Moong Halwa: పెసరపప్పు ఒక్కటి ఉంటే చాలు.. టేస్టీగా ఉండే హల్వా సిద్ధం..

| Edited By: Ravi Kiran

Oct 13, 2024 | 9:45 AM

పెసరపప్పు ఆరోగ్యానికి చాలా మంచిదన్న విషయం తెలిసింది. పెసర పప్పు తినడం వల్ల శరీరానికి చలువ చేస్తుంది. పెసరపప్పుతో చాలా రకాల స్వీట్స్ తయారు చేస్తూ ఉంటారు. వాటిల్లో మూంగ్ హల్వా కూడా ఒకటి. పెసరపప్పుతో చేసే ఈ హల్వా చాలా ఫేమస్. ఎక్కువగా ఫంక్షన్స్‌లో ఈ మూంగ్ హల్వాని తయారు చేస్తారు. ఈ హల్వా చాలా రుచిగా ఉంటుంది. ఇది చేయడం కూడా చాలా సులభం. కేవలం పెసరప్పు ఒక్కటి ఉంటే..

Moong Halwa: పెసరపప్పు ఒక్కటి ఉంటే చాలు.. టేస్టీగా ఉండే హల్వా సిద్ధం..
Moong Halwa
Follow us on

పెసరపప్పు ఆరోగ్యానికి చాలా మంచిదన్న విషయం తెలిసింది. పెసర పప్పు తినడం వల్ల శరీరానికి చలువ చేస్తుంది. పెసరపప్పుతో చాలా రకాల స్వీట్స్ తయారు చేస్తూ ఉంటారు. వాటిల్లో మూంగ్ హల్వా కూడా ఒకటి. పెసరపప్పుతో చేసే ఈ హల్వా చాలా ఫేమస్. ఎక్కువగా ఫంక్షన్స్‌లో ఈ మూంగ్ హల్వాని తయారు చేస్తారు. ఈ హల్వా చాలా రుచిగా ఉంటుంది. ఇది చేయడం కూడా చాలా సులభం. కేవలం పెసరప్పు ఒక్కటి ఉంటే.. ఈ మూంగ్ హల్వా తయారు చేసుకోవచ్చు. అతి తక్కువ సమయంలోనే ఈ మూంగ్ హల్వాని తయారు చేసుకోవచ్చు. మరి ఈ మూంగ్ హల్వాను తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటి? ఎలా తయారు చేస్తారో ఇప్పుడు చూద్దాం.

మూంగ్ హల్వా తయారీకి కావాల్సిన పదార్థాలు:

పెసరప్పు, నెయ్యి, డ్రై ఫ్రూట్స్, యాలకుల పొడి, పంచదార, కుంకుమ పువ్వు.

మూంగ్ హల్వా తయారీ విధానం:

ముందుగా ఈ హల్వాను తయారు చేయడానికి పెసర పప్పును శుభ్రంగా కడిగి దాదాపు రెండు గంటల సేపు అయినా నానబెట్టుకోవాలి. అప్పుడే ఈ స్వీట్ చాలా రుచిగా ఉంటుంది. నీరు తీసేసి.. మిక్సీలో వేసి పేస్టులా చేసుకోవాలి. నానబెట్టలేని వారు కుక్కర్‌లో వేసి ఉడికించుకోవచ్చు. ఒక కడాయి తీసుకుని ఇందులో నెయ్యి వేసి చిన్న మంట పెట్టాలి. మిక్సీ పట్టిన పెసర పప్పును వేసి బాగా వేయించుకోవాలి. అడుగంటకుండా కలుపుతూ ఉండాలి. దీనికి కాస్త సమయం పడుతుంది.

ఇవి కూడా చదవండి

పెసర పప్పు వేగాక మంచి సువాసన వస్తుంది. పప్పు వేగాక.. ఇందులో ఒక కప్పు పాలు, గోరు వెచ్చని నీళ్లు వేసి పది నిమిషాలు చిన్న మంట మీదనే ఉడికిస్తూ ఉండాలి. ఆ తర్వాత ఒక కప్పు పంచదార, పాలలో నానబెట్టిన కుంకుమ పువ్వు కూడా వేసి ఓ ఐదు నిమిషాలు ఉడికించాలి. అంతే ఎంతో రుచిగా ఉండే పెసర పప్పు హల్వా సిద్ధం. చివరగా కొద్దిగా నెయ్యి వేసి.. డ్రై ఫ్రూట్స్‌తో గార్నిష్ చేసుకోవాలి.