AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Thotakura Old Recipe: పాత కాలం పద్దతిలో చేసే ఆరోగ్యకరమైన వంటకం ఇది.. ఒక్కసారి ట్రై చేస్తే వదలరు!

పూర్వం నుంచి మన ఆరోగ్యం కోసం ఎన్నో రకాల పద్దతులను అవలంభించేవారు పెద్దలు. కానీ మారుతున్న కాలం అనుగుణంగా అందరూ మారుతూ వాటిని కూడా మార్చుకుంటూ.. మర్చిపోకుండా వచ్చారు. అయితే మళ్లీ ఇప్పుడు పాత కాలం రోజులే వస్తున్నాయి. పెరుగుతున్న రోగాల కారణంగా జనాలందరూ మళ్లీ పూర్వం ఉపయోగించే ఇంటి చిట్కాలు, వంటలు, వంటలు చేసే విధానాలను మార్చుతున్నారు. పాత కాలంలో మట్టి గుండల్లో, రాగి బిందెల్లో నీటిని తాగుతూ, ఇంటి వైద్యాన్ని..

Thotakura Old Recipe: పాత కాలం పద్దతిలో చేసే ఆరోగ్యకరమైన వంటకం ఇది.. ఒక్కసారి ట్రై చేస్తే వదలరు!
Benefits Of Thotakura
Chinni Enni
| Edited By: |

Updated on: Oct 06, 2023 | 10:08 PM

Share

పూర్వం నుంచి మన ఆరోగ్యం కోసం ఎన్నో రకాల పద్దతులను అవలంభించేవారు పెద్దలు. కానీ మారుతున్న కాలం అనుగుణంగా అందరూ మారుతూ వాటిని కూడా మార్చుకుంటూ.. మర్చిపోకుండా వచ్చారు. అయితే మళ్లీ ఇప్పుడు పాత కాలం రోజులే వస్తున్నాయి. పెరుగుతున్న రోగాల కారణంగా జనాలందరూ మళ్లీ పూర్వం ఉపయోగించే ఇంటి చిట్కాలు, వంటలు, వంటలు చేసే విధానాలను మార్చుతున్నారు. పాత కాలంలో మట్టి గుండల్లో, రాగి బిందెల్లో నీటిని తాగుతూ, ఇంటి వైద్యాన్ని ఉపయోగిస్తూ హెల్దీగా, బలంగా, దృఢంగా ఉన్నారు. కానీ ఇప్పుడు వైద్య వ్యవస్థలో ఎన్ని మార్పులు వస్తున్నా.. కూడా రోగాలు మరింత ఎక్కువ అవుతున్నాయి. దీంతో అందరూ పూర్వం పెద్దలు ఉపయోగించిన ఇంటి చిట్కాలు, ఆహార నియమాలను పాటిస్తున్నారు. ఇప్పుడు ఆ తరానికి చెందిన వంటకమే ఇది. ఈ వంటకం రుచితో పాటు ఎంతో ఆరోగ్యాన్ని కూడా ఇస్తుంది. మరి ఆ వంటకం ఏంటి? కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం.

తోటకూర రుబ్బు తాళింపు కూరకు కావాల్సిన పదార్థాలు:

చిన్న తోటకూర, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, ఎండు మిర్చి, వెల్లుల్లి రెబ్బలు, చనగ పప్పు, ధనియాలు, జీలకర్ర, మెంతులు, కరివేపాకు, కొత్తి మీర, చింత పండు, ఉప్పు, పసుపు, కారం, టమాటాలు, నూనె.

ఇవి కూడా చదవండి

రుబ్బు తాళింపు కూర తయారు చేయు విధానం:

ముందుగా తోట కూరను శుభ్రంగా కడిగి కాడలతో సహా చిన్నగా తరిగి పక్కన పెట్టుకోవాలి. ఈ తోట కూరను లోతాటి పాత్రలో వేయాలి. ఆ తర్వాత ఉల్లిపాయలు, పచ్చి మర్చి, కరివేపాకు, కారం, టమాటాలు, ఉప్పు, పసుపు అన్నీ వేసి, మూత పెట్టి బాగా ఉడికించుకోవాలి. నీరంతా పోయిన తర్వాత పప్పు గుత్తితో రుబ్బుకోవాలి. ఇప్పుడు ఇందులో చింత పండు రసం, కొద్దిగా నీళ్లు వేసి మరికాసేపు ఉడికించుకోవాలి. బాగా ఉడికించుకున్నాక స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కకు పెట్టుకోవాలి.

ఇప్పుడు తాళింపు పెట్టుకోవడానికి మరో పాన్ తీసుకుని నూనె వేడి చేసుకోవాలి. తాళింపు దినుసులన్నీ ఒక్కొక్కటీ వేసి తాళింపు పెట్టుకోవాలి. తాళింపు వేగాక.. కర్రీలో వేసుకోవడమే. అంతే ఎంతో టేస్టీగా ఉండే తోటకూర రుబ్బు తాళింపు కూర రెడీ. ఇది తినడం వల్ల సీజనల్ ద్వారా వచ్చే అనారోగ్య సమస్యలే కాకుండా, ఇమ్యూనిటీ పెంచుతుంది. తోటకూర తినడం వల్ల బరువు తగ్గడమే కాకుండా, జీర్ణ సమస్యలు కూడా ఉంటాయి.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

గమనిక: ఇది నిపుణుల నుంచి సేకరించిన సమాచారం. వీటిని ఫాలో అయ్యే ముందు ఒకసారి వైద్యుల్ని సంప్రదించడం మేలు.

Follow Us
రూపాయి సబ్‌స్క్రిప్షన్ లేకుండా ఫ్రీగా ఫిఫా వరల్డ్ కప్ చూసే ట్రిక్
రూపాయి సబ్‌స్క్రిప్షన్ లేకుండా ఫ్రీగా ఫిఫా వరల్డ్ కప్ చూసే ట్రిక్
మీ సేవా కేంద్రాలకు వెళ్లాల్సిన పనే లేదు..ఏది కావాలన్నా మీ ఊర్లోనే
మీ సేవా కేంద్రాలకు వెళ్లాల్సిన పనే లేదు..ఏది కావాలన్నా మీ ఊర్లోనే
8 + 8 = 4 ఎలా సాధ్యం? గణితం కాదు, లాజిక్ కావాలి..
8 + 8 = 4 ఎలా సాధ్యం? గణితం కాదు, లాజిక్ కావాలి..
గౌతమ్ గంభీర్‌ను కాదని డైరెక్ట్‌గా బీసీసీఐతో సీనియర్ల చర్చలు
గౌతమ్ గంభీర్‌ను కాదని డైరెక్ట్‌గా బీసీసీఐతో సీనియర్ల చర్చలు
1999లో రిలీజ్.. థియేటర్లు దద్దరిల్లిపోయాయి..
1999లో రిలీజ్.. థియేటర్లు దద్దరిల్లిపోయాయి..
గల్ఫ్ ప్రాంతంలో ఉద్రిక్తతలు.. నావికుల రక్షణ కోసం కేంద్రం చర్యలు
గల్ఫ్ ప్రాంతంలో ఉద్రిక్తతలు.. నావికుల రక్షణ కోసం కేంద్రం చర్యలు
హైదరాబాద్ ప్రజలకు శుభవార్త.. నగరంలో మరో భారీ ఫ్లైఓవర్..
హైదరాబాద్ ప్రజలకు శుభవార్త.. నగరంలో మరో భారీ ఫ్లైఓవర్..
విద్యార్థులకు బిగ్ రిలీఫ్.. ఈ విషయంలో హైకోర్టు కీలక ఆదేశాలు
విద్యార్థులకు బిగ్ రిలీఫ్.. ఈ విషయంలో హైకోర్టు కీలక ఆదేశాలు
విద్యార్థుల టెన్షన్‌కు బ్రేక్.. జూన్ మూడో వారంలో ఆ 2 కీలక ఫలితాలు
విద్యార్థుల టెన్షన్‌కు బ్రేక్.. జూన్ మూడో వారంలో ఆ 2 కీలక ఫలితాలు
జాబ్ కాకపోయినా జాక్‌పాట్ లాంటి అవకాశం.. DRDOలో ఇంటర్న్‌షిప్‌లు!
జాబ్ కాకపోయినా జాక్‌పాట్ లాంటి అవకాశం.. DRDOలో ఇంటర్న్‌షిప్‌లు!