పాకం గారెలు అంటే చాలా మందికి ఇష్టం. తీపి వంటలు అంటే ఇష్టమైన వాటిల్లో ఇది కూడా ఒకటి. కానీ చేసుకోవడం రాక ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇవి తియ్యగా చాలా టేస్టీగా ఉంటాయి. పాకం గారెలు చాలా టేస్టీగా ఉంటాయి. పూర్వం మాత్రమే పెద్దలు ఈ వంటకం చేసేశారు. రాను రాను ఈ వంట చేయడం తగ్గి పోయింది. చాలా మందికి ఈ తీపి వంటకాన్ని ఎలా చేస్తారో తెలియదు. కానీ వీటిని చేయడం చాలా సులభం. పండుగలు, స్పెషల్ డేస్ లో ఈ పాకం గారెలను చేసుకోవచ్చు. ప్రసాదంగా కూడా వీటిని పెట్టొచ్చు. మరి ఈ పాకం గారెలను ఎలా తయారు చేస్తారు? పాకం గారెలకు కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
మినపప్పు, బెల్లం తురుము, మిరియాల పొడి, యాలకుల పొడి, ఉప్పు, నూనె.
ఈ గారెలను తయారు చేసుకోవాలంటే.. ముందుగా మినపప్పును నాన బెట్టు కోవాలి. ఆ తర్వాత వీటిని వీటిని శుభ్రంగా కడిగి పక్కన పెట్టు కోవాలి. ఈ లోపు ఒక గిన్నెలో బెల్లాన్ని తురుమి పెట్టు కోవాలి. ఈ బెల్లం తురుములో కొద్దిగా వాటర్ పోసి.. స్టవ్ మీద పెట్టాలి. ఇది ఓ రెండు మూడు పొంగులు వచ్చే వరకు మరిగించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అయితే బెల్లం కరిగిన తర్వాత ఏర్పడిన తేటను తీసేస్తూ ఉండాలి. ఈ బెల్లం పాకంలోనే యాలకుల పొడి, మిరియాల పొడిని కూడా వేసి కలిపి పక్కకు పెట్టుకోవాలి.
ఆ తర్వాత కడిగిన మినపప్పును గ్రైండర్ లో వేసి నీళ్లు పోస్తూ.. మెత్తగా గారెలకు సరిపడే లాగ పిండిని రుబ్బుకుని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసి.. వేడి చేసుకోవాలి. నూనె వేడెక్కాక.. గారెల్లా వత్తుకుని నూనెలో వేసి వేయించు కోవాలి. వీటిని రెండు వైపులా ఎర్రగా వేయించి పక్కన పెట్టు కోవాలి. ఇప్పుడు తయారైన గారెలను.. ముందుగా తయారు చేసుకున్న పాకంలో వేసి కనీసం అరగంట పాటైనా నాన బెట్టుకోవాలి. ఆ తర్వాత సర్వింగ్ చేసుకుని తినేయడమే. అంతే ఎంతో టేస్టీ అయిన గారెలు సిద్ధం. మరి ఇంకెందుకు లేట్ మీరు కూడా ఓసారి ట్రై చేయండి.