Kitchen Hacks: కూరల్లో ఉప్పు ఎక్కువ అయిందా.. అయితే వాటిని ఇలా సెట్ చేయండి!

ఉదయం లేవగానే లంచ్ బాక్సులు, టిఫిన్లు, చెట్నీలు, కూరలు, టీలు ఇలా హడావిడిగా ఉంటుంది. పిల్లలు స్కూళ్లకు, హస్పెండ్స్ ఆఫీసుకు వెళ్తూంటారు. ఈ సమయంలో కాస్త హడావిడగానే ఉంటుంది. దీంతో కూరలు వండే టప్పుడు ఒక్కోసారి ఉప్పు ఎక్కువ అవుతుంది. చాలా మంది ఉప్పు ఎక్కువ అయితే నిమ్మ కాయ పిండుతారు అయినా ఉప్పు తగ్గదు. దీంతో ఎవరూ కూరను తినరు. బాక్సుల్లో పెడితే బాగోదు. దీంతో ఏం చేయాలా అని ఆలోచిస్తూనే.. వండిన కూరను పక్కకు పెట్టి..

Kitchen Hacks: కూరల్లో ఉప్పు ఎక్కువ అయిందా.. అయితే వాటిని ఇలా సెట్ చేయండి!
Salt
Follow us

| Edited By: Phani CH

Updated on: Oct 06, 2023 | 10:08 PM

ఉదయం లేవగానే లంచ్ బాక్సులు, టిఫిన్లు, చెట్నీలు, కూరలు, టీలు ఇలా హడావిడిగా ఉంటుంది. పిల్లలు స్కూళ్లకు, హస్పెండ్స్ ఆఫీసుకు వెళ్తూంటారు. ఈ సమయంలో కాస్త హడావిడగానే ఉంటుంది. దీంతో కూరలు వండే టప్పుడు ఒక్కోసారి ఉప్పు ఎక్కువ అవుతుంది. చాలా మంది ఉప్పు ఎక్కువ అయితే నిమ్మ కాయ పిండుతారు అయినా ఉప్పు తగ్గదు. దీంతో ఎవరూ కూరను తినరు. బాక్సుల్లో పెడితే బాగోదు. దీంతో ఏం చేయాలా అని ఆలోచిస్తూనే.. వండిన కూరను పక్కకు పెట్టి.. మళ్లీ ఎగ్ ఫ్రై లాంటిది చేసి బాక్సుల్లో పెడతారు. ఇలా కాకుండా కూరల్లో ఉప్పు ఎక్కువ అయిందనుకోండి ఈ సారి ఇలా చేయండి. ఈ సింపుల్ టిప్స్ పాటిస్తే కూరలకు మంచి టేస్ట్ కూడా వస్తుంది. మరింకెందుకు లేట్ ఆ చిట్కాలు ఏంటో ఇప్పుడు చూసెద్దాం.

కొబ్బరి పాలు:

మీరు చేసే కూరల్లో ఉప్పు ఎక్కువ అయితే.. ఈసారి కొబ్బరి పాలు కలపండి. కొబ్బరి పాలను కూరల్లో యూజ్ చేస్తే.. ఉప్పు తగ్గడమే కాకుండా టేస్ట్ కూడా సూపర్ ఉంటుంది. కొబ్బరి పాలను వేసి కూరను సిమ్ లో పెట్టి ఉడికించండి. సింపుల్ ఇలా ఈజీగా ఉప్పు తగ్గుతుంది. మరో విషయం ఏంటంటే కొబ్బరి పాలు చిక్కగా ఉండేలా చూసుకోవాలి.

ఇవి కూడా చదవండి

బంగాళ దుంపలు:

ఈ చిట్కా కూడా బాగా వర్క్ అవుతుంది. కూరల్లో ఉప్పు ఎక్కువ అయిందని కంగారు, ఆందోళన అస్సలు పడకండి. ఈ సారి కూరల్లో ఉప్పు ఎక్కువ అయితే కనుక.. బంగళా దుంపల్ని ఉడికించి .. కూరలో కలిపేయండి. కూరలో ఉన్న ఉప్పు ఆలూ పీల్చుకుంటుంది. దీంతో కూరలో సాల్ట్ నార్మల్ గా ఉంటుంది. ఇలా చేయడం వల్ల కూరకు మంచి రుచి వస్తుంది.

గోధుమ పిండి:

ఉప్పు తగ్గించుకునేందుకు ఇది కూడా బాగా వర్క్ అవుతుంది. గోధుమ పిండితో కూడా ఉప్పును తగ్గించుకోవచ్చు. గోధుమ పిండిని కొద్దిగా గిన్నెలోకి తీసుకుని.. నీళ్లు వేసి ఉండలుగా చేసుకోవాలి. ఈ ఉండలను కూరలో వేసి ఓ ఐదు లేదా పది నిమిషాలు అలా వదిలేయండి. ఉండలు వేశాక కూరని వేడి చేయకూడదు. కూరలో ఉన్న ఉప్పు అంతా గోధుమ పిండి ఉండలు పీల్చేస్తాయి.

ఉల్లిపాయ లేదా టమోటా:

కూరలో ఉప్పు ఎక్కువ అయితే.. టమాటాలు లేదా ఉల్లిపాయలు బాగా హెల్ప్ అవుతాయి. ఉల్లి పాయలు లేదా టమాటాలను ముందు నూనె వేసి ఓ పాన్ లో బాగా వేయించుకోవాలి. వీటిని మిక్సీ పట్టి కూరలో వేసి బాగా ఉడకనివ్వాలి. ఇలా చేస్తే ఉప్పు తగ్గడమే కాకుండా రుచి కూడా పెరుగుతుంది.

అంతే ఇలా సింపుల్ సింపుల్ చిట్కాలను పాటిస్తే కూరల్లో ఉప్పును తగ్గించుకోవచ్చు. కూరలు కూడా టేస్టీగా వస్తాయి.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

గమనిక: ఇది నిపుణుల నుంచి సేకరించిన సమాచారం. వీటిని ఫాలో అయ్యే ముందు ఒకసారి వైద్యుల్ని సంప్రదించడం మేలు.