PM Modi-Trump Meet: ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు..? ట్రంప్‌తో ప్రధాని మోదీ భేటీ.. లైవ్ వీడియో
అమెరికా పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ..మరికాసేపట్లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో కీలక సమావేశానికి సిద్ధమవుతున్నారు. ఒకరినొకరు స్నేహితులుగా సంబోధించే ఈ నేతల భేటీపై ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. ట్రంప్ రెండోసారి ప్రమాణ స్వీకారం తర్వాత ఇద్దరు నేతల మధ్య జరిగే తొలి సమావేశం ఇది. భేటీలో చర్చకొచ్చే అంశాలతో పాటు వాళ్లిద్దరి మధ్య ఉన్న ఫ్రెండ్‌షిప్ హాట్ టాపిక్‌గా మారింది.
ట్రంప్ సెకండ్ సీజన్‌లో ఫస్ట్ భేటీ కాబోతున్నారు భారత ప్రధాని మోదీ. ఓ వైపు డిపోర్టేషన్లు.. మరోవైపు సుంకాల ఆంక్షల నేపథ్యంలో బిగ్ బ్రదర్స్ భేటీపై వరల్డ్ వైడ్‌గా ఆసక్తి నెలకుంది. ఇరువురు నేతల భేటీలో.. వాణిజ్యం, ఆర్థిక సహకారం, హెచ్ 1 బీ వీసా, గ్రీన్ కార్డుకు సంబంధించిన అంశాలు ప్రస్తావనకు వచ్చే అవకాశం కనిపిస్తోంది. అయితే ఇతర దేశాల విషయంలో తగ్గేదే లేదన్నట్టు వ్యవహరిస్తున్న ట్రంప్..మోదీ భేటీలో భారత్‌కు ఉపసమనం కల్పిస్తారా..? 2.o అంటూ దూకుడు చూపిస్తున్న ట్రంప్‌తో మోదీ ఏం మాట్లడనున్నారు..? అనేది ఆసక్తికరంగా మారింది..
మోదీ-ట్రంప్ మధ్య మంచి బంధమే ఉంది. ఇరు దేశాలకు ఉపయోగపడే నిర్ణయాలూ కలిసి తీసుకున్నారు. ఇద్దరి మధ్య రాకపోకలు బాగానే జరిగాయి. అదంతా ట్రంప్ ఫస్ట్ సీజన్‌లో. కానీ ఇప్పుడు పరిస్థితులు మారాయ్. ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ అంటూ ఇండియన్స్‌ని తరిమేస్తున్నారు ట్రంప్. వీసా రూల్స్‌ను కఠినంగా మార్చేస్తున్నారు. మరెన్నో విషయాల్లోనూ ట్రంప్ ఇండియన్స్‌ని టార్గెట్ చేస్తున్నారు. మరిప్పుడు ఆ ట్రంప్‌నే కలవబోతున్నారు ప్రధాని మోదీ. దీంతో అందరి చూపు ఆ ఇద్దరి భేటీపైనే ఉంది. ఏం చర్చిస్తారు…? ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారని ప్రపంచదేశాలు ఆసక్తిగా చూస్తున్నాయి.