Gulab Jamun Cake: గులాబ్ జామూన్ పౌడర్‌తో కేక్ చేయండి.. రుచి అదిరిపోతుంది..

| Edited By: Ravi Kiran

Aug 16, 2024 | 8:01 PM

చాలా మందికి గులాబ్ జామ్స్ అంటే చాలా ఇష్టం. ఒక దాని తర్వాత మరొకటి లాగించేస్తారు. గులాబ్ జామ్స్ ఐస్ క్రీమ్స్‌తో తిన్నా చాలా రుచిగా ఉంటాయి. ఇలా గులాబ్ జామ్స్ అంటే చాలా మందికి ఇష్టం. గులాబ్ జామ్స్ తయారు చేసే పొడితో మనం కేక్ కూడా తయారు చేసుకోవచ్చు. అది కూడా ఎగ్ లేకుండా. ఎగ్ లేకుండా చేసే కేక్ ఎప్పుడైనా సరే తినవచ్చు. గులాబ్ జామ్స్‌తో తయారు చేసే కేక్ కూడా..

Gulab Jamun Cake: గులాబ్ జామూన్ పౌడర్‌తో కేక్ చేయండి.. రుచి అదిరిపోతుంది..
Gulab Jamun Cake
Follow us on

చాలా మందికి గులాబ్ జామ్స్ అంటే చాలా ఇష్టం. ఒక దాని తర్వాత మరొకటి లాగించేస్తారు. గులాబ్ జామ్స్ ఐస్ క్రీమ్స్‌తో తిన్నా చాలా రుచిగా ఉంటాయి. ఇలా గులాబ్ జామ్స్ అంటే చాలా మందికి ఇష్టం. గులాబ్ జామ్స్ తయారు చేసే పొడితో మనం కేక్ కూడా తయారు చేసుకోవచ్చు. అది కూడా ఎగ్ లేకుండా. ఎగ్ లేకుండా చేసే కేక్ ఎప్పుడైనా సరే తినవచ్చు. గులాబ్ జామ్స్‌తో తయారు చేసే కేక్ కూడా చాలా రుచిగా ఉంటుంది. సింపుల్‌గా కూడా చేసుకోవచ్చు. మరి గులాబ్ జామ్స్ పౌడర్‌తో చేసే కేక్ ఎలా తయారు చేస్తారు? దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.

గులాబ్ జామ్ కేక్‌కి కావాల్సిన పదార్థాలు:

గులాబ్ జామ్ పౌడర్, మైదా, చక్కెర, పెరుగు, నెయ్యి, పాలు వెనీలా ఎసెన్స్, రోజ్ ఎసెన్స్, బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా, కుంకుమ పువ్వు, యాలకుల పొడి.

గులాబ్ జామ్ కేక్‌ తయారీ విధానం:

ముందుగా పంచదారను మిక్సీలో వేసి పౌడర్‌లా చేసుకోవాలి. ఆ తర్వాత అర కప్పు పెరుగు పంచదార పొడిలో వేసుకోవాలి. ఇందులో పావు కప్పు నెయ్యి వేయాలి. ఈ మూడు ఉండలు లేకుండా.. బాగా కలిసి పోయేలా బీట్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇందులో పాలు కూడా పోసి మళ్లీ మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు గులాబ్ జామ్ పౌడర్, మైదా తీసుకుని రెండింటినీ జల్లించు కోవాలి. ఇప్పుడు ఈ చల్లించుకున్న పొడిని కూడా పంచదార మిశ్రమంలో వేసి మరోసారి బాగా బీట్ చేసుకోవాలి. మొత్తం అన్నీ చక్కగా మిక్స్ అయిపోవాలి. అప్పుడే కేక్ చక్కగా పొంగి, మెత్తగా వస్తుంది. ఆ నెక్ట్స్ రోజ్ ఎసెన్స్, వెనిలా ఎసెన్స్, బేకింగ్ సోడా, బేకింగ్ పౌడర్, యాలకుల పొడి కూడా మళ్లీ మిక్స్ చేసుకోవాలి.

ఇవి కూడా చదవండి

ఇప్పుడు కేక మౌల్డ్ తీసుకుని.. నెయ్యి లేదా బటర్ రాసుకోవచ్చు. అందులోనే ఒక స్పూన్ మైదా పిండి చల్లించి.. మౌల్డ్ ని కోట్ చేయాలి. ఇప్పుడు కేక్ మిశ్రమాన్ని మౌల్డ్‌ల వేసి.. ఓవెన్‌లో 170 డిగ్రీల ప్రీ హీట్‌లో 40 నిమిషాలు కుక్ చేసుకోవాలి. కేక్ అయిపోయిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మళ్లీ కొద్దిగా పంచదార తీసుకుని స్టవ్ మీద పెట్టి.. కరగనివ్వాలి. ఇందులో కొద్దిగా కుంకుమ వ్వు వేసుకోవాలి. పంచదార బాగా కరిగాక.. ఈ సిరప్‌ని కేక్‌పై వేయాలి. అంతే ఎంతో రుచిగా ఉండే గులాబ్ జామ్ పౌడర్ కేక్ సిద్ధం. ఇది పిల్లలకు ఖచ్చితంగా నచ్చుతుంది.