Rava Pulihora: శ్రావణ మాసంలో బెస్ట్ రెసిపీ.. రవ్వ పులిహోర ఇలా తయారు చేస్తే లొట్టలేయాల్సిందే..

| Edited By: Shaik Madar Saheb

Aug 06, 2024 | 9:21 PM

శ్రావణ మాసం మొదలై పోయింది. శ్రావణ మాసంలో ఎక్కువగా సోమ, మంగళ, శుక్రవారాలు పూజలు చేస్తూ ఉంటారు. ఈ క్రమంలో చాలా మంది ప్రసాదాలు తయారు చేస్తూ ఉంటారు. త్వరగా అయిపోయే ప్రసాదాలే చాలా మంది చేస్తూ ఉంటారు. అలా చాలా ఫాస్ట్‌గా చేసే ప్రసాదాల్లో రవ్వ పులిహోర కూడా ఒకటి. ఇది చాలా సింపుల్‌గానే కాకుండా.. ఫాస్ట్‌గా చేసుకోవచ్చు. రుచి కూడా చాలా బాగుంటుంది. మరి ఇంత రుచికరమైన..

Rava Pulihora: శ్రావణ మాసంలో బెస్ట్ రెసిపీ.. రవ్వ పులిహోర ఇలా తయారు చేస్తే లొట్టలేయాల్సిందే..
Rava Pulihora
Follow us on

శ్రావణ మాసం మొదలై పోయింది. శ్రావణ మాసంలో ఎక్కువగా సోమ, మంగళ, శుక్రవారాలు పూజలు చేస్తూ ఉంటారు. ఈ క్రమంలో చాలా మంది ప్రసాదాలు తయారు చేస్తూ ఉంటారు. త్వరగా అయిపోయే ప్రసాదాలే చాలా మంది చేస్తూ ఉంటారు. అలా చాలా ఫాస్ట్‌గా చేసే ప్రసాదాల్లో రవ్వ పులిహోర కూడా ఒకటి. ఇది చాలా సింపుల్‌గానే కాకుండా.. ఫాస్ట్‌గా చేసుకోవచ్చు. రుచి కూడా చాలా బాగుంటుంది. మరి ఇంత రుచికరమైన రవ్వ పులిహోరను ఎలా తయారు చేస్తారు? దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

రవ్వ పులిహోరకు కావాల్సిన పదార్థాలు:

బియ్యం రవ్వ, పసుపు, ఉప్పు, ఆయిల్, తాళింపు దినుసులు, కరివేపాకు, కొత్తిమీర, పచ్చి మిర్చి, ఎండు మిర్చి, అల్లం, జీడిపప్పు, ఇంగువ, నిమ్మరసం.

రవ్వ పులిహోర తయారీ విధానం:

ముందుగా పచ్చి మిర్చి, అల్లాన్ని కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. నిమ్మరసం కూడా పిండి తీసుకోవాలి. కరివేపాకు, కొత్తిమీర కడిగి ఓ ప్లేట్ లోకి తీసుకోండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి.. లోతుగా ఉండే ఓ పాత్రలోకి నీళ్లు, పసుపు, ఉప్పు, ఆయిల్ వేసి వేడి చేయాలి. నీరు బాగా మరుగుతున్నప్పుడు అందులో బియ్యం రవ్వను వేసి మూత పెట్టాలి. బియ్యం రవ్వ కొద్దిగా ఉడకగానే ఓ ప్లేట్ లోకి తీసుకోండి.

ఇవి కూడా చదవండి

ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టి ఆయిల్ వేయాలి. ఇందులో ముందుగా అల్లం, పచ్చి మిర్చి ముక్కలు వేసి వేయించాక.. జీడిపప్పు వేసి ఫ్రై చేయాలి. ఆ తర్వాత తాళింపు దినుసుకు, ఎండు మిర్చి, ఇంగువ, కరివేపాకు, కొత్తిమీర వేసి బాగా వేయించాలి. తాళింపు ఎర్రగా వేగాక.. ముందుగా ఉడికించి పెట్టుకున్న రవ్వ మీద వేయండి. ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోండి. చివరిలో నిమ్మరసం పిండి సర్వ్ చేసుకోవడమే. అంతే ఎంతో రుచిగా ఉండే రవ్వ పులిహోర సిద్ధం.