Vellulli Rasam: ఇమ్యూనిటీని పెంచే వెల్లుల్లి రసం.. ఇలా చేస్తే సూపర్ టేస్ట్!
వేసవి కాలంలో రోగాల బారిన ఎక్కువగా పడుతూ ఉంటారు. ఎండ వేడికి ముఖ్యంగా నీరసం, అలసట ఎక్కువగా ఉంటాయి. వీటిని తట్టుకోవాలంటే శరీరంలో తగినంతగా రోగ నిరోధక శక్తి ఉండాలి. ఇమ్యూనిటీని పెంచే ఫుడ్స్ తీసుకోవాలి. వేసవి కాలంలో రోగ నిరోధక శక్తిని పెంచేందుకు వెల్లుల్లి రసం బాగా సహాయ పడుతుంది. వారంలో రెండు సార్ల చొప్పున వెల్లుల్లి రసం తీసుకుంటే ఇమ్యూనిటీ లెవల్స్..

వేసవి కాలంలో రోగాల బారిన ఎక్కువగా పడుతూ ఉంటారు. ఎండ వేడికి ముఖ్యంగా నీరసం, అలసట ఎక్కువగా ఉంటాయి. వీటిని తట్టుకోవాలంటే శరీరంలో తగినంతగా రోగ నిరోధక శక్తి ఉండాలి. ఇమ్యూనిటీని పెంచే ఫుడ్స్ తీసుకోవాలి. వేసవి కాలంలో రోగ నిరోధక శక్తిని పెంచేందుకు వెల్లుల్లి రసం బాగా సహాయ పడుతుంది. వారంలో రెండు సార్ల చొప్పున వెల్లుల్లి రసం తీసుకుంటే ఇమ్యూనిటీ లెవల్స్ అనేవి బాగా పెరుగుతాయి. ఈ రసం తయారు చేసుకోవడం కూడా చాలా సింపుల్. మరి దీన్ని ఎలా తయారు చేస్తారో.. కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
వెల్లుల్లి రసానికి కావాల్సిన పదార్థాలు:
వెల్లుల్లి రెబ్బలు, పచ్చి మిర్చి, నెయ్యి లేదా నూనె, టమాటా, చింత పండు, ఎండు మిర్చి, ఆవాలు, ఉప్పు, ఇంగువ, కారం, పసుపు, కరివేపాకు, కొత్తిమీర తరుగు, నువ్వులు, శనగపప్పు. మెంతులు, ధనియాలు.
వెల్లుల్లి రసం తయారీ విధానం:
వెల్లుల్లి రసం తయారు చేసుకోవడానికి ముందుగా మసాలా పొడిని తయారు చేసుకోవాలి. స్టవ్ వెలిగించి.. కడాయి పెట్టాలి. మెంతులు, జీలకర్ర, ధనియాలు, శనగ పప్పు, నువ్వులు వేసి వేయించుకోవాలి. ఇవి చల్లారాక.. మిక్సీలో వేసి మెత్తగా పొడి తయారు చేయాలి. దీంతో వెల్లుల్లి రసానికి కావాల్సిన పొడి తయారైనట్టే. ఇప్పుడు చింత పండు కొద్దిగా తీసుకుని నీటిలో వేసి నానబెట్టుకోవాలి. ఆ తర్వాత టమాటాలను కూడా మిక్సీలో వేసి పేస్ట్‌లా చేసుకోవాలి. పచ్చి మిర్చిని, వెల్లుల్లిని వేరు వేరుగా దంచి పక్కన పెట్టాలి. ఇప్పుడు మళ్లీ స్టవ్ మీద కడాయి పెట్టి.. ఆయిల్ లేదా నెయ్యి వేసుకోవాలి. ఇప్పుడు ఆవాలు, జీలకర్ర, ఎండు మిర్చి వేసి వేయించాలి.
ఆ నెక్ట్స్ కరివేపాకులు, ఇంగువ కూడా వేసి ఫ్రై చేయాలి. ఆ తర్వాత దంచిన వెల్లుల్లి రెబ్బలు, పచ్చి మిర్చి వేసి వేయించుకోవాలి. నెక్ట్స్ పసుపు, కారం, ఉప్పు వేసి కలపాలి. ఆ తర్వాత చింత పండు రసం వేసి కాసేప మరగనివ్వాలి. ఇప్పుడు మసాలా పొడి కూడా వేసి.. మంటను మీడియంలో పెట్టి చిన్న మంట మీద పది నిమిషాలు మరిగించాలి. చివరగా కొత్తి మీర చల్లి సర్వ్ చేసుకోవాలి. అంతే ఎంతో రుచిగా ఉండే వెల్లుల్లి రసం తయారు. దీన్ని అన్నంలో వేసుకుని తినవచ్చు. లేదా ఫ్రిజ్‌లో పెట్టుకుని చల్లగా సూప్‌లా తాగవచ్చు.