Banana Cake: టేస్టీ బనానా కేక్.. రైస్ కుక్కర్ ఉంటే చాలు..

| Edited By: Ravi Kiran

Nov 18, 2024 | 10:30 PM

కేక్స్ అనగానే పిల్లలకు పెద్దలకు బాగా ఇష్టం. బర్త్ డేస్, ఇంట్లో ఎలాంటి ఫంక్షన్స్ అయినా ఇంట్లో కేక్ కట్ చేయడం ఇప్పుడు ఒక హాబిట్‌గా మారింది. కేక్‌ కట్ చేసి తమ ఆనందాన్ని కూడా రెట్టింపు చేసుకుంటున్నారు. అయితే కేక్స్ తయారు చేయడం పెద్ద ప్రాసెస్ అని చెప్పి బయట నుంచి కొని తెస్తారు. కానీ కేక్స్‌ని మనం ఇంట్లోనే ఎంతో ఈజీగా తయారు చేసుకోవచ్చు...

Banana Cake: టేస్టీ బనానా కేక్.. రైస్ కుక్కర్ ఉంటే చాలు..
Banana Cake
Follow us on

కేక్స్ అంటే పిల్లలు బాగా ఇష్ట పడి తింటూ ఉంటారు. ఇంట్లో చేయాలంటే పెద్ద ప్రాసెస్. అందుకే చాలా మంది బయట కొని తీసుకొస్తూ ఉంటారు. కానీ బయట ఏం కలుపుతారో.. ఎలా తయారు చేస్తారో అన్న అనుమానం ఖచ్చితంగా ఉంటుంది. అదే ఇంట్లో అయితే ఎంతో శుభ్రంగా తయారు చేసుకోవచ్చు. ఇంట్లో కేక్ చేయాలంటే ఓవెన్ ఖచ్చితంగా అవసరం. కానీ ఓవెన్ అవసరం లేకుండా ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్ ఉంటే చాలు. మనం ఎంతో సింపుల్‌గా కేక్ తయారు చేసుకోవచ్చు. కొన్ని సింపుల్ చిట్కాలతో ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు. మరి ఈ బనానా కేక్‌కి కావాల్సిన పదార్థాలు ఏంటి? ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం.

బనానా కేక్ తయారీకి కావాల్సిన పదార్థాలు:

అరటి పండ్లు, గుడ్లు, పంచదార, అన్ సాల్టెడ్ బటర్, మైదా, బేకింగ్ సోడా, ఉప్పు, వెనీలా ఎసెన్స్.

బనానా కేక్ తయారీ విధానం:

ముందుగా అరటి పండ్లను మిక్సీలో వేసి మెత్తగా చేసుకోవాలి. ఆ తర్వాత మీరరు వండే రైస్ కుక్కర్‌కి కొద్దిగా బటర్ లేదా ఆయిల్ అప్లై చేయండి. దానిమీద పిండితో కోటింగ్ వేసుకోవాలి. ఆ తర్వాత ఒక పెద్ద బౌల్ తీసుకుని అందులో గుడ్ల తెల్ల సొన మాత్రమే తీసుకోవాలి. ఇది బాగా గిలకొట్టాలి. ఆ తర్వాత పంచదార వేసి మళ్లీ బాగా బీట్ చేసుకోవాలి. ఇప్పుడు పచ్చ సొన, అరటి పండు గుజ్జు, వెనీలా ఎసెన్స్, బటర్.. ఇలా ఒక దాని తర్వాత మరొకటి అన్నీ వేసుకుంటూ కలుపుకోవాలి. వీటన్నింటినీ ఎక్కువగా బాగా మిక్స్ చేసుకుంటేనే కేక్ బాగా పొంగి వస్తుంది.

ఇవి కూడా చదవండి

లేదంటే సరిగా రుచి ఉండదు. కాబట్టి అన్నింటినీ బాగా ఎక్కువగా సేపు బీట్ చేయండి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని రైస్ కుక్కర్ గిన్నెలో వేసుకోవాలి. ఇప్పుడు కుక్ బటన్ స్టార్ట్ చేయాలి. కేక్ అయిపోగానే వార్మ్ మోడ్‌లోకి వచ్చేలా సెట్ చేసుకోవాలి. ఇలా మూడు సార్లు చేయాలి. అప్పుడే కేక్ బాగా ఉడుకుతుంది. ఉప్పు వేసి గిన్నె వేడి చేసి చేయడం కంటే ఇది చాలా సింపుల్, కేవలం బటన్ మాత్రమే ఆన్ చేసుకుంటే చాలు. కేక్ అయిపోయాక కొబ్బరి పొడి, బనానా ముక్కలు, చాకో చిప్స్‌తో డెకరేషన్ చేసుకుంటే సూపర్‌గా ఉంటుంది.