
జన్మాష్టమి రోజున ప్రత్యేకమైన స్వీట్ ఉండాలి. ఎప్పుడూ ఒకే లాంటి స్వీట్ కాకుండా.. ఈసారి కొత్తగా ట్రై చేయండి. ఇంట్లోనే ఇలా మలాయీ మాల్పువా ట్రై చేయండి. ఇది ఎంతో స్వీట్‌గా, రుచిగా ఉంటుంది. సాఫ్ట్‌గా అలా నోట్లో వేస్తే కరిగిపోతాయి. ఈ సారి మీ బ్రదర్ కోసం వెరైటీగా ఈ స్వీట్ తయారు చేయండి. ఖచ్చితంగా నచ్చుతాయి. మరి ఈ స్వీట్ ఎలా తయారు చేస్తారు? ఈ స్వీట్ తయారు చేయడానికి ఎలాంటి పదార్థాలు కావాలో ఇప్పుడు తెలుసుకుందాం.
మైదా, పంచదార, కోవా, నెయ్యి, డ్రై ఫ్రూట్స్, యాలకుల పొడి, పాలు, కుంకుమ పువ్వు, రోజ్ వాటర్, బేకింగ్ సోడా, పెరుగు.
ముందుగా ఒక గిన్నె తీసుకోవాలి. ఇందులో కొద్దిగా మైదా, బేకింగ్ సోడా, పంచదార, యాలకుల పొడి వేసి బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత కోవా, పెరుగు కూడా వేసి కలుపుకోవాలి. కోవాకు బదులు పాల పొడి కూడా ఉపయోగించవచ్చు. పెరుగు పుల్లగా లేకుండా చూసుకోండి. కావాలంటే కొద్దిగా నీళ్లు వేసుకుంటూ.. పిండిని మరీ గట్టిగా కాకుండా.. పల్చగా కాకుండా కలపాలి. ఈ పిండిని ఓ అరగంట సేపు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పంచదార పాకం తీసుకోవాలి.
ఒక గిన్నె తీసుకుని స్టవ్ మీద పెట్టి.. అందులో పంచదార, నీళ్లు వేసి పాకం తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక పాన్ తీసుకుని.. అందులో కొద్దిగా నెయ్యి వేసి వేడి చేసుకోవాలి. ఈ నెయ్యిలో పిండిని ఒక్కో గరిట వేసుకుంటూ ఉండాలి. ఇవి కాస్త రంగులోకి మారగానే వెనక్కి తిప్పాలి. ఇలా రెండు వైపులా ఎర్రగా వేయించాక.. తీసి పంచదార పాకంలో వేసుకోవాలి.
ఇప్పుడు రబ్డీ తయారు చేసుకోవాలి. పాలను మదంగా ఉండే పాత్రలో వేసి మరిగించుకోవాలి. పాలు చిక్కగా అయ్యాక.. పంచదార, కుంకుమ పొడి, యాలకుల పొడి వేసి బాగా కలపాలి. ఇది చిక్కగా అయ్యాక ఇందులో కొద్దిగా రోజ్ వాటర్ వేసి కలిపి దించాలి. ఇప్పుడు వీటిని రబ్డీని సర్వింగ్ ప్లేట్ లేదా గిన్నెలో వేసి ఆ తర్వాత ఇందులో పాకం మాల్పూవాలు వేసి ఓ ఐదు నిమిషాలు ఉంచి సర్వ్ చేసుకోవాలి. అంతే ఎంతో రుచిగా ఉండే మలాయీ మాల్పూవాలు సిద్ధం.