Dry Fruits Payasam: డ్రై ఫ్రూట్స్‌తో హెల్దీ పాయసం.. చాలా ఈజీగా అయిపోతుంది..

| Edited By: Shaik Madar Saheb

Jan 06, 2025 | 10:28 PM

స్వీట్స్ అంటే చాలా మందికి ఇష్టం. అందులోనూ పాయసం అంటే మరీ ఇష్టం. ఇంట్లో ఎవరి బర్త్ డే ఉన్నా పాయసం చేస్తూ ఉంటారు. ఇది చాలా రుచిగా ఉంటుంది. చాలా ఈజీగా అయిపోయే రెసిపీ కూడా. ఇలాంటి రెసిపీని మనం మరింత హెల్దీగా తయారు చేసుకోవచ్చు. డ్రై ఫ్రూట్స్ వేసి చేస్తే మరింత రుచిగా ఉంటుంది. పైగా ఆరోగ్యానికి కూడా మంచిది..

Dry Fruits Payasam: డ్రై ఫ్రూట్స్‌తో హెల్దీ పాయసం.. చాలా ఈజీగా అయిపోతుంది..
Dry Fruits Payasam
Follow us on

స్వీట్స్ అంటే చాలా మందికి ఇష్టం. అందులోనూ పాయసం అంటే మరీ ఇష్టం. ఇంట్లో ఎవరి బర్త్ డే ఉన్నా పాయసం చేస్తూ ఉంటారు. ఇది చాలా రుచిగా ఉంటుంది. చాలా ఈజీగా అయిపోయే రెసిపీ కూడా. ఇలాంటి రెసిపీని మనం మరింత హెల్దీగా తయారు చేసుకోవచ్చు. డ్రై ఫ్రూట్స్ వేసి చేస్తే మరింత రుచిగా ఉంటుంది. పైగా ఆరోగ్యానికి కూడా మంచిది. పిల్లలకు ఇస్తే మంచి పోషకాలు అందుతాయి. మరి ఈ డ్రై ఫ్రూట్స్ పాయసం ఎలా తయారు చేస్తారు? ఈ రెసిపీ తయారీకి కావాల్సిన పోషకాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.

డ్రై ఫ్రూట్స్ పాయసానికి కావాల్సిన పదార్థాలు:

అన్ని రకాల డ్రై ఫ్రూట్స్, పాలు, సగ్గుబియ్యం, పంచదార, నెయ్యి, యాలకుల పొడి.

ఇవి కూడా చదవండి

డ్రై ఫ్రూట్స్ పాయసం తయారీ విధానం:

ఓ గిన్నెలో పాలు వేసి స్టవ్ మీద పెట్టుకోవాలి. ఇవి మరుగుతూ ఉండగా.. ఓ గంట ముందుగానే వేడి నీటిలో సగ్గుబియ్యం వేసి నానబెట్టుకోవాలి. సగ్గుబియ్యం వేయడం వల్ల పాయసం మరింత రుచిగా వస్తుంది. ఆరోగ్యానికి కూడా మంచిది. అలాగే మీరు డ్రై ఫ్రూట్స్‌‌లో బాదం, జీడిపప్పు తీసుకుని వేడి నీళ్లు వేసి ఓ అరగంట సేపు నానబెట్టాలి. ఇలా నానబెట్టిన వాటిల్లో సగం ముక్కలుగా కట్ చేసి.. మరికొన్ని మిక్సీలో వేసి మెత్తగా పేస్టు చేసుకోవాలి. మరుగుతున్న నీటిలో నానబెట్టిన సగ్గుబియ్యం, డ్రై ఫ్రూట్స్ పేస్ట్ వేసి బాగా మరిగించాలి. పాలు కాస్త చిక్క పడుతున్న సమయంలో కొద్దిగా చక్కెర, యాలకుల పొడి వేసి కలిపి.. ఓ ఉడుకు వచ్చాక స్టవ్ ఆఫ్ చేయాలి. ఇప్పుడు నెయ్యిలో వేయించిన డ్రై ఫ్రూట్స్‌ వేసి పై నుంచి గార్నిష్ చేసుకోవాలి. అంతే ఎంతో రుచిగా ఉండే డ్రై ఫ్రూట్స్ పాయసం సిద్ధం.