Kitchen Hacks: చపాతీ కర్రను క్లీన్ చేయకుండా పక్కకు పడేస్తున్నారా.. ఎంత ప్రమాదమో తెలుసా!

మన వంట గది క్లీన్ గా, పరిశుభ్రంగా ఉంటేనే ఇంట్లోని సభ్యులు కూడా ఆరోగ్యంగా ఉంటారు. వంటగది బావుంటేనే ఇంట్లోని వారందరూ ఆరోగ్యంగా ఉంటారు. చాలా మంది ఏం తింటున్నాం? ఎంత తింటున్నాం? అని ఆలోచిస్తారు కానీ.. అది ఆరోగ్యంగా ఉందా? అన్న విషయం మాత్రం సరిగ్గా ఆలోచించారు. సాధారణంగా మనం వంటగది పరిశుభ్రతని నిర్లక్ష్యం చేస్తూంటారు. వంట గది క్లీనింగ్ అనేది ప్రధాన మైనది. ముఖ్యంగా ఇప్పుడు రాత్రి చాలా మంది వరకు చపాతీ, పుల్కా వంటి వాటిని..

Kitchen Hacks: చపాతీ కర్రను క్లీన్ చేయకుండా పక్కకు పడేస్తున్నారా.. ఎంత ప్రమాదమో తెలుసా!
Wooden Rolling
Follow us

| Edited By: Phani CH

Updated on: Oct 06, 2023 | 10:08 PM

మన వంట గది క్లీన్ గా, పరిశుభ్రంగా ఉంటేనే ఇంట్లోని సభ్యులు కూడా ఆరోగ్యంగా ఉంటారు. వంటగది బావుంటేనే ఇంట్లోని వారందరూ ఆరోగ్యంగా ఉంటారు. చాలా మంది ఏం తింటున్నాం? ఎంత తింటున్నాం? అని ఆలోచిస్తారు కానీ.. అది ఆరోగ్యంగా ఉందా? అన్న విషయం మాత్రం సరిగ్గా ఆలోచించారు. సాధారణంగా మనం వంటగది పరిశుభ్రతని నిర్లక్ష్యం చేస్తూంటారు. వంట గది క్లీనింగ్ అనేది ప్రధాన మైనది. ముఖ్యంగా ఇప్పుడు రాత్రి చాలా మంది వరకు చపాతీ, పుల్కా వంటి వాటిని తింటున్నారు. అయితే వీటిని చేసుకోగానే చపాతీ కర్ర, పీట వంటిని పక్కకు పెట్టేస్తారు. క్లీన్ కూడా చేయరు.. క్లాత్ తో తుడిచేసి పక్కకు పెడతారు. మళ్లీ అవసరం ఉన్నప్పుడు మాత్రమే ఉపయోగిస్తారు. ఇలా చేయడం వల్ల వాటిపై ఎంత బ్యాక్టీరియా చేరుతుందన్న విషయం మర్చిపోతారు. ఏదో చేస్తున్నాం అనుకుంటారు కానీ.. మళ్లీ వాటిపైనే చేసి తింటే.. అవి ఆరోగ్యంగా కాకుండా విషంగా మారతాయి. దీంతో జీర్ణ సమస్యలు కూడా తలెత్తే అవకాశాలు ఉన్నాయి.

అసలు ఈ చపాతీ కర్రను ఎలా శుభ్రం చేయాలి:

మీరు ఈ చపాతి కర్ర, పీటను ఉపయోగించిన ప్రతి సారీ శుభ్రం చేయాలి. ఉపయోగించే ముందు అలాగే మీ పని ముగిసిన తర్వాత కూడా క్లీన్ చేసుకోవాలి. గోరు వెచ్చటి నీతో కానీ, లేదా డిష్ సోప్ తో అయినా, వెనిగర్ తో కూడా ఈ చపాతీ కర్రను శుభ్ర పరుచుకోవచ్చు. చపాతీ కర్ర పట్టే విధంగా ఒక లోతైన పాత్రను తీసుకుని అందులో గోరు వెచ్చని నీరు, కాస్త డిష్ వాష్ లిక్విడ్ వేసుకోవాలి. వీటిని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇందులో చపాతీ కర్ర, పీటను కాసేపు నాన బెట్టాలి.

ఇవి కూడా చదవండి

వెనిగర్ వాటర్ లో అయినా వీటిని నాన బెట్టి క్లీన్ చేసుకోవచ్చు. ఇలా చేయడం వల్ల చపాతీ కర్ర, పీట క్లీన్ అవుతాయి. ఆ తర్వాత వీటిని శుభ్రంగా తుడిచి పక్కకు పెట్టుకోవాలి. అలా కాకుండా వాటిని క్లీన్ చేయకుండా పక్కు పెడితే వాటిపై క్రిములు, బ్యాక్టీరియా చేరుతాయి. దీంతో మళ్లీ వాటిని ఉపయోగించడం వల్ల అనేక అనారోగ్య సమస్యలు వెంటాడుతాయి. కాబట్టి చపాతీ కర్ర, పీట ఉపయోగించినప్పుడు, పని అయిపోయిన తర్వాత వాటిని క్లీన్ చేసుకోవాలి.

చపాతీ కర్ర జీవితాన్ని పెంచండిలా:

చపాతీ కర్రలు, పీటలు తొందరగా పగులు వస్తాయి. దీంతో చపాతీలు, పుల్కాలు చేయడానికి వీలుండదు. మళ్లీ కొత్తవి కొనాల్సి వస్తాయి. ఇలా కాకుండా ఇవి ఎక్కువ కాలం రావాలంటే.. చపాతీ కర్ర లేదా పీటను ఉపయోగించిన ప్రతి సారీ శుభ్రంగా క్లీన్ చేసుకున్నాక.. దానికి ఇంట్లో ఉండే కొబ్బరి నూనె లేదా మంచు నూనెను వాటికి రాయాలి. ఇలా అరగంట తర్వాత వాటిని క్లాత్ తో తుడిచి పక్కకు పెట్టుకోవచ్చు. ఇలా చేయడం వల్ల చపాతీ కర్ర లేదా పీట ఎక్కువ కాలం వస్తాయి.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

గమనిక: ఇది నిపుణుల నుంచి సేకరించిన సమాచారం. వీటిని ఫాలో అయ్యే ముందు ఒకసారి వైద్యుల్ని సంప్రదించడం మేలు.