Hair Care Tips: ఆరోగ్యకరమైన జుట్టు కోసం రోజూ ఇవి తినాల్సిందే.. ఈ విషయాలు తెలుసుకోండి!

అందమైన, ఆరోగ్యకరమైన జుట్టు కావాలని ఎవరు కోరుకోరు. మరీ ముఖ్యంగా ఆడవాళ్లకు జుట్టు మరింత అందాన్ని ఇస్తుంది. జుట్టు ఆరోగ్యకరంగా ఉండాలంటే..

Hair Care Tips: ఆరోగ్యకరమైన జుట్టు కోసం రోజూ ఇవి తినాల్సిందే.. ఈ విషయాలు తెలుసుకోండి!
Hair
Follow us
Ravi Kiran

|

Updated on: Apr 06, 2022 | 9:56 PM

అందమైన, ఆరోగ్యకరమైన జుట్టు కావాలని ఎవరు కోరుకోరు. మరీ ముఖ్యంగా ఆడవాళ్లకు జుట్టు మరింత అందాన్ని ఇస్తుంది. జుట్టు ఆరోగ్యకరంగా ఉండాలంటే.. దానిపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. ఈ మధ్యకాలంలో చాలామంది జుట్టు సమస్యలతో సతమతమవుతున్నారు. జుట్టును ఆరోగ్యకరంగా ఉంచేందుకు మార్కెట్‌లో అనేక రకాల కెమికల్ ఉత్పత్తులు ఉండగా.. వాటిని యధాలాపంగా వినియోగిస్తే.. మరిన్ని సమస్యలు చుట్టుముడతాయి. మరి జుట్టును ఎలా ఆరోగ్యంగా ఉంచుకోవాలి.! మీ ఆహారపు అలవాట్లలో చిన్న చిన్న మార్పులు చేయండి చాలు.. రోజూ పచ్చి బఠానీలు తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు పొందొచ్చు. ఇవి జుట్టును ఆరోగ్యకరంగా ఉంచేందుకు తోడ్పడతాయి.

బఠానీల్లో ప్రోటీన్లు పుష్కలంగా దొరుకుతాయి. ఇక ప్రోటీన్లు జుట్టుకు చాలా అవసరం. మొక్కల ఆధారిత ప్రోటీన్‌ పచ్చి బఠానీల్లో సమృద్ధిగా ఉంటుంది. దీనిని అనేక రకాల షాంపూలు, కండీషనర్లలో ఉపయోగిస్తున్నారు.

1. జుట్టు రాలడం, బలహీనపడటం:

వేడి, రసాయన ఉత్పత్తులు జుట్టులో ఉండే కెరాటిన్‌ ప్రోటీన్‌ను దెబ్బతీస్తాయి. దీని వల్ల జుట్టు బలహీనపడటమే కాకుండా.. రాలడం కూడా మొదలవుతుంది. ఇక బఠానీలో ఉండే ప్రోటీన్‌లో లభ్యమయ్యే అమినో యాసిడ్‌లు జుట్టు డ్యామేజ్‌ని నివారిస్తాయి. దానిని రిపేర్ చేసి కెరాటిన్‌ను పునర్నిర్మించడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి.

2. జుట్టు పెరుగుదల:

బఠానీలలో ఉండే ప్రోటీన్‌లో లభ్యమయ్యే అమినో యాసిడ్‌లు కెరాటిన్ ఉత్పత్తి స్థాయిని పెంచుతాయి. ఇక కెరాటిన్.. మీ జుట్టు దృఢంగా, మృదువుగా పెరగడంలో సహాయపడుతుంది.

3. జుట్టు ఆరోగ్యం కోసం అవసరమైన పోషకాలు:

ప్రొటీన్‌తో పాటు ఐరన్, జింక్, విటమిన్ సి వంటి పోషకాలు కూడా బఠానీలలో పుష్కలంగా లభిస్తాయి. ఇవి మీ జుట్టు ఆరోగ్యకరంగా ఉండేందుకు సహాయపడతాయి.

4. జుట్టు పొడిబారడం:

జుట్టును అందంగా మెరిసేలా చేయడానికి.. బఠానీల్లో ఉండే ప్రోటీన్ ఎంతగానో ఉపయోగపడుతుంది. జుట్టును ఎప్పుడూ హైడ్రేట్‌గా ఉంచడమే కాదు.. పొడిబారే సమస్యను తగ్గిస్తుంది.

5. జుట్టును నిగనిగలాడేలా చేస్తుంది:

బఠానీలు జుట్టుకు సహజమైన ప్రొటీన్‌ను అందించడంలో సహాయపడతాయి. తద్వారా మీ జుట్టు అందంగా మారుతుంది.

గమనిక: ఈ వార్తలో అందించిన సమాచారం అధ్యయనాలు, నిపుణులు పేర్కొన్న వివరాలు మాత్రమే. కేవలం అవగాహన కోసమే. ఏదైనా డైట్ తీసుకునే విషయంలో మీరు కచ్చితంగా వైద్యులు సలహా పాటించాలి.

లగేజ్‌ స్కాన్ చేస్తుండగా కంగారుపడ్డ వ్యక్తి.. బ్యాగ్ ఓపెన్ చేయగా
లగేజ్‌ స్కాన్ చేస్తుండగా కంగారుపడ్డ వ్యక్తి.. బ్యాగ్ ఓపెన్ చేయగా
భక్తులకు భోజనం అందించేందుకు ఇస్కాన్ తో చేతులు కలిపిన అదానీ సంస్థ
భక్తులకు భోజనం అందించేందుకు ఇస్కాన్ తో చేతులు కలిపిన అదానీ సంస్థ
సల్మాన్ ఖాన్‌ను టీజ్ చేసిన హర్భజన్-యూవీ!
సల్మాన్ ఖాన్‌ను టీజ్ చేసిన హర్భజన్-యూవీ!
ఏపీ, తెలంగాణలో సంక్రాంతి సెలవులు ఇవే.. ఎవరికి ఎన్ని రోజులంటే.?
ఏపీ, తెలంగాణలో సంక్రాంతి సెలవులు ఇవే.. ఎవరికి ఎన్ని రోజులంటే.?
తివారీ – గంభీర్‌కు కేకేఆర్ ఆటగాళ్ల మద్దతు!
తివారీ – గంభీర్‌కు కేకేఆర్ ఆటగాళ్ల మద్దతు!
ఆరు బంతుల్లో ఆరు ఫోర్లు: ఐపీఎల్ జట్లకు నారాయణ్ జగదీశన్ పంచ్!
ఆరు బంతుల్లో ఆరు ఫోర్లు: ఐపీఎల్ జట్లకు నారాయణ్ జగదీశన్ పంచ్!
టాటా గ్రూప్‌లో పెను మార్పులు.. నోయల్ టాటా కూతుళ్లకు కీలక బాధ్యతలు
టాటా గ్రూప్‌లో పెను మార్పులు.. నోయల్ టాటా కూతుళ్లకు కీలక బాధ్యతలు
సినిమా సెట్ లోనే పరీక్షలకు ప్రిపేరవుతోన్న రవీనా కూతురు.. వీడియో
సినిమా సెట్ లోనే పరీక్షలకు ప్రిపేరవుతోన్న రవీనా కూతురు.. వీడియో
నవాబుల నగరంలోని నల్ల క్యారెట్ హల్వా.. స్పెషాలిటీ ఏమిటంటే..
నవాబుల నగరంలోని నల్ల క్యారెట్ హల్వా.. స్పెషాలిటీ ఏమిటంటే..
జియో రూ.175కే ఎంటర్‌టైన్‌మెంట్‌ ప్లాన్‌.. ఉచితంగా 12 ఓటీటీ యాప్స్
జియో రూ.175కే ఎంటర్‌టైన్‌మెంట్‌ ప్లాన్‌.. ఉచితంగా 12 ఓటీటీ యాప్స్