Healthy Chapati: ఈ చపాతీని తిన్నారంటే.. కొవ్వు, బరువు రెండూ కరిగిపోతాయి..

|

Jul 29, 2024 | 1:57 PM

బరువు తగ్గాలి అనుకునేవారు, శరీరంలో ఉండు బ్యాడ్ కొలెస్ట్రాల్ కరగాలన్నా చపాతీలు తినడం చాలా మంచిది. చపాతీలు తినమన్నారని మరీ ఎక్కువగా తీసుకోకూడదు. కేవలం ఒకటి లేదా రెండు చపాతీలను కర్రీ ఎక్కువగా తీసుకుంటూ తినాలి. కర్రీలో మరీ మసాలాలు, ఆయిల్స్ ఎక్కువగా ఉపయోగించకూడదు. ఇలా తింటే మాత్రం మీకు పది రోజుల్లోనే ఖచ్చితంగా రిజల్ట్ కనిపిస్తుంది. చపాతీల్లో చాలా రకాలు ఉంటాయి. వీటిని ఎన్నో రకాలుగా..

Healthy Chapati: ఈ చపాతీని తిన్నారంటే.. కొవ్వు, బరువు రెండూ కరిగిపోతాయి..
Oats Chapati
Follow us on

బరువు తగ్గాలి అనుకునేవారు, శరీరంలో ఉండు బ్యాడ్ కొలెస్ట్రాల్ కరగాలన్నా చపాతీలు తినడం చాలా మంచిది. చపాతీలు తినమన్నారని మరీ ఎక్కువగా తీసుకోకూడదు. కేవలం ఒకటి లేదా రెండు చపాతీలను కర్రీ ఎక్కువగా తీసుకుంటూ తినాలి. కర్రీలో మరీ మసాలాలు, ఆయిల్స్ ఎక్కువగా ఉపయోగించకూడదు. ఇలా తింటే మాత్రం మీకు పది రోజుల్లోనే ఖచ్చితంగా రిజల్ట్ కనిపిస్తుంది. చపాతీల్లో చాలా రకాలు ఉంటాయి. వీటిని ఎన్నో రకాలుగా చేసుకోవచ్చు. ముఖ్యంగా వెయిట్ లాస్ అవ్వాలి అనుకునేవారు ఎక్కువగా మిల్లెట్స్ చపాతీ తింటూ ఉంటారు. ఇలా ఒక రకమైన చపాతీ తినలేని వారు ఈ ఓట్స్ చపాతీ కూడా ట్రై చేయవచ్చు. మిల్లెట్స్ చపాతీ కంటే.. ఓట్స్‌తో తయారు చేసిన చపాతీ తింటే ఆరోగ్యానికి మరింత మంచిది. ఓట్స్‌లో చాలా రకాల పోషకాలు ఉంటాయి. కాబట్టి చక్కగా వెయిట్ లాస్ అవ్వొచ్చు. మరి ఈ ఓట్స్ చపాతీకి ఎలాంటి పదార్థాలు కావాలి? ఎలా చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.

ఓట్స్ చపాతీకి కావాల్సిన పదార్థాలు:

ఓట్స్, గోధుమ పిండి, ఉప్పు, ఆయిల్.

ఇవి కూడా చదవండి

ఓట్స్ చపాతీ తయారీ విధానం:

ఈ చపాతీ తయారు చేయాలి అనుకునేవారు ముందుగా ఓట్స్‌ని పౌడర్‌లా తయారు చేసుకోవచ్చు. లేదంటే ఓట్స్‌లో కొద్దిగా వాటర్ వేసి మెత్తబడేలా చేయాలి. ఆ తర్వాత ఇందులో గోధుమ పిండి, ఉప్పు కలపండి. తర్వాత అవసరం అయితే కొద్దిగా నీరు పోస్తూ గోధుమ పిండిలా తయారు చేసుకోవచ్చు. ఈ పిండిని కూడా కలిపిన తర్వాత ఓ అరగంట సేపు పక్కన పెట్టుకోండి. ఆ తర్వాత చిన్న ఉండలుగా చేసి.. చపాతీల మాదిరిగా చేసుకోవాలి. ఇప్పుడు పాన్ వేడి చేసుకోవాలి. పాన్ వేడెక్కటాల.. చేసుకున్న చపాతీ వేసి రెండు వైపులా కాల్చుకోవాలి. చపాతీలు మరింత సాఫ్ట్‌గా కావాలి అనుకునేవారు.. హోల్ వీట్ ఫ్లవర్ ఉపయోగించవచ్చు.