Gongura Pulihora: పుల్లగా, స్పైసీగా గోంగూర పులిహోర.. తిన్నవారు ఆహా అంటారు..

పులిహోరలో చేసే వెరైటీల్లో గోంగూర పులిహోర కూడా ఒకటి. ఇది కూడా చాలా రుచిగా ఉంటుంది. పుల్లగా, కారంగా చాలా టేస్టీగా ఉంటుంది. ఏదన్నా చేయాలి అనిపించినప్పుడు సింపుల్‌గా ఇలా గోంగూర పులిహోర చేసుకోవచ్చు..

Gongura Pulihora: పుల్లగా, స్పైసీగా గోంగూర పులిహోర.. తిన్నవారు ఆహా అంటారు..
Gongura Pulihora
Follow us
Chinni Enni

| Edited By: Shaik Madar Saheb

Updated on: Dec 08, 2024 | 11:55 PM

పులిహోరను ఎన్నో రకాలుగా చేస్తూ ఉంటారు. పులిహోర చాలా రుచిగా ఉంటుంది. అంతే కాకుండా ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఇలా పులిహోరలో చేసే వెరైటీల్లో గోంగూర పులిహోర కూడా ఒకటి. ఇది కూడా చాలా రుచిగా ఉంటుంది. పుల్లగా, కారంగా చాలా టేస్టీగా ఉంటుంది. ఏదన్నా చేయాలి అనిపించినప్పుడు సింపుల్‌గా ఇలా గోంగూర పులిహోర చేసుకోవచ్చు. దీన్ని భోజనంలా, స్నాక్‌లా కూడా చేసుకోవచ్చు. ఈజీగా కూడా జీర్ణం అవుతుంది. ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఇంత టేస్టీ గోంగూరను ఎలా తయారు చేస్తారు? ఈ పులిహోర తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

గోంగూర పులిహోర తయారీకి కావాల్సిన పదార్థాలు:

గోంగూర, అన్నం, చింత పండు, తాళింపు దినుసులు, జీడిపప్పు, పల్లీలు, కారం, ఉప్పు, కరివేపాకు, కొత్తిమీర, మెంతులు, నూనె, నెయ్యి.

గోంగూర పులిహోర తయారీ విధానం:

ముందుగా అన్నాన్ని పొడి పొడిలాడేట్టు ఉడికించి పక్కన పెట్టుకోవాలి. గోంగూరను వలిచి శుభ్రంగా కడుక్కోవాలి. ఇప్పుడు ఒక పాన్ తీసుకుని ఆయిల్ వేసి వేడి చేసుకోవాలి. ఇందులో కొద్దిగా మెంతులు, ఆవాలు వేసి చిన్న మంట మీద వేయించాలి. ఆ తర్వాత కొన్ని ఎండు మిర్చి, కొద్దిగా ఇంగువ వేసి ఓ సారి వేయించి తీసి పక్కన పెట్టుకోవాలి. ఈ మిశ్రమం చల్లారక మిక్సీలో వేసి పొడిలా చేసుకోవాలి. ఆ తర్వాత అదే పాన్‌లో మరికొద్దిగా నూనె వేసి… గోంగూర, ఉప్పు, పసుపు వేసి బాగా వేయించుకోవాలి.

ఇవి కూడా చదవండి

కాసేటికి కొద్దిగా చింత పండు గుజ్జు వేసి ఆయిల్ పైకి తేలేంత వరకు వేయించాలి. ఆయిల్ పైకి తేలాక.. స్టవ్ ఆఫ్ చేసి.. మిక్సీ పట్టిన ఆవ పొడిని వేసి అన్నీ మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు అన్నంలో పొడి పొడిలాడే అన్నంలో కొద్దిగా గోంగూర మిశ్రమం, కొద్దిగా కొత్తిమీర కలిపి పక్కన పెట్టండి. ఇప్పుడు తాళింపు పెట్టుకుని అన్నంలో వేసి అంతా కలపాలి. చివరలో కొద్దిగా నెయ్యి వేసి కలపండి. అంతే ఎంతో రుచిగా ఉండే గోంగూర పులిహోర సిద్ధం. ఈ రుచికే కడుపు నిండిపోతుంది.

మీరూ చలికాలంలో చన్నీళ్లతో స్నానం చేస్తున్నారా? బీ కేర్ ఫుల్..
మీరూ చలికాలంలో చన్నీళ్లతో స్నానం చేస్తున్నారా? బీ కేర్ ఫుల్..
కలలో పూర్వీకులు కనిపిస్తే శుభమా? అశుభమా..
కలలో పూర్వీకులు కనిపిస్తే శుభమా? అశుభమా..
మ్యూచువల్ ఫండ్స్ కంటే ఇటిఎఫ్‌లలో ఇన్వెస్ట్ చేయడం లాభదాయకమా?
మ్యూచువల్ ఫండ్స్ కంటే ఇటిఎఫ్‌లలో ఇన్వెస్ట్ చేయడం లాభదాయకమా?
ఎప్పుడూ ఒకేలానా.. కాస్త కొత్తగా ట్రై చేద్దామంటున్న స్టార్ హీరోస్!
ఎప్పుడూ ఒకేలానా.. కాస్త కొత్తగా ట్రై చేద్దామంటున్న స్టార్ హీరోస్!
మేకప్‌ లుక్‌ సహజంగా.. పర్ఫెక్ట్‌గా రావాలంటే టిప్స్‌ ఇవిగో..
మేకప్‌ లుక్‌ సహజంగా.. పర్ఫెక్ట్‌గా రావాలంటే టిప్స్‌ ఇవిగో..
హనీరోజ్‌పై అసభ్యకర కామెంట్స్. పోలీసుల అదుపులో బడా బిజినెస్ మ్యాన్
హనీరోజ్‌పై అసభ్యకర కామెంట్స్. పోలీసుల అదుపులో బడా బిజినెస్ మ్యాన్
ఒక్క సినిమా ఇచ్చిన సక్సెస్‌తో కోట్లకు పడగెత్తిన స్టార్ హీరో
ఒక్క సినిమా ఇచ్చిన సక్సెస్‌తో కోట్లకు పడగెత్తిన స్టార్ హీరో
చరణ్‌ 65కోట్లు, శంకర్ 35 కోట్లు.. ఎక్కువ కోట్లు తీసుకున్నది వీరే
చరణ్‌ 65కోట్లు, శంకర్ 35 కోట్లు.. ఎక్కువ కోట్లు తీసుకున్నది వీరే
విశాల్‌కి ఏమైందంటే ?? ఫుల్ క్లారిటీ ఇచ్చిన ఖుష్బూ
విశాల్‌కి ఏమైందంటే ?? ఫుల్ క్లారిటీ ఇచ్చిన ఖుష్బూ
జామ చిగురు తింటే ఎలాంటి వ్యాధులు రానే రావు..
జామ చిగురు తింటే ఎలాంటి వ్యాధులు రానే రావు..