Ganesh Chaturthi 2024: బొజ్జ గణపయ్యకు ప్రతీకరమైన వాటిల్లో ఇది కూడా ఒకటి.. డోంట్ మిస్!

|

Sep 05, 2024 | 1:58 PM

వినాయక చవితి వచ్చిందంటే భారత దేశంలో ఎక్కడ చూసినా మండపాలే దర్శనమిస్తాయి. నవ రాత్రులు ఎంతో భక్తి శ్రద్దలతో గణపయ్యను కొలుస్తారు. ఆట పాటలతో వినాయకుడిని కొలుస్తారు. అనంతరం వాయిద్యాలతో ఘనంగా గణపయ్యను సాగనంపుతారు. ఈ ఏడాది వినాయక చవితి పండగ సెప్టెంబర్ 7వ తేదీన వచ్చింది. ఈ పండుగ సందర్భంగా వినాయకుడికి ఎంతో ప్రతీ కరమైన నైవేద్యాలను సమర్పిస్తారు. ఇలా గణపయ్యకు ఇష్టమైన నైవేద్యాలలో..

Ganesh Chaturthi 2024: బొజ్జ గణపయ్యకు ప్రతీకరమైన వాటిల్లో ఇది కూడా ఒకటి.. డోంట్ మిస్!
Modak
Follow us on

వినాయక చవితి వచ్చిందంటే భారత దేశంలో ఎక్కడ చూసినా మండపాలే దర్శనమిస్తాయి. నవ రాత్రులు ఎంతో భక్తి శ్రద్దలతో గణపయ్యను కొలుస్తారు. ఆట పాటలతో వినాయకుడిని కొలుస్తారు. అనంతరం వాయిద్యాలతో ఘనంగా గణపయ్యను సాగనంపుతారు. ఈ ఏడాది వినాయక చవితి పండగ సెప్టెంబర్ 7వ తేదీన వచ్చింది. ఈ పండుగ సందర్భంగా వినాయకుడికి ఎంతో ప్రతీ కరమైన నైవేద్యాలను సమర్పిస్తారు. ఇలా గణపయ్యకు ఇష్టమైన నైవేద్యాలలో మోదకాలు కూడా ఒకటి. ఉత్తర భారతీయులు ఎక్కువగా ఈ మోదకాలను తయారు చేస్తారు. ఇవి తియ్యగా ఉంటాయి. చాలా రుచిగా కూడా ఉంటాయి. మరి వినాయకుడికి ప్రీతి కరమైన మోదకాలను ఎలా తయారు చేస్తారు? వీటికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

మోదకాలు తయారీకి కావాల్సిన పదార్థాలు:

బియ్యం పిండి, బెల్లం, కొబ్బరి, యాలకులు, డ్రై ఫ్రూట్స్, డ్రై ప్రూట్స్, ఉప్పు.

మోదకాలు తయారీ విధానం:

ఈ మోదకాలు తయారు చేయడానికి ముందుగా ఒక పాత్ర తీసుకుని అందులో నీళ్లు, కొద్దిగా ఉప్పు, నెయ్యి కొద్దిగా వేసి మరిగించాలి. ఇలా నీళ్లు మరుగుతున్న సమయంలో బియ్యం పిండి వేసి చిన్న మంట మీద పది నిమిషాల పాటు ఉడకనివ్వాలి. బియ్యం పిండి ఉడికాక మూత పెట్టి పక్కన పెట్టాలి. ఇప్పుడు మరో గిన్నె తీసుకుని అందులో కొద్దిగా నెయ్యి వేసి వేడయ్యాక కొబ్బరి తురుము వేసి వేయించాలి. కొబ్బరి తురుము వేగాక బెల్లం వెసి చిన్న మంట మీద కరిగేంత వరకు వేడి చేయాలి. బెల్లం కరిగాక ఇందులో డ్రై ఫ్రూట్స్, యాలకుల పొడి వేసి కలపాలి.

ఇవి కూడా చదవండి

ఇప్పుడు బియ్యం పిండి ఆరిపోయి ఉంటుంది. దీన్ని చిన్న చిన్న ముద్దలుగా చేసుకోవాలి. ఇప్పుడు ఒక్కో ముద్ద తీసుకుని వాటి మధ్యలో కొబ్బరి బెల్లం మిశ్రమం పెట్టి ఆ తర్వాత వీటని మోదకాల షేపులో తయారు చేసుకోవాలి. ఇలా అన్ని మోదకాలు తయారు చేసుకోవాలి. ఇలా తయారు చేసిన మోదకాలను కుక్కర్ ప్లేటులో నెయ్యి రాసి పెట్టి.. ఇవన్నీ అందులో పెట్టి స్టీమ్ చేసుకోవాలి. 10 నిమిషాలు ఉడికిస్తే చాలు.. మోదకాలు సిద్ధం అయినట్లే. ఇవి చాలా రుచిగా ఉంటాయి. ఈసారి వినాయక చవితికి మీరు కూడా తయారు చేసుకోండి.