Shahi Dal: షాహీ పప్పును ఇలా చేశారంటే.. పప్పు ఇష్టం లేని వారు కూడా తినేస్తారు..

| Edited By: Ram Naramaneni

Jul 29, 2024 | 2:00 PM

పప్పు అంటే చాలా మందికి ఇష్టం. కూరలు ఎలా ఉన్నా పప్పు ఉంటే తినేయవచ్చు. అంత ఇష్టమైన పప్పును ఇంకా రుచిగా కూడా చేసుకోవచ్చు. షాహీ పప్పు గురించి వినే ఉంటారు. టైమ్ తక్కువగా ఉన్నప్పుడు మనం దీన్ని ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఈ పప్పును చపాతీ, రోటీ, పులావ్, అన్నంలోకి ఎలా తిన్నా బాగుంటుంది. ఈ పప్పును శనగ పప్పు, పెసర పప్పుతో తయారు చేస్తారు. ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఆఫీసులకు వెళ్లేవారికి సమయం లేనప్పుడు..

Shahi Dal: షాహీ పప్పును ఇలా చేశారంటే.. పప్పు ఇష్టం లేని వారు కూడా తినేస్తారు..
Shahi Dal
Follow us on

పప్పు అంటే చాలా మందికి ఇష్టం. కూరలు ఎలా ఉన్నా పప్పు ఉంటే తినేయవచ్చు. అంత ఇష్టమైన పప్పును ఇంకా రుచిగా కూడా చేసుకోవచ్చు. షాహీ పప్పు గురించి వినే ఉంటారు. టైమ్ తక్కువగా ఉన్నప్పుడు మనం దీన్ని ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఈ పప్పును చపాతీ, రోటీ, పులావ్, అన్నంలోకి ఎలా తిన్నా బాగుంటుంది. ఈ పప్పును శనగ పప్పు, పెసర పప్పుతో తయారు చేస్తారు. ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఆఫీసులకు వెళ్లేవారికి సమయం లేనప్పుడు ఈ పప్పును ట్రై చేయండి. త్వరగా ఫినిష్ అవుతుంది. ఇంతకీ ఈ షాహీ పప్పును ఎలా తయారు చేస్తారు? ఈ పప్పుకు కావాల్సిన పదార్థాల గురించి ఇప్పుడు చూద్దాం.

షాహీ పప్పుకి కావాల్సిన పదార్థాలు:

శనగ పప్పు, పెసర పప్పు, ఉల్లిపాయలు, పచ్చి మిర్చి, టమాటాలు, యాలకులు, దాల్చిన చెక్క, మిరియాలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, ఉప్పు, పసుపు, కొత్తిమీర, కరివేపాకు, ఆయిల్ లేదా బటర్ లేదా నెయ్యి.

షాహీ పప్పు తయారీ విధానం:

ముందుగా శనగ పప్పు, పెసర పప్పు రెండూ సమాన భాగాలుగా తీసుకుని శుభ్రంగా కడగాలి. ఆ తర్వాత రెండు గంటల పాటు నానబెట్టాలి. ఇప్పుడు వీటిని కుక్కర్‌లో వేసి మూడు విజిల్స్ వచ్చేంత వరకూ ఉడికించుకోవాలి. వేడి చల్లారే వరకు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మరో కడాయి తీసుకుని స్టవ్ మీద పెట్టాలి. ఇందులో నెయ్యి లేదా బటర్ వేసి వేడి చేయాలి. నెయ్యి, బటర్ లేని వాళ్లు ఆయిల్ వేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో మిరియాలు, దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు వేసి వేయించాలి. ఆ తర్వాత ఉల్లిపాయల తరుగు, పచ్చి మిర్చి వేసి మరోసారి కలుపుకోవాలి.

ఇవి కూడా చదవండి

ఉల్లిపాయలు బాగా వేగాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయేంత వరకు వేయించాలి. ఇప్పుడు పసుపు, ఉప్పు, కారం వేసి వేగిన తర్వాత టమాటా ముక్కలు కూడా వేసి మూత పెట్టి చిన్న మంట పెట్టాలి. టమాటా ముక్కలు మెత్తగా అయ్యాక ఉడకబెట్టిన పప్పును నీళ్లతో సహా వేసి మూత పెట్టాలి. ఇప్పుడు పప్పు దగ్గర పడ్డాక..కరివేపాకు, కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేయాలి. అంతే ఎంతో రుచిగా ఉండే షాహీ పప్పు సిద్ధం.