Ice Gola ఈ భారీ ‘ఐస్ గోలా’ చూస్తే నోరూరాల్సిందే.. స్పెషల్ ఐస్‌క్రీమ్‌కు కస్టమర్ల ఫిదా.. వీడియో వైరల్..
Special Ice Cream: ఇంటర్నెట్ ప్రపంచంలో నిత్యం అనేక రకాల విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. అలాంటి వాటిల్లో రుచికరమైన ఆహారం, వాటిని తయారు చేసే విధానానికి

Special Ice Cream: ఇంటర్నెట్ ప్రపంచంలో నిత్యం అనేక రకాల విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. అలాంటి వాటిల్లో రుచికరమైన ఆహారం, వాటిని తయారు చేసే విధానానికి సంబంధించిన ఫుడ్ వీడియోలు కూడా ఉన్నాయి. ఇవి అనతి కాలంలోనే బాగా వైరల్ అవుతుంటాయి. ఇప్పటికీ చాలామంది నెట్‌లో వీడియోలను చూసి తమకు ఇష్టమైన ఆహారాన్ని తయారుచేసుకుంటుంటారు. తాజాగా.. నెట్టింట ఓ ఐస్‌క్రీమ్‌కు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. గుజరాత్‌లోని సూరత్‌లో స్ట్రీట్ ఫుడ్ వ్యాపారి అమర్ సిరోహి ఈ వెరైటీ ఐస్‌క్రీమ్‌ను తయారు చేసి కస్టమర్ల నుంచి ప్రశంసలు అందుకుంటున్నాడు.
అయితే.. ఈ వెరైటీ ఐస్‌క్రీమ్‌ను చూసి ఐస్‌క్రీమ్ ప్రియులు ఫిదా అవుతున్నారు. అయితే దీనిని అన్ని ఐస్‌క్రీమ్స్‌లా కాకుండా.. నలగ్గొట్టిన ఐస్‌ను గోళాకారంలో అమర్చి, నచ్చిన ఫ్లేవర్‌లో, రకరకాల రంగుల్లో భిన్నమైన రుచుల్లో అందిస్తున్నాడు. ఇక ఈ ఐస్‌క్రీమ్ సుమారు 5 కేజీల బరువుతో.. సూపర్బ్ టేస్ట్‌తో అందరి దృష్టిని ఆకట్టుకుంటుంది. అయితే.. అమర్ తయారు చేస్తున్న ఐస్ గోలా రుచి చూసేందుకు.. కస్టమర్లు తెగ ఇష్టపడుతున్నారు.
దీనికి సంబంధించిన వీడియోను ఓవ్యక్తి యూట్యూబ్‌లో షేర్ చేశారు. ఈ వీడియోలో.. 5.5 కిలోల బరువున్న ఐస్ గోలా, తయారీ విధానాన్ని చూడవచ్చు. ఐస్‌పై కోవా, నాలుగు స్పూన్ల ఐస్‌క్రీమ్‌ను ఉంచి, ఆపై క్రీమ్‌తో మరొక పొరను వేశాడు ఐస్‌క్రీమ్ మేకర్. ఇక చివరిగా చెర్రీస్, చాక్లెట్ చిప్స్, బాదం పప్పులతో అలంకరించారు.
వీడియో..
నోరూరించేలా ఉన్న ఈ ఐస్ గోళా దేశంలోనే అతిపెద్దదని, 12 మంది తినగలని అమర్ పేర్కొంటున్నాడు. ఈ గోళా ఖరీదు వెయ్యి రూపాలల వరకు ఉంటుందని అమర్ సిరోహి తెలిపాడు. అయితే.. ఈ వీడియోను చూసిన వారంతా చూస్తుంటేనే నోరూరుతుందని కామెంట్లు చేస్తున్నారు.
Also Read: