AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kesari Recipe: ఉప్మాతో విసిగిపోయారా? కప్పు రవ్వతో ఇలా చేస్తే మీ పొట్టతో పాటు మనసు కూడా హ్యాపీ!

సాయంత్రం స్నాక్స్ కోసం రుచికరమైన, ఆరోగ్యకరమైన త్వరగా తయారు చేసుకోగలిగే వంటకం కావాలంటే, కేసరి సరైన ఎంపిక. దక్షిణ భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన ఈ తీపి వంటకాన్ని పండుగలప్పుడు, పూజలప్పుడు లేదా రోజువారీ స్నాక్‌గా వడ్డిస్తారు. కేవలం ఒక చెంచా తిన్నా నోటిలో కరిగిపోయే ఈ రవ్వ కేసిరి, చక్కెర, నెయ్యి మిశ్రమం దాని సువాసన, మెరుపు రంగుతో చూడగానే నోరూరిస్తుంది. ఈ రుచికరమైన కేసరిని ఎలా తయారు చేయాలో చూద్దాం.

Kesari Recipe: ఉప్మాతో విసిగిపోయారా?  కప్పు రవ్వతో ఇలా చేస్తే మీ పొట్టతో పాటు మనసు కూడా హ్యాపీ!
Evening Snacks For Kids
Bhavani
|

Updated on: Nov 08, 2025 | 3:43 PM

Share

పిల్లలు మళ్లీ మళ్లీ కావాలని అడిగే రెసిపీల్లో ఈ రవ్వ కేసరి కూడా ముందు వరుసలో ఉంటుంది. దీని రంగు రుచి పిల్లలను అమితంగా ఆకట్టుకుంటుంది. ఇది దేవుడికి నైవేద్యంగా గెస్టులకు ఆతిథ్యంగానే కాకుండా పండగలప్పుడు చేసుకోగల స్పెషల్ స్వీట్ లా కూడా పనికొస్తుంది. మరి ఇన్ని ప్రయోజనాలున్న ఈ స్పెషల్ స్వీట్ రెసిపీని ఎలా తయారు చేయాలో అందులోకి ఏమేం కావాలో ఇప్పుడే చూసేయండి.

కావలసిన పదార్థాలు

రవ్వ – 1 కప్పు

చక్కెర – 1 ½ కప్పు (లేదా రుచికి తగినంత)

నీరు – 3 కప్పులు

నెయ్యి – ½ కప్పు

జీడిపప్పు, ఎండు ద్రాక్ష – తగినంత

ఏలకుల పొడి – ½ టీస్పూన్

కుంకుమపువ్వు లేదా పసుపు – కొద్దిగా (లేదా రంగు కోసం)

తయారీ విధానం (రెసిపీ)

రవ్వ వేయించడం కోసం ఒక పాన్ తీసుకుని, కొంచెం నెయ్యి వేడి చేసి, మీడియం మంట మీద రవ్వ వేయండి. రవ్వ లేత బంగారు గోధుమ రంగులోకి మారి, మంచి వాసన వచ్చే వరకు వేయించి, పక్కన పెట్టుకోండి. (కేసరిని ముద్ద కట్టకుండా విడిగా ఉంటేనే బాగుంటుంది అనుకునేవారు ఈ స్టెప్ ను నోట్ చేసుకోండి.

డ్రై ఫ్రూట్స్ వేయించడం కోసం అదే పాన్‌లో మరికొన్ని నెయ్యి వేసి, జీడిపప్పు ఎండుద్రాక్షలు వేసి బంగారు గోధుమ రంగు వచ్చేవరకు వేయించి, వాటిని కూడా పక్కన పెట్టుకోండి.

ఒక పాత్రలో నీళ్ళు పోసి వేడి చేసి, దానికి కుంకుమపువ్వు (లేదా రంగు కోసం) వేయండి.

నీరు బాగా మరిగేటప్పుడు, వేయించిన రవ్వను కొద్దికొద్దిగా చల్లుతూ, ఉండలు కట్టకుండా గరిటెతో వేగంగా కదిలించండి.

మంటను తగ్గించి, రవ్వ బాగా ఉడికి, నీరు మొత్తాన్ని పీల్చుకునే వరకు మూతపెట్టి ఉడికించాలి.

చక్కెర, సుగంధం: రవ్వ ఉడికిన తర్వాత, చక్కెర ఏలకుల పొడి వేయండి. చక్కెర కరగడం వల్ల కేసరి మిశ్రమం మళ్లీ ఉడకడం మొదలవుతుంది.

నెయ్యి వేసి కలుపుతూ ఉండండి. ఇప్పుడు మిగిలిన నెయ్యిని కూడా కొద్దికొద్దిగా వేస్తూ, కేసరి చిక్కగా మారి, పాన్‌కు అంటుకోకుండా వచ్చే వరకు కదిలించండి.

చివరగా, వేయించిన జీడిపప్పు ఎండుద్రాక్షలను వేసి ఒకసారి కదిలించండి.

రుచికరమైన సువాసనగల కేసరి సిద్ధంగా ఉంది! ఈ సాయంత్రం స్నాక్ పిల్లలకు రుచికరంగా మరియు ఆరోగ్యకరంగా ఉంటుంది.

Follow Us