Avakaya Egg Fried Rice: ఆవకాయ ఎగ్ ఫ్రైడ్ రైస్ ని ఇలా టేస్టీగా చేయండి.. మెతుకు మిగల్చరు!

| Edited By: Ram Naramaneni

Nov 01, 2023 | 10:09 PM

ఆవకాయ బిర్యానీ గురించి వినే ఉంటారు.. అలాగే ఇది ఆవకాయ ఎగ్ ఫ్రైడ్ రైస్. అదేంటి కొత్తగా ఉందనుకుంటున్నారా.. దీని టేస్ట్ ఇంకా కొత్తగా ఉంటుంది. ఆవకాయతో చేసే ఈ రైస్ చాలా టేస్టీగా ఉంటుంది. పుల్ల పుల్లగా.. కారంగా ఒక వెరైటీ రుచి ఉంటుంది. ఉదయం టిఫిల్ లా.. లంచ్ బాక్స్ లోకి అయినా కొత్తగా ఉంటుంది. మిగిలిన అన్నంతో ఇలా ట్రై చేయవచ్చు. కూరగాయలు ఏమీ లేనప్పుడు.. ఫాస్ట్ గా ఏదైనా చేయాలనుకున్నప్పుడు.. వంట ఏం చేయాలి అని అనుకున్నప్పుడు..

Avakaya Egg Fried Rice: ఆవకాయ ఎగ్ ఫ్రైడ్ రైస్ ని ఇలా టేస్టీగా చేయండి.. మెతుకు మిగల్చరు!
Cooking Tips
Follow us on

ఆవకాయ బిర్యానీ గురించి వినే ఉంటారు.. అలాగే ఇది ఆవకాయ ఎగ్ ఫ్రైడ్ రైస్. అదేంటి కొత్తగా ఉందనుకుంటున్నారా.. దీని టేస్ట్ ఇంకా కొత్తగా ఉంటుంది. ఆవకాయతో చేసే ఈ రైస్ చాలా టేస్టీగా ఉంటుంది. పుల్ల పుల్లగా.. కారంగా ఒక వెరైటీ రుచి ఉంటుంది. ఉదయం టిఫిల్ లా.. లంచ్ బాక్స్ లోకి అయినా కొత్తగా ఉంటుంది. మిగిలిన అన్నంతో ఇలా ట్రై చేయవచ్చు. కూరగాయలు ఏమీ లేనప్పుడు.. ఫాస్ట్ గా ఏదైనా చేయాలనుకున్నప్పుడు.. వంట ఏం చేయాలి అని అనుకున్నప్పుడు.. ఇలా ఎగ్ ఫ్రైడ్ రైస్ చేయవచ్చు. ఈ ఫ్రైడ్ రైస్ ని కూడా ఎంతో సింపుల్ గా, ఈజీగా చేసుకోవచ్చు. ఒక్కసారి దీని టేస్ట్ చూస్తే మళ్లీ మళ్లీ చేసుకుని తింటారు. ఏమైనా స్పెషల్ డేస్ ఉన్నప్పుడు కూడా దీన్ని చేసుకోవచ్చు. మరి ఈ ఎగ్ ఫ్రైడ్ రైస్ కి కావాల్సిన పదార్థాలు, ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

ఆవకాయ ఎగ్ ఫ్రైడ్ రైస్ కి కావాల్సిన పదార్థాలు:

అన్నం, గుడ్లు, ఆవకాయ పచ్చడి, పచ్చిమిర్చి, ఉప్పు, పసుపు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, దంచిన వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు, కొత్తి మీర, నూనె.

ఇవి కూడా చదవండి

ఆవకాయ ఎగ్ ఫ్రైడ్ రైస్ తయారీ విధానం:

ముందుగా అన్నాన్ని పొడి పొడిలాడేటట్టు ఉడికించుకుని పక్కకు పెట్టుకోవాలి. ఈ అన్నం చల్లారాక.. ఆవకాయ పచ్చడి కొద్దిగా వేసుకుని చేత్తో.. మొత్తం అన్నం అంతా కలుపుకోవాలి.ఇప్పుడు ఒక బాండీ తీసుకుని ఆయిల్ వేసి వేడెక్కాక.. కోడి గుడ్లు చితక్కొట్టి ఆమ్లెట్ లా వేసుకోవాలి. ఇప్పుడే కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి. దీన్ని ముక్కలు ముక్కలుగా చేసుకోవాలి. మంట హై ఫ్లేమ్ లోనే పెట్టుకోండి. అలా చేస్తేనే టేస్ట్ బాగా వస్తుంది. ఆ తర్వాత పసుపు, ధనియాల పొడి, జీల కర్ర పొడి, సరిపడినంత ఉప్పు వేసుకుని మళ్లీ ఒకసారి కలుపు కోవాలి.

ఆ తర్వాత దంచిన వెల్లుల్లి రెబ్బలు, పచ్చి మిర్చి వేసి మరోసారి కలుపుకోవాలి. ఇవి కాసేపు వేగాక.. ఆవకాయ కలుపుకున్న అన్నాన్ని వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మంట మీడియంలో పెట్టి.. మాడిపోకుండా ఐదు నిమిషాల పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కొత్తిమీర చల్లుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే ఎంతో టేస్టీ అండ్ సింపుల్ ఆవకాయ ఎగ్ ఫ్రైడ్ రైస్ సిద్ధమవుతుంది. వెరైటీగా తినడం ఇష్టమున్నవాళ్లకు ఇది బాగా నచ్చుతుంది. మరింకెందుకు లేట్ ఒకసారి మీరు కూడా ట్రై చేయండి.