AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Egg Curry Recipe: గుడ్డు పులుసు ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.. అన్నం, చపాతీల్లోకి పర్ఫెక్ట్ రెసిపీ

గుడ్డు... కేవలం పోషకాల గని మాత్రమే కాదు, అన్ని కాలాల్లోనూ అందుబాటులో ఉండే చవకైన, ఆరోగ్యకరమైన ఆహారం. పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఇష్టపడే ఈ గుడ్డుతో ఎన్నో రకాల వంటలు చేసుకోవచ్చు. మరి అలాంటి గుడ్డుతో నోరూరించే పులుసు (గుడ్డు కూర) ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఇలా చేస్తే ఒక్క మెతుకు కూడా మిగలకుండా అందరూ లొట్టలేసుకుని తినేస్తారు..

Egg Curry Recipe: గుడ్డు పులుసు ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.. అన్నం, చపాతీల్లోకి పర్ఫెక్ట్ రెసిపీ
Egg Curry Recipe
Bhavani
|

Updated on: May 21, 2025 | 6:10 PM

Share

గుడ్డులో ప్రొటీన్లు, రిబోఫ్లేవిన్, ఫోలేట్, ఐరన్, ఫాస్పరస్, సెలీనియం, మెగ్నీషియం, విటమిన్ A, E, B6 వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి కండరాలు, కణజాలాల పెరుగుదలకు కావాల్సిన పోషణను అందిస్తాయి. జుట్టు పెరుగుదల నుండి గుండె ఆరోగ్యం వరకు గుడ్డు అనేక విధాలుగా శరీరానికి మేలు చేస్తుంది.

కావాల్సిన పదార్థాలు:

గుడ్లు – 4

పెద్ద ఉల్లిపాయలు – 2

టమాటా – 1

వెల్లుల్లి – 10 రెబ్బలు

ధనియాల పొడి – 2 1/2 టీస్పూన్లు

పసుపు – 1/4 టీస్పూన్

కారం – 1/2 టీస్పూన్

కొత్తిమీర తరుగు – ఒక కట్ట

నూనె – 4 టీస్పూన్లు

ఉప్పు – తగినంత

తయారీ విధానం:

ముందుగా, మూడు గుడ్లను ఒక గిన్నెలో వేసి అవి మునిగే వరకు నీళ్లు పోసి, 10 నిమిషాల పాటు ఉడికించాలి. అవి చల్లారాక పొట్టు తీసి, నిలువుగా రెండు భాగాలుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత ఉల్లిపాయలు, టమాటా సన్నగా తరిగి పెట్టుకోవాలి. వెల్లుల్లి రెబ్బలను పొట్టు తీసి శుభ్రం చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక పాత్ర పెట్టి నూనె వేసి వేడెక్కాక వెల్లుల్లి వేసి వేయించాలి. ఆ తర్వాత తరిగిన ఉల్లిపాయలను వేసి బంగారు రంగు వచ్చేవరకు వేయించి పక్కన పెట్టుకోవాలి. అదే పాత్రలో తరిగిన టమాటాలను వేసి మగ్గనివ్వాలి. టమాటా మగ్గిన తర్వాత ఉప్పు, పసుపు, కారం, ధనియాల పొడి, తగినంత నీళ్లు కలిపి బాగా మరిగించాలి. పులుసు బాగా మరిగిన తర్వాత మిగిలిన ఒక గుడ్డును పగలగొట్టి మరుగుతున్న పులుసులో వేసి బాగా కలిపి మరిగించాలి. చివరగా, ముందుగా ఉడికించి కట్ చేసుకున్న గుడ్లను వేసి ఒకసారి మరిగించి, సన్నగా తరిగిన కొత్తిమీరతో గార్నిష్ చేసి దించేయాలి.

ఢిల్లీ టీమ్‎కి బై బై..కింగ్ కోహ్లీ సడన్ ఎగ్జిట్ వెనుక నిజం ఇదే
ఢిల్లీ టీమ్‎కి బై బై..కింగ్ కోహ్లీ సడన్ ఎగ్జిట్ వెనుక నిజం ఇదే
Rewind 2025: టాలీవుడ్‌పై బాలీవుడ్ స్టార్ల దండయాత్ర..!
Rewind 2025: టాలీవుడ్‌పై బాలీవుడ్ స్టార్ల దండయాత్ర..!
కేబినెట్‌ కూర్పుపై సీఎం రేవంత్ కసరత్తు.. రేసులో ఉన్నది ఎవరు?
కేబినెట్‌ కూర్పుపై సీఎం రేవంత్ కసరత్తు.. రేసులో ఉన్నది ఎవరు?
సూర్యపై వేటు, గిల్‌కు నోఛాన్స్.. భారత టీ20 కెప్టెన్‌గా ఎవరంటే?
సూర్యపై వేటు, గిల్‌కు నోఛాన్స్.. భారత టీ20 కెప్టెన్‌గా ఎవరంటే?
గోల్డ్‌ లవర్స్‌కి బ్యాడ్‌ న్యూస్‌! ఆల్‌టైమ్ హైకి చేరుకున్న బంగారం
గోల్డ్‌ లవర్స్‌కి బ్యాడ్‌ న్యూస్‌! ఆల్‌టైమ్ హైకి చేరుకున్న బంగారం
రజినీకాంత్‏తో బ్లాక్ బస్టర్.. సైడ్ క్యారెక్టర్స్ మాత్రమే వచ్చాయి.
రజినీకాంత్‏తో బ్లాక్ బస్టర్.. సైడ్ క్యారెక్టర్స్ మాత్రమే వచ్చాయి.
Re-Entry 2025 కమ్ బ్యాక్ తో ఇండస్ట్రీని షేక్ చేస్తున్న స్టార్స్​!
Re-Entry 2025 కమ్ బ్యాక్ తో ఇండస్ట్రీని షేక్ చేస్తున్న స్టార్స్​!
రియల్​ లైఫ్​ కపుల్​ రీల్​ లైఫ్​లోనూ.. అంచనాలు పెంచేస్తున్నారుగా!
రియల్​ లైఫ్​ కపుల్​ రీల్​ లైఫ్​లోనూ.. అంచనాలు పెంచేస్తున్నారుగా!
ఐకాన్ స్టార్ ఇంట క్రిస్మస్ వెలుగులు.. షేర్ చేసిన స్నేహా రెడ్డి
ఐకాన్ స్టార్ ఇంట క్రిస్మస్ వెలుగులు.. షేర్ చేసిన స్నేహా రెడ్డి
సుదీర్ఘ విరామం తర్వాత వెండితెరపైకి సీనియర్ బ్యూటీ రీఎంట్రీ!
సుదీర్ఘ విరామం తర్వాత వెండితెరపైకి సీనియర్ బ్యూటీ రీఎంట్రీ!