Prawns Masala Curry: రొయ్యల మసాలా కర్రీ.. ఇలా చేస్తే వండుతుండగానే నోరు ఊరిపోతుంది..
నాన్ వెజ్ ఇష్ట పడేవారిలో రొయ్యలు కూడా ఒకటి. రొయ్యలు అంటే చాలా మందికి ఇష్టం. రొయ్యలతో పచ్చడి, స్నాక్స్, కర్రీలు, బిర్యానీలు ఏం చేసినా చాలా రుచిగా ఉంటాయి. అయితే ఎప్పుడూ చేసేలా కాకుండా ఈసారి ఇలా చేశారంటే రొయ్యల మసాలా కర్రీ చాలా రుచిగా ఉంటుంది. ఈ కర్రీ చపాతీ, అన్నం, పులావ్‌లో వేసుకుని తింటే మంచి రుచి వస్తుంది..
నాన్ వెజ్ ఇష్ట పడేవారిలో రొయ్యలు కూడా ఒకటి. రొయ్యలు అంటే చాలా మందికి ఇష్టం. రొయ్యలతో పచ్చడి, స్నాక్స్, కర్రీలు, బిర్యానీలు ఏం చేసినా చాలా రుచిగా ఉంటాయి. అయితే ఎప్పుడూ చేసేలా కాకుండా ఈసారి ఇలా చేశారంటే రొయ్యల మసాలా కర్రీ చాలా రుచిగా ఉంటుంది. ఈ కర్రీ చపాతీ, అన్నం, పులావ్‌లో వేసుకుని తింటే మంచి రుచి వస్తుంది. వండేటప్పుడే మంచి సువాసన వస్తుంది. ఈ సువాసనకు ఎప్పుడు తిందామా అని అంటూ ఉంటారు. చాలా సింపుల్‌గా కూడా ఈ కర్రీని తయారు చేయవచ్చు. మరి ఈ రొయ్యల మసాలా కర్రీని ఎలా తయారు చేస్తారు? రొయ్యల మసాలా కర్రీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.
రొయ్యల మసాలా కర్రీకి కావాల్సిన పదార్థాలు:
రొయ్యలు, ఉల్లిపాయలు, పచ్చి మిర్చి, టమాటాలు, కొత్తిమీర, కరివేపాకు, కారం, పసుపు, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మాసాలా, ధనియాలు, జీలకర్ర, మిరియాలు, ఆయిల్.
రొయ్యల మసాలా కర్రీ తయారీ విధానం:
ముందుగా ధనియాలు, మిరియాలు, జీలకర్ర వేయించి పొడిలా చేసుకోవాలి. ఇప్పుడు రొయ్యలను కూడా ముందుగానే వేయించి పక్కన పెట్టాలి. ముందుగా ఒక కర్రీ పాన్ తీసుకుని అందులో ఉల్లిపాయలు, పచ్చి మిర్చి వేసి వేయించిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేయాలి. ఆ తర్వాత టమాటా ముక్కలు కూడా వేసి మెత్తగా అయ్యేంత వరకు కుక్ చేయాలి. టమాటా ముక్కలు మగ్గిన తర్వాత కారం, ఉప్పు, పసుపు, మిక్సీ పట్టిన పొడి.. వేసి ఓ రెండు నిమిషాలు వేయించాక.. రొయ్యలు కూడా వేయాలి. ఇప్పుడు కరివేపాకు, కొత్తిమీర వేసి ఒకసారి కలిపి నీళ్లు వేసి దగ్గర పడేంత వరకు ఉడికించాలి. చివరగా గరం మసాలా వేసి ఆయిల్ పైకి తేలేంత వరకు చూడాలి. ఆయిల్ పైకి తేలాక కొత్తిమీర చల్లి స్టవ్ ఆఫ్ చేయాలి.