Rice Kheer Recipe: స్వీట్ తినాలనిపిస్తోందా? ఇది ట్రై చేయండి.. కేవలం 15 నిమిషాల్లో రెడీ.. యమ్మీ యమ్మీగా ఉంటుంది..
మీలో ఉత్సాహాన్ని పెంచడానికి ఆ హాట్ హాట్ రైస్ ఖీర్ బాగా ఉపయోగపడుతుంది. అలాగే మంచి బ్రేక్ ఫాస్ట్ లాగానూ తీసుకోవచ్చు. ఇంతకీ దీనిని తయారు చేయడం ఎలా?

పాయసం అందరికీ తెలుసు. ప్రతి శుభ కార్యంలోనూ ఇది మెనూలో తప్పనిసరిగా ఉంటుంది. కానీ రైస్ ఖీర్ అనగానే అదేదో కొత్త వంటకం అనుకుంటారు. కానీ రైస్ ఖీర్ కూడా ఓ పాయసం లాగానే ఉంటుంది. కానీ పాయసం కాదు. చల్లటి వాతావరణం.. చీకటి కమ్ముకున్న మేఘాలు మీలో డ్రౌజీ నెస్ పెంచేస్తే వెంటనే ఈ రెసిపీని తయారు చేసుకోండి.. మీలో ఉత్సాహాన్ని పెంచడానికి ఆ హాట్ హాట్ రైస్ ఖీర్ బాగా ఉపయోగపడుతుంది. అలాగే మంచి బ్రేక్ ఫాస్ట్ లాగానూ తీసుకోవచ్చు. ఇంతకీ దీనిని తయారు చేయడం ఎలా? అని ఆలోచిస్తున్నారా? ఏం కష్టం లేదండి.. మీ ఇంట్లో వస్తువులతోనే కేవలం 15 నిమిషాల్లోనే రైస్ ఖీర్ ను తయారు చేసుకోవచ్చు అది ఎలాగో చూద్దాం రండి..
చాలా రకాలు ఉన్నా..
అనేక రకాల ఖీర్‌లు ఉన్నప్పటకీ చావల్ (బియ్యం) ఖీర్ రుచి సెపరేటు. మీకు సడన్ గా స్వీట్ తినాలని అనిపించినా.. లేదా మీ ఇంటికి వచ్చిన అతిథులకు వడ్డించాలన్నా ఇదే బెస్ట్ ఆప్షన్. మీ ఇంట్లో వస్తువులతోనే డెలిషియస్ రెసిపీని తయారు చేసుకోవచ్చు. దీనికోసం ఒక లీటర్ పాలు, 80 గ్రాముల బియ్యం, రుచికి సరపడా చక్కెర, డ్రై ఫ్రూట్స్, పచ్చి ఏలకులు, బాదం పప్పు, అవసరం అయితే డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చు.
ఇలా చేయాలి..
ఒక గిన్నెలో 80 గ్రాముల కడిగిన బియ్యం ఉంచండి. అవకాశం ఉంటే అరగంట సేపు నీటిలో నానబెట్టండి. తర్వాత ఓ కడాయిని తీసుకొని సగం వరకూ నీటిని తీసుకొని అన్నం ఉడికించండి. ఆ తర్వాత ఒక లీటర్ పాలు దానిలో పోయాలి. మీడియం మంటపై బాగా తిప్పుతూ మరిగించాలి. పాలు చిక్కబడేంత వరకు ఇలా చేయాలి. అనంతరం మరో కడాయి తీసుకొని కొంచెం నెయ్యి వేసుకొని ఎలకులు, ఎండుద్రాక్షలతో పాటు అవసరం అయితే కొన్ని డ్రై ఫ్రూట్స్ ను వేసి వేయించండి. తర్వాత ఆ డ్రైఫ్రూట్స్ బయటకు తీసి అదే నెయ్యిలో పాలల్లో ఉడికించిన అన్నాన్ని వేయాలి. ఆ తర్వాత వేయించి పెట్టుకున్న డ్రైఫ్రూట్స్ వేసి, బాగా సువాసన వచ్చే వరకు ఉడికించాలి. అంతే మీ మోస్ట్ డెలిషియస్ రైస్ ఖీర్ రెడీ.



మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం..
