ఇవి తింటే.. ప్రాణాంతక వ్యాధులు రాకుండా పోరాడుతుంది... !

Jyothi Gadda

13 February 2025

కొన్ని ప్రాంతాలలో రాగులతో సంగటి, రాగి అంబలి తయారు చేసుకుని తీసుకుంటారు. రాగి రొట్టెలు, రాగి లడ్డులూ, రాగి పిండితో వివిధ రకాల ఆహార పదార్థాలు తయారు చేసుకుంటారు.

రాగులలో ఐరన్, కాల్షియం, ప్రోటీన్, భాస్వరం, అధిక ఫైబర్ ఉంటాయి. ఇది శరీరానికి ఆరోగ్యాన్ని చేకూర్చడంతో పాటూ మలబద్దకాన్ని నివారిస్తుంది.

రాగులు సహజమైన గ్లూటెన్ ఫ్రీ ఆహారం. గ్లూటెన్ సైడ్ ఎఫెక్ట్స్ లేదా అలెర్జీ ఉన్నవారు, ఉదరకుహుర వ్యాధి ఉన్నవారు రాగులను తీసుకోవచ్చు. ఇది పోషకాల శోషణను పెంచుతుంది.

రాగుల్లో ఉండే పాలిఫినాల్స్, డైటరీ ఫైబర్ మధుమేహాన్ని నియంత్రిస్తాయి. మధుమేహ వ్యాధికి రాగులతో చేసిన ఆహార పదార్థాలు, రాగుల గంజి, పాలల్లో కలిపి తాగితే ఔషధంగా పనిచేస్తుంది. 

రాగులను తరచూ తీసుకుంటే పోషకాహార లోపం, ప్రమాదకరమైన వ్యాధులను దూరం ఉంచుతుంది. రాగుల్లో ఉండే ప్రోటీన్లు నిత్యం వ్యాయామం చేసే వారికి చక్కగా ఉపయోగపడతాయి.

రాగులను ఆహారంలో భాగం చేసుకుంటే వృద్ధాప్య ఛాయలు త్వరగా రావు. చర్మం కాంతివంతంగా, మృదువుగా ఉంటుంది. అధిక రక్తపోటు నివారిణిగా రాగులు ఎంతో మేలు చేస్తాయి.

రాగులలో పాలీఫెనాల్స్, టానిన్లు, పైటేట్స్ వంటి యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి ఆక్సీకరణ ఒత్తిడిని, మెదడు దెబ్బతినడానికి కారణమయ్యే ఫ్రీ రాడికల్స్ ను తొలగించేలా చేస్తుంది.

రాగులలో తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ ఉంటుంది. ఈ కారణంగా ఇది బరువు తగ్గడానికి సహాయపడుతుంది. ఇది చక్కెరను నెమ్మదిగా రక్తప్రవాహంలోకి విడుదల చేస్తుంది.