Pesarattu Sandwich: పెసరట్టు శాండ్ విచ్.. బ్రేక్ ఫాస్ట్, లంచ్, డిన్నర్‌కి బెస్ట్ రెసిపీ..

| Edited By: Ravi Kiran

Oct 02, 2024 | 8:53 PM

పెసలు ఆరోగ్యానికి చాలా మంచిదన్న విషయం తెలిసిందే. చాలా మంది పెసలతో అట్లు వేసుకుని తింటూ ఉంటారు. ఇది హైప్రోటీన్ ఫుడ్‌ అని చెప్పొచ్చు. ఇందులోప్రోటీన్ ఎక్కువగా లభిస్తుంది. పెసరట్లు, పునుగులే కకాుండా ఇంకా శాండ్ విచ్ కూడా తయారు చేసుకోవచ్చు. దీని రుచి కూడా చాలా బాగుంటుంది. బ్రేక్ ఫాస్ట్‌కి, లంచ్, డిన్నర్‌కి ఏ సమయంలోనే అయినా ఈ పెసరట్టు శాండ్ విచ్ తినొచ్చు. ఈ శాండ్ విచ్ ఒక్కటి తిన్నా కడుపు నిండిపోతుంది. మరి ఈ పెసరట్టు శాండ్‌ విచ్‌ తయారు..

Pesarattu Sandwich: పెసరట్టు శాండ్ విచ్.. బ్రేక్ ఫాస్ట్, లంచ్, డిన్నర్‌కి బెస్ట్ రెసిపీ..
Pesarattu Sandwich
Follow us on

పెసలు ఆరోగ్యానికి చాలా మంచిదన్న విషయం తెలిసిందే. చాలా మంది పెసలతో అట్లు వేసుకుని తింటూ ఉంటారు. ఇది హైప్రోటీన్ ఫుడ్‌ అని చెప్పొచ్చు. ఇందులోప్రోటీన్ ఎక్కువగా లభిస్తుంది. పెసరట్లు, పునుగులే కకాుండా ఇంకా శాండ్ విచ్ కూడా తయారు చేసుకోవచ్చు. దీని రుచి కూడా చాలా బాగుంటుంది. బ్రేక్ ఫాస్ట్‌కి, లంచ్, డిన్నర్‌కి ఏ సమయంలోనే అయినా ఈ పెసరట్టు శాండ్ విచ్ తినొచ్చు. ఈ శాండ్ విచ్ ఒక్కటి తిన్నా కడుపు నిండిపోతుంది. మరి ఈ పెసరట్టు శాండ్‌ విచ్‌ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు ఏంటి? ఎలా తయారు చేస్తారో ఇప్పుడు తెలుసుకుందాం.

పెసరట్టు శాండ్‌ విచ్‌కి కావాల్సిన పదార్థాలు:

పెసర పప్పు, బ్రెడ్, టమాటా, శనగ పిండి, ఉప్పు, అల్లం, జీలకర్ర, పసుపు, ఇంగువ, గరం మసాలా, మయోనీస్, టమాటా సాస్, చీజ్, నెయ్యి.

పెసరట్టు శాండ్‌ విచ్‌ తయారీ విధానం:

ముందుగా పెసరపప్పును శుభ్రంగా కడిగి రాత్రంతా నీటిలో నానబెట్టాలి. ఉదయం పెసరపప్పును కడిగి నీళ్లు వేయకుండా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొద్దిగా ఉప్పు, శనగ పిండి, ఇంగువ, జీలకర్ర వేసి మిక్స్ చేసుకోవాలి. నీళ్లు వేసి చిక్కగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ పిండితో చిన్న సైజులో అట్లు వేసుకోవాలి. నెయ్యి వేసి రెండు వైపులా ఎర్రగా వేయించుకోవాలి. రౌండ్‌గా కాకుండా చతురస్రాకారంలో వేయండి. అట్టు వేగాక పక్కకు తీసుకోండి. ఇప్పుడు ఈ పాన్ మీదనే బ్రెడ్‌ని నెయ్యి వేసి రెండు వైపులా కాల్చుకోండి.

ఇవి కూడా చదవండి

ఒక బ్రెడ్ తీసుకుని ఒక వైపు టమాటా సాస్, మాయోనీస్, చీజ్, మసాలా చల్లాలి. ఆ తర్వాత టమాటాను రౌండ్‌‌గా కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు దీని మీద పెసరట్టు వేయాలి. పైన మరో బ్రెడ్‌తో కవర్ చేయాలి. ఆ తర్వాత దీన్ని పెనం మీద లైటుగా వేడి చేయాలి. అంతే ఎంతో రుచిగా ఉండే పెసరట్టు శాండ్ విచ్ సిద్ధం. ఈ రెసిపీ పిల్లలకు కూడా బాగా నచ్చుతుంది. ఇది వాళ్లకు లంచ్ బాక్సులో పెట్టి ఇవ్వొచ్చు.