Potato Balls: పిల్లలకు నచ్చేలా టేస్టీగా కొరియన్ చిల్లీ పొటాటో బాల్స్..

కొరియన్ బ్యూటీ టిప్సే కాదు.. కొరియన్ వంటలకు కూడా బాగా డిమాండ్ పెరిగింది. చాలా మంది ఈ వంటకాలను ట్రై చేసి టేస్ట్‌ని ఎంజాయ్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో కూడా ఈ వంటలు బాగా పాపులర్ అవుతున్నాయి. కొరియన్ స్పైసీ న్యూడుల్స్‌కి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. లేటెస్ట్‌గా మీ కోసం కొరియన్ రెసిపీ పొటాటో బాల్స్‌ని మీ ముందుకు తీసుకొచ్చాం..

Potato Balls: పిల్లలకు నచ్చేలా టేస్టీగా కొరియన్ చిల్లీ పొటాటో బాల్స్..
Korean Potato Balls
Follow us
Chinni Enni

| Edited By: Ravi Kiran

Updated on: Jan 28, 2025 | 9:13 PM

కొరియన్ బ్యూటీ టిప్సే కాదు.. కొరియన్ వంటలకు కూడా బాగా డిమాండ్ పెరిగింది. చాలా మంది ఈ వంటకాలను ట్రై చేసి టేస్ట్‌ని ఎంజాయ్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో కూడా ఈ వంటలు బాగా పాపులర్ అవుతున్నాయి. కొరియన్ స్పైసీ న్యూడుల్స్‌కి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. లేటెస్ట్‌గా మీ కోసం కొరియన్ రెసిపీ పొటాటో బాల్స్‌ని మీ ముందుకు తీసుకొచ్చాం. ఈ రెసిపీ పిల్లలకు బాగా నచ్చుతుంది. అదే కొరియన్ స్టైల్ పొటాటో బాల్స్. మరి ఈ రెసిపీ ఎలా తయారు చేస్తారో ఇప్పుడు చూద్దాం.

కొరియన్ పొటాటో బాల్స్‌కి కావాల్సిన పదార్థాలు:

చిన్న సైజు బంగాళ దుంపలు, కార్న్ ఫ్లోర్, వెల్లుల్లి, సోయాసాస్, కొత్తిమీర, నువ్వులు, కారం, ఆయిల్.

ఇవి కూడా చదవండి

కొరియన్ పొటాటో బాల్స్‌‌ తయారీ విధానం:

చిన్న సైజు బంగాళ దుంపలు లభిస్తే తీసుకోండి. ఇది దొరకని వారు పెద్ద బంగాళ దుంపల్ని కూడా వాడవచ్చు. ఆలుగడ్డలను నీటిలో ఉడికించి పక్కన పెట్టాలి. ఇవి బాగా ఉడికిపోవాలి. ఆ తర్వాత బంగాళ దుంపల్ని పేస్టులా చేసుకోవాలి. ఇందులో కొద్దిగా కార్ల్ ఫ్లోర్ పిండిని చల్లి.. బాగా పిసకాలి. ఈ మిశ్రమాన్ని చిన్న బాల్స్‌లా చేసుకోవాలి. ఇప్పుడు వీటిని ఆయిల్‌లో వేసి ఫ్రై చేయాలి. వీటిని తీసి పక్కన పెట్టుకోవాలి. మరో పాన్‌లో కొద్దిగా ఆయిల్ వేసి.. సన్నగా తరిగిన వెల్లుల్లి వేసి ఫ్రై చేయాలి. ఆ తర్వాత ఇందులో సోయాసాస్, కారం, తెల్ల నువ్వులు పై నుంచి కొత్తిమీర చల్లి ఓ సారి వేయించి సర్వింగ్ ప్లేట్‌లోకి తీసుకోవాలి. అంతే ఎంతో రుచిగా ఉండే కొరియన్ పొటాటో బాల్స్ సిద్ధం. చాలా సింపుల్‌గా తయారు చేసుకోవచ్చు.