వారిని చూస్తుంటే సహనం నశిస్తోంది: ట్రంప్ వీడియో
హమాస్, ఇజ్రాయెల్ కాల్పుల విరమణ ఒప్పందం అమలు చూస్తుంటే సహనం నశిస్తోందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు. బందీలను హోలోకాస్ట్ బాధితులతో పోల్చారు. హమాస్ విడుదల చేస్తున్న ఇజ్రాయెలీ బందీలను చూస్తుంటే మనసు చలించిపోతుందని ట్రంప్ అన్నారు. బందీలు నెలల తరబడి ఆహారం లేకుండా గడ్డు పరిస్థితులను ఎదుర్కొన్నట్లు కనిపిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇవన్నీ చూస్తూ తాము ఎంతకాలం సహనంతో ఉంటామో తెలియట్లేదని పేర్కొన్నారు. హమాస్‌లో 491 రోజులు బందీలుగా ఉండి తాజాగా విడుదలైన ముగ్గురు ఇజ్రాయెలీలు ఎల్ షరాబీ, ఒహాద్ బెన్ అమి, ఓర్ లెవీలు పూర్తిగా బలహీనంగా కనిపించడంతో వారి కుటుంబసభ్యులు, ప్రజలు తీవ్ర ఆవేదనకు గురయ్యారు. బందీలుగా మారక ముందు, తరువాత.. వారికి సంబంధించిన చిత్రాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. వాటిపై ట్రంప్ స్పందిస్తూ గాజాను స్వాధీనం చేసుకోవడానికి తాము కట్టుబడి ఉన్నామన్నారు. తమ ఆధ్వర్యంలో దానిని పునర్ నిర్మించే బాధ్యత ఇతరులకు అప్పగిస్తామన్నారు. అయితే అంతిమంగా గాజాను తాము స్వాధీనం చేసుకోవాలనుకుంటున్నామన్నారు. హమాస్ తిరిగి బలపడకుండా చూసుకోవాల్సిన బాధ్యత తమ పైనే ఉందని పేర్కొన్నారు. ప్రత్యామ్నాయం లేదు కనుకే పాలస్తీనియన్లు శిథిలమైన గాజాలోకి రావాలనుకుంటున్నారని ట్రంప్ వ్యాఖ్యానించారు.
మరిన్ని వీడియోల కోసం :
స్పీడ్ బోటులో షికారు చేస్తున్న పర్యాటకులు..నది మధ్యలోకి వెళ్లగానే..
భార్యను పాము కాటు వేసిన ప్రాంతానికి వెళ్లిన భర్త..అంతలోనే ఊహించని షాక్ వీడియో
అలసిపోయి చెట్టు కింద కూర్చొన్న సింహం.. తర్వాత ఏం జరిగిందంటే వీడియో
ఈ సారు మామూలోడు కాదు.. సర్కారు ఆఫీస్‌లోనే ఏకంగా మకాం పెట్టాడు…
భార్య కోసం రూ. 15 లక్షలతో రైల్వే ఉద్యోగం కొని.. విడిపోవడంతో.. వీడియో

ఆదమరిచి నిద్రపోతున్న శునకం.. మేక ఏం చేసిందో చూడండి

ఎండ వేడి తట్టుకోలేక ఏసీ ఆన్ చేస్తున్నారా.. అయితే జర జాగ్రత్త

మంచినీళ్లు అడిగి.. బంగారం దోచుకెళ్లాడు వీడియో

పిచ్చి పీక్స్‌కి.. వీడియో చూస్తే వణుకొస్తుంది

ఒక్క టూత్ బ్రష్‌తో దుమ్ము దులిపేసిందిగా..వీడియో

పెంపుడు కుక్కలను కిడ్నాప్ చేసి.. రూ.10 కోట్లు డిమాండ్ .. చివరికి

ఏసీ కోచ్‌ల్ ప్రయాణిస్తున్న వ్యక్తి.. పడుకుందామని రెడీ అవుతుండగా..
