Egg 65: దాభా స్టైల్‌లో ఎగ్ 65.. ఇలా చేస్తే రుచి అదుర్స్ అంతే!

| Edited By: Shaik Madar Saheb

Nov 23, 2024 | 9:56 PM

ఎగ్ 65ని రెస్టారెంట్ స్టైల్‌లో ఒకలా, దాభా స్టైల్‌లో మరోలా తయారు చేస్తూ ఉంటారు. దాభా స్టైల్‌‌లో చేసే ఎగ్ 65 కూడా రుచి చాలా బాగుంటుంది. తిన్నవాళ్లు మళ్లీ మళ్లీ తినాలి అనుకుంటారు. ఈ రెసిపీని మనం ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు..

Egg 65: దాభా స్టైల్‌లో ఎగ్ 65.. ఇలా చేస్తే రుచి అదుర్స్ అంతే!
Egg 65
Follow us on

ఎగ్స్ అంటే చాలా మందికి ఇష్టం. గుడ్లు తినడం ఆరోగ్యానికి కూడా మంచిదన్న విషయం తెలిసిందే. కోడి గుడ్లతో ఎన్నో రకాల వంటలు తయారు చేస్తూ ఉంటారు. అలాగే ఎన్నో రకాల స్నాక్స్ కూడా వండుతూ ఉంటారు. వీటిల్లో ఎగ్ 65 కూడా ఒకటి. అయితే వీటిని రెస్టారెంట్ స్టైల్‌లో ఒకలా, దాభా స్టైల్‌లో మరోలా తయారు చేస్తూ ఉంటారు. దాభా స్టైల్‌‌లో చేసే ఎగ్ 65 కూడా రుచి చాలా బాగుంటుంది. తిన్నవాళ్లు మళ్లీ మళ్లీ తినాలి అనుకుంటారు. ఈ రెసిపీని మనం ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు. చాలా సింపుల్‌గా, తక్కువ సమయంలోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. మరి ఈ ఎగ్ 65ని దాభా స్టైల్‌లో ఎలా చేస్తారో ఇప్పుడు చూద్దాం.

ఎగ్ 65కి కావాల్సిన పదార్థాలు:

కోడి గుడ్లు, కార్న్ ఫ్లోర్, మైదాపిండి, కారం, ఉప్పు, పసుపు, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా, ఆయిల్.

ఇవి కూడా చదవండి

ఎగ్ 65 తయారీ విధానం:

ముందుగా గుడ్లను ఉడికించి పొట్టు తీసి కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలో కొద్దిగా మైదా పిండి, కార్న్ ఫ్లోర్, ఉప్పు, పసుపు, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా అన్నీ వేసి కలుపుకోవాలి. మరోవైపు స్టవ్ మీద డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేడి చేసుకోండి. ఇప్పుడు మైదా పిండి మిశ్రమంలో ముంచి ఆయిల్‌లో వేసి ఫ్రై చేయండి. మీడియం మంట మీద వేయిస్తే.. నాలుగు వైపులా చక్కగా వేగుతాయి. లేదంటే సరిగా ఉడకకుండా మాడిపోతుంది. ఇవి బాగా వేగాక తీసి పక్కన పెట్టుకోండి. ఆ తర్వాత ఒక కడాయి తీసుకుని అందులో కొద్దిగా ఆయిల్ వేసి కరివేపాకు, పచ్చి మిర్చి, వెల్లుల్లి వేయించి ఈ వేయించి గుడ్లను అందులో వేసి బాగా ఫ్రై చేయండి. అంతే ఎంతో రుచిగా ఉండే ఎగ్ 65 సిద్ధం. ఇది చాలా రుచిగా ఉంటుంది. వీటిని టమాటా సాస్ లేదా గ్రీన్ చట్నీ, మయోనీస్ తింటే చాలా రుచిగా ఉంటాయి. ఇలా ఈజీగా ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు.