Karivepaku Rice: హెల్దీ అండ్ టేస్టీ కరివేపాకు రైస్.. ఇలా చేస్తే ఎంతో ఆరోగ్యం..
ఆరోగ్యంగా ఉండాలంటే హెల్దీగా ఉండే ఆహారాలు తీసుకోవాలి. అలాగే ఫాస్ట్‌గా అయిపోవాలి అనుకుంటారు. అలాంటి వాటిల్లో కరివేపాకు రైస్ చాలా బెస్ట్. కరివేపాకు ఆరోగ్యానికి ఎంతో మంచిదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. కరివేపాకుతో ఎన్నో అనారోగ్య సమస్యలకు చెక్ పెట్టొచ్చు. ఈ రైస్‌ని ఇన్‌స్టెంట్‌గా అప్పటికప్పుడు తయారు చేసుకోవచ్చు. లంచ్ బాక్సుల్లోకి, డిన్నర్‌లోకి చాలా బావుంటుంది. సింపుల్‌గా ఉండటమే కాకుండా ఆరోగ్యం..

ఆరోగ్యంగా ఉండాలంటే హెల్దీగా ఉండే ఆహారాలు తీసుకోవాలి. అలాగే ఫాస్ట్‌గా అయిపోవాలి అనుకుంటారు. అలాంటి వాటిల్లో కరివేపాకు రైస్ చాలా బెస్ట్. కరివేపాకు ఆరోగ్యానికి ఎంతో మంచిదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. కరివేపాకుతో ఎన్నో అనారోగ్య సమస్యలకు చెక్ పెట్టొచ్చు. ఈ రైస్‌ని ఇన్‌స్టెంట్‌గా అప్పటికప్పుడు తయారు చేసుకోవచ్చు. లంచ్ బాక్సుల్లోకి, డిన్నర్‌లోకి చాలా బావుంటుంది. సింపుల్‌గా ఉండటమే కాకుండా ఆరోగ్యం కూడా మీ సొంతం అవుతుంది. అంతే కాకుండా శరీరానికి కూడా మంచి పోషకాలు అందుతాయి. మరి ఈ కరివేపాకు రైస్ ఎలా తయారు చేస్తారు? వీటికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.
కరివేపాకు రైస్ తయారీకి కావాల్సిన పదార్థాలు:
కరివేపాకు, అన్నం, శనగపప్పు, మిరియాలు, ధనియాలు, జీలకర్ర, మినపప్పు, ఎండు మిర్చి, వెల్లుల్లి రెబ్బలు, నువ్వులు, పల్లీలు, జీడిపప్పు, ఇంగువ, ఉప్పు, ఆయిల్.
కరివేపాకు రైస్ తయారీ విధానం:
ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టి ఆయిల్ వేయాలి. ఆయిల్ వేడెక్కాక.. కరివేపాకులు, నువ్వులు, వెల్లుల్లి రెబ్బలు, ధనియాలు, ఎండుమిర్చి, మిరియాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు వేసి బాగా వేయించుకోవాలి. అవన్నీ వేగాక.. చల్లారబెట్టుకోవాలి. తర్వాత మిక్సీలో వేసి పొడిలా తయారు చేసి పక్కన పెట్టాలి. ఇప్పుడు మరో పాన్ పెట్టి.. ఆయిల్ వేసి పల్లీలు, ఇంగువ, కరివేపాకులు, జీడి పప్పు వేసి ఫ్రై చేసుకోవాలి.
ఆ తర్వాత ఉడికించి పెట్టుకున్న అన్నాన్ని కూడా వేసి కలుపుకోవాలి. ఆ తర్వాత మిక్సీ పట్టుకున్న పొడి కూడా వేసి బాగా కలుపుకోవాలి. ఇలా ఓ రెండు నిమిషాలు వేయించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే ఎంతో టేస్టీ అండ్ హెల్దీ కరివేపాకు రైస్ సిద్ధం. ఇంకెందుకు లేట్ మీరు కూడా ఓ సారి ట్రై చేయండి.








