AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఓరీ దేవుడో ఇదో సైలెంట్ కిల్లర్.. కాటు వేస్తే కాటికే..! ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చేయకండి.

ఈ పాము కరిచినప్పుడు నొప్పి గానీ, వాపు గానీ ఉండదు, కేవలం చిన్న దోమ కుట్టినట్లు మాత్రమే అనిపిస్తుంది. దీనివల్ల బాధితులు నిద్రలోనే ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉంది. అందుకే దీనిని సైలెంట్ కిల్లర్ అంటారు. కట్ల పాము గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన కొన్ని కీలక విషయాలు, జాగ్రత్తలు ఇక్కడ ఉన్నాయి.

ఓరీ దేవుడో ఇదో సైలెంట్ కిల్లర్.. కాటు వేస్తే కాటికే..! ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చేయకండి.
Indian Krait
Jyothi Gadda
|

Updated on: Apr 08, 2026 | 10:26 AM

Share

పాములంటేనే భయం, అందులోనూ కట్ల పాము పేరు చెబితేనే ఒళ్లు గగుర్పొడుస్తుంది. దీని విషం అత్యంత తీవ్రమైనది. కట్ల పాము అత్యంత ప్రమాదకరమైనది మాత్రమే కాదు, చాలా నిశ్శబ్దంగా దాడి చేసే స్వభావం కలది. ఇది ఎక్కువగా రాత్రి సమయాల్లోనే సంచరిస్తుంది. దీని కాటు చాలా విచిత్రంగా ఉంటుంది. ఈ పాము కరిచినప్పుడు నొప్పి గానీ, వాపు గానీ ఉండదు, కేవలం చిన్న దోమ కుట్టినట్లు మాత్రమే అనిపిస్తుంది. దీనివల్ల బాధితులు నిద్రలోనే ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉంది. అందుకే దీనిని సైలెంట్ కిల్లర్ అంటారు. కట్ల పాము గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన కొన్ని కీలక విషయాలు, జాగ్రత్తలు ఇక్కడ ఉన్నాయి.

కట్ల పాము ఎందుకు ప్రమాదకరం?: భారతదేశంలో సంభవించే పాముకాటు మరణాలలో కట్ల పాము పాత్ర చాలా పెద్దది. దీనికి కొన్ని ప్రత్యేక లక్షణాలు ఉన్నాయి.

సైలెంట్ బైట్: ఇది కరిచినప్పుడు పళ్ళు చాలా చిన్నవిగా ఉండటం వల్ల పెద్దగా గాయం కనిపించదు. రాత్రి నిద్రలో ఉన్నవారికి పాము కరిచినట్లు కూడా తెలియదు.

ఇవి కూడా చదవండి

రాత్రి సంచారి: ఇవి పగలు బొరియల్లో లేదా చీకటి ప్రదేశాల్లో ఉండి, రాత్రి వేళల్లో ఆహారం కోసం బయటకు వస్తాయి. ముఖ్యంగా మనుషుల శరీర వెచ్చదనం కోసం ఇళ్లలోకి వచ్చే అవకాశం ఉంది.

న్యూరోటాక్సిన్ విషం: దీని విషం నరాల పనితీరును స్తంభింపజేస్తుంది. సరైన సమయంలో చికిత్స అందకపోతే శ్వాస వ్యవస్థ ఆగిపోయి మరణం సంభవిస్తుంది.

గుర్తించాల్సిన లక్షణాలు:

పాము కరిచిన తర్వాత కొన్ని గంటల్లోనే తీవ్రమైన కడుపు నొప్పి, కనురెప్పలు వాలిపోవడం (Ptosis), మాట పడిపోవడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, కీళ్ల నొప్పులు వంటి లక్షణాలు కనిపిస్తాయి. చాలామంది వీటిని సాధారణ అనారోగ్యంగా భావించి పొరపాటు పడుతుంటారు.

తీసుకోవాల్సిన జాగ్రత్తలు:

నేలపై పడుకోకండి: వర్షాకాలం, వేసవి కాలంలో కట్ల పాములు ఎక్కువగా సంచరిస్తాయి. కాబట్టి నేలపై పడుకోకుండా మంచం వాడటం, దోమతెరలు కట్టుకోవడం ఉత్తమం.

పరిసరాల శుభ్రత: ఇంటి చుట్టూ చెత్తాచెదారం లేకుండా చూసుకోవాలి. ఎలుకలు ఉన్నచోట పాములు వచ్చే అవకాశం ఎక్కువ.

తక్షణ చికిత్స: పాము కరిచినట్లు అనుమానం వస్తే ఏమాత్రం ఆలస్యం చేయకుండా బాధితుడిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించాలి. అక్కడ అందుబాటులో ఉండే యాంటీ స్నేక్ వెనమ్ ప్రాణాలను కాపాడుతుంది.

పామును చంపడం కంటే దాని బారి నుండి మనల్ని మనం కాపాడుకోవడం ముఖ్యం. కట్ల పాము విషయంలో అవగాహన ఉంటే ప్రాణాపాయం నుండి తప్పించుకోవచ్చు.

మరిన్ని హ్యుమన్‌ ఇంట్రెస్ట్‌ వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us