సూప్ లలో ఎన్నో రకాలు.. వెరైటీలు ఉంటాయి. ఒక్కొక్కరు ఒక్కోలా చేస్తారు. చాలా మంది సూప్స్ ని అంటే రెస్టారెంట్, హోటల్స్ లోనే తాగుతూంటారు. అలా కాకుండా మనం వాటిని రెస్టారెంట్ స్టైల్ లో ఇంట్లో కూడా ఈజీగా చేసుకోవచ్చు. అదే రుచిని ఆస్వాదించ వచ్చు. అలాగే గార్లిక్ సూప్స్ చాలా రకాలు ఉంటాయి. ఇప్పుడు చెప్పే గార్లిక్ సూప్ సింపుల్ గా చేసుకోవచ్చు. అందులోనూ చలి కాలంలో ఇలా ఘాటుగా చేసుకుని తాగితే.. చలి అంతా ఎగిరి పోతుంది. అంతే కాకుండా ఇమ్యునిటీగా కూడా పని చేస్తుంది. చాలా మంది వింటర్ సీజన్ లో జలుబు, గొంతు నొప్పి, దగ్గు వంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇలాంటి టైమ్ లో ఈ గార్లిక్ సూప్ ని తయారు చేసుకుని తాగితే అవన్నీ ఎగిరి పోతాయి. మరి ఈ గార్లిక్ సూప్ ని ఎలా తయారు చేసుకుంటారు? కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.
గార్లిక్ సూప్ తయారీకి కావాల్సిన పదార్థాలు:
వెల్లుల్లి, నూనె, కార్న్ ఫ్లోర్, ఉప్పు, మిరియాల పొడి, చిల్లీ ఫ్లేక్స్, కొత్తి మీర.
గార్లిక్ సూప్ తయారీ విధానం:
ఈ గార్లిక్ సూప్ ని సింపుల్ గా తయారు చేసుకోవచ్చు. ముందుగా ఒక చిన్న బౌల్ లో కార్న్ ఫ్లోర్ లో నీళ్లు వేసి.. ఉండలు లేకుండా కలుపు కోవాలి. ఇప్పుడు ఒక కడాయి తీసుకుని నూనె వేసి వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడెక్కాక.. వెల్లుల్లిని కచ్చా పచ్చా దంచి.. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ఇవి కలర్ మారేంత వరకూ వేయించు కోవాలి. ఇప్పుడు ఒకటిన్నర గ్లాస్ నీటిని వేసి కలుపు కోవాలి. ఈ నీళ్లు బాగా మరుగుతున్నప్పుడు కార్న్ ఫ్లోర్ వేసి బాగా కలపాలి.
ఆ తర్వాత కొద్దిగా మిరియాల పొడి, రుచికి సరిపడా ఉప్పు వేసి మరోసారి కలుపు కోవాలి. ఇప్పుడు మంటను మీడియంలోకి తగ్గించి.. మరుగుతున్న సూప్ లో చిల్లీ ఫ్లేక్స్, కొత్తిమీర వేసి కలపాలి. మరో నిమిషం పాటు స్టవ్ మీద ఉంచి.. నెక్ట్స్ స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే గార్లిక్ సూప్ రెడీ. దీన్ని వేడి వేడిగా ఉన్నప్పుడు సాయంత్రం టైమ్ లో తాగితే.. హాయిగా ఉంటుంది. ఇంకెందుకు లేట్ ఈ సింపుల్ సూప్ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. కేవలం రుచి మాత్రమే కాకుండా ఆరోగ్యాన్ని కూడా పొందవచ్చు.