీ.. ఈ వార్త తెలిస్తే మీరు కూడా ఎగిరి గంతేస్తారు.. ఎందుకంటే.. బంగారం, వెండి ధరలు భారీగా తగ్గాయి. బంగారం కొనాలని ప్లాన్ చేస్తున్న వారికి మార్కెట్ నుండి ఒక కీలకమైన అప్‌డేట్ వచ్చేసింది..! గోల్డ్‌ ధర వరుసగా మూడో రోజు కూడా పతనం దిశగా సాగింది. అంతర్జాతీయ భౌగోళిక రాజకీయ పరిస్థితులు, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ విషయంలో తీసుకున్న కఠిన నిర్ణయాల మధ్య బంగారం మార్కెట్ ఊగిసలాడుతోంది. దీంతో గత కొన్ని రోజులుగా తగ్గుతూ వస్తున్న బంగారం ధరలు, ఈ రోజు కూడా స్వల్ప తగ్గుదలను నమోదు చేశాయి.

హాలో లేడీస్‌ బంపర్‌ న్యూస్‌.. తగ్గుతున్న బంగారం, వెండి ధరలు.. ఇవాళ తులం ఎంతో తెలిస్తే పరుగులు తీస్తారు..!
Gold
Jyothi Gadda
|

Updated on: Apr 08, 2026 | 7:06 AM

Share

గోల్డ్‌ లవర్స్‌కి గుడ్‌న్యూస్‌..బంగారం ధర నెలచూపులు చూస్తోంది. నిజమేనండోయ్.. పుత్తడి ధర పతనం దిశగా సాగుతోంది. నగలు కొనాలని చూస్తున్న వారికి ఇది సదవకాశం అంటున్నారు నిపుణులు. ఇరాన్‌తో రెండు వారాల కాల్పుల విరమణ ఒప్పందాన్ని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన నేపథ్యంలో బంగారం ధరలు గణనీయంగా తగ్గాయి. ఈ దౌత్యపరమైన పురోగతి, ఇంతకుముందు ధరలను చారిత్రక గరిష్ట స్థాయిలకు దగ్గరగా ఉంచిన వార్ ప్రీమియంను నాటకీయంగా తగ్గించి, సురక్షిత ఆస్తులలో తీవ్రమైన అమ్మకాలకు దారితీసింది. దేశీయ మార్కెట్లో, బంగారం ధరలు వరుసగా మూడో రోజు కూడా పడిపోయాయి. ఆ వివరాల్లోకి వెళితే…

భారతదేశంలో ఈరోజు 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములు రూ1,49,830లకు పడిపోయింది. అదే 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములు రూ.1,37,340లకు చేరింది. అటు వెండి ధర కూడా భారీగా తగ్గుముఖం పట్టింది. వెండి ధర గ్రాముకు రూ. 254.90లు ఉండగా, భారత మార్కెట్‌లో కిలో వెండి ధర రూ. 2,54,900ల వద్ద కొనసాగుతోంది. దేశంలోని ఢిల్లీ, ముంభై, హైదరాబాద్‌ వంటి ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఇలా..

హైదరాబాద్‌లో బంగారం 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,49,830, 22 క్యారెట్ల గోల్డ్ 10గ్రాముల ధర రూ.1,37,340 ఉంది. వెండి కిలో ధర రూ.2,54,900 ఉంది.

విజయవాడ, విశాఖపట్నంలో 24 క్యారెట్ల పసిడి 10 గ్రాముల ధర రూ.1,49,850, 22 క్యారెట్ల గోల్డ్ 10గ్రాముల ధర రూ.1,37,360 ఉంది. వెండి కిలో ధర రూ.2,54,900 ఉంది.

ఢిల్లీలో 24 క్యారెట్ల గోల్డ్ 10 గ్రాముల ధర రూ.1,49,980, 22 క్యారెట్ల ధర రూ.1,37,490 గా ఉంది. వెండి కిలో ధర రూ.2,49,900 ఉంది.

ముంబైలో 24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర రూ.1,49,830, 22 క్యారెట్ల ధర రూ.1,37,340 గా ఉంది. వెండి కిలో ధర రూ.2,49,900 లుగా ఉంది.

చెన్నైలో 24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర రూ.1,51,190, 22 క్యారెట్ల ధర రూ.1,38,590 ఉంది. వెండి కిలో ధర రూ.2,54,900 లుగా ఉంది.

బెంగళూరులో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.1,49,830, 22 క్యారెట్ల ధర రూ.1,37,340 ఉంది. వెండి కిలో ధర రూ.2,49,900 లుగా ఉంది.

కాగా.. బంగారం, వెండి ధరలు అన్ని నగరాల్లో ఒకే విధంగా ఉండవు. స్థానిక డిమాండ్, సరఫరా, అలాగే రాష్ట్ర పన్నులు, తదితర అంశాల ప్రకారం ఎప్పటికప్పుడు మారుతుంటాయి.. అందుకే అన్ని ప్రధాన నగరాల్లో కూడా ధరల్లో వ్యత్యాసాలు ఉంటాయి. ఒకవేళ మీకు బంగారం, వెండి ధరల లేటెస్ట్ అప్‌డేట్ గురించి తెలుసుకోవాలంటే ఈ మొబైల్ నెంబర్‌కు 8955664433కు మిస్డ్ కాల్ ఇవ్వవచ్చు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
ఇంట్లో ఈ మొక్కలు పెట్టకండి.. కుటుంబంలో కలహాలు, ఆర్థిక సమస్యలు..
ఇంట్లో ఈ మొక్కలు పెట్టకండి.. కుటుంబంలో కలహాలు, ఆర్థిక సమస్యలు..
‘కింగ్‌ ఆఫ్‌ పాప్‌’ మైఖేల్ జాక్సన్‌.. జీవితంలో ఇంత విషాదం ఉందా?
‘కింగ్‌ ఆఫ్‌ పాప్‌’ మైఖేల్ జాక్సన్‌.. జీవితంలో ఇంత విషాదం ఉందా?
కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీస్.. మానస్ మాటలు మరింత ఆజ్యం..
కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీస్.. మానస్ మాటలు మరింత ఆజ్యం..
వాట్సప్ ద్వారా కరెంట్, వాటర్ బిల్లు చెల్లించడం ఎలా..?
వాట్సప్ ద్వారా కరెంట్, వాటర్ బిల్లు చెల్లించడం ఎలా..?
కోహ్లి ఆదర్శంతో UPSCలో 3వ ర్యాంక్ సాధించిన అనన్య.. సక్సెస్ స్టోరీ
కోహ్లి ఆదర్శంతో UPSCలో 3వ ర్యాంక్ సాధించిన అనన్య.. సక్సెస్ స్టోరీ
ఆయన పాటలు ప్రత్యేకం.. ఇప్పటికీ యూట్యూబ్‏ను షేక్ చేస్తున్న సాంగ్స్
ఆయన పాటలు ప్రత్యేకం.. ఇప్పటికీ యూట్యూబ్‏ను షేక్ చేస్తున్న సాంగ్స్
ఆ డైరెక్టర్ నాతో పెద్ద సినిమా తీశాడు
ఆ డైరెక్టర్ నాతో పెద్ద సినిమా తీశాడు
బ్రిక్స్‌లో భారత్‌: ప్రశ్నార్థకం నుంచి కీలక శక్తిగా
బ్రిక్స్‌లో భారత్‌: ప్రశ్నార్థకం నుంచి కీలక శక్తిగా
భూమిలోంచి ఉబికివస్తున్న వేడి నీరు.. ఈ ఊర్లో ఎక్కడ చూసినా ఇదే సీన్
భూమిలోంచి ఉబికివస్తున్న వేడి నీరు.. ఈ ఊర్లో ఎక్కడ చూసినా ఇదే సీన్
తెలుగులో స్టార్ హీరోయిన్ అవ్వాల్సింది.. ఇప్పుడు పెద్ద కంపెనీకి ..
తెలుగులో స్టార్ హీరోయిన్ అవ్వాల్సింది.. ఇప్పుడు పెద్ద కంపెనీకి ..