Meal Maker Fried Rice: మీల్ మేకర్ ఫ్రైడ్ రైస్.. అచ్చం చికెన్ ఫ్రైడ్ రైస్‌లా ఉంటుంది..

| Edited By: Ram Naramaneni

Jul 26, 2024 | 10:10 PM

మీల్ మేకర్ గురించి అందరికీ తెలుసు. వీటిని ఎక్కువగా పులావ్, సైడ్ డిష్‌లో ఉపయోగిస్తూ ఉంటారు. మీల్ మేకర్ చాలా రుచిగా ఉంటుంది. అదే విధంగా పోషకాలు కూడా చాలా ఎక్కువే. ఇందులో ప్రోటీన్, ఫైబర్ ఎక్కువ శాతంలో ఉంటుంది. బరువు తగ్గాలి అనుకునే వారు మీల్ మేకర్ ఆహారంగా తీసుకోవచ్చు. మీల్ మేకర్ కర్రీ సరిగ్గా వండాలే కానీ.. మటన్, చికెన్ తిన్న ఫీలింగ్ ఉంటుంది. ఇంత టేస్టీ ఐటెమ్‌తో ఫ్రైడ్ రైస్ చేసుకుని తింటే చాలా రుచిగా ఉంటుంది. వెజిటేరియన్స్‌కి బాగా..

Meal Maker Fried Rice: మీల్ మేకర్ ఫ్రైడ్ రైస్.. అచ్చం చికెన్ ఫ్రైడ్ రైస్‌లా ఉంటుంది..
Meal Maker Fried Rice
Follow us on

మీల్ మేకర్ గురించి అందరికీ తెలుసు. వీటిని ఎక్కువగా పులావ్, సైడ్ డిష్‌లో ఉపయోగిస్తూ ఉంటారు. మీల్ మేకర్ చాలా రుచిగా ఉంటుంది. అదే విధంగా పోషకాలు కూడా చాలా ఎక్కువే. ఇందులో ప్రోటీన్, ఫైబర్ ఎక్కువ శాతంలో ఉంటుంది. బరువు తగ్గాలి అనుకునే వారు మీల్ మేకర్ ఆహారంగా తీసుకోవచ్చు. మీల్ మేకర్ కర్రీ సరిగ్గా వండాలే కానీ.. మటన్, చికెన్ తిన్న ఫీలింగ్ ఉంటుంది. ఇంత టేస్టీ ఐటెమ్‌తో ఫ్రైడ్ రైస్ చేసుకుని తింటే చాలా రుచిగా ఉంటుంది. వెజిటేరియన్స్‌కి బాగా నచ్చుతుంది. మరి ఈ ఫ్రైడ్ రైస్‌కి కావాల్సిన పదార్థాలు ఏంటి? ఎలా తయారు చేస్తారో ఇప్పుడు చూద్దాం.

మీల్ మేకర్ ఫ్రైడ్ రైస్‌కి కావాల్సిన పదార్థాలు:

బియ్యం, మీల్ మేకర్, ఉల్లిపాయ, పచ్చి మిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్, క్యాప్సికమ్, ఉప్పు, కారం, పసుపు, కొత్తిమీర, కరివేపాకు, ధనియాల పొడి, కార్న్ ఫ్లోర్, రెడ్ చిల్లీ సాస్, సోయాసాస్, మిరియాల పొడి, వెనిగర్, ఆయిల్.

మీల్ మేకర్ ఫ్రైడ్ రైస్‌ తయారీ విధానం:

ముందుగా ఈ ఫ్రైడ్ రైస్ తయారు చేయడానికి రైస్‌ని పొడి పొడిగా వచ్చేలా అన్నం తయారు చేసి పెట్టుకోవాలి. అన్నం వండేటప్పుడు ఇందులో కొద్దిగా ఉప్పు, ఆయిల్ వేస్తే.. పొడి పొడిగా వస్తుంది. ఇప్పుడు మీల్ మేకర్స్‌ని గోరు వెచ్చటి నీటిలో వేసి ఓ పది నిమిషాలు నానబెట్టాలి. ఆ తర్వాత శుభ్రంగా కడిగి నీళ్లను పిండేసి తీసుకోవాలి. మీల్ మేకర్‌లో కారం, పసుపు, ఉప్పు, ధనియా పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, కార్న్ ఫ్లోర్ వేసి బాగా కలిపి.. ఓ అరగంట పక్కన పెట్టాలి. ఇప్పుడు స్టవ్ మీద ఆయిల్ పెట్టి.. వేడెక్కాక.. వీటిని వేయించి పక్కకు తీసుకోవాలి.

ఇవి కూడా చదవండి

ఇప్పుడు ఆ ఆయిల్ అంతా తీసేసి.. అందులో కరివేపాకు, ఉల్లిపాయలు, పచ్చి మిర్చి వేసి ఫ్రై చేయాలి. ఆ తర్వాత క్యాప్సికం ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలపాలి. ఉంటే క్యాబేజీ, క్యారెట్ తురుము కూడా వేసుకోవచ్చు. ఇవి ఫ్రై అవుతున్నప్పుడు సోయాసాస్, వెనిగర్, రెడ్ చిల్లీ సాస్ కూడా వేసి ఓ సారి కలుపుకోవాలి. ఇప్పుడు చిన్న గ్లాస్‌లో సగం వాటర్ పోసి బాగా కలపాలి. ఇందులోనే ముందుగా పక్కన పెట్టుకున్న మీల్ మేకర్ వేసి బాగా కలిపాక, ఉడికించి పక్కన పెట్టిన అన్నాన్ని వేయాలి. చివరగా కొత్తిమీర చల్లి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే ఎంతో రుచిగా ఉండే మీల్ మేకర్ ఫ్రైడ్ రైస్ సిద్ధం.