AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Fish Tikka: టేస్టీ టేస్టీ స్నాక్ ఫిష్ టిక్కా రెసిపీ.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండి ఇలా..

చేపలు తినడానికి ఎంత రుచికరంగా ఉంటాయో.. ఆరోగ్యానికి కూడా అంతే మేలు చేస్తాయి. చేపల పులుసు, చేపల వేపుడు, చేపల పచ్చడి.. మాత్రమే కాదు ఫిష్ బిర్యానీ వంటి అనేక చేపల వంటకాలను తినే ఉంటారు. ఈ రోజు మనం వెరైటీగా ఫిష్ టిక్కా ని గురించి తెలుసుకుందాం.. ఈ స్నాక్ తయారు చేయడం చాలా సులభం. దీనిని త్వరగా తయారు చేసుకోవచ్చు. తినడానికి చాలా రుచికరంగా ఉంటుంది. ఈ రోజు రుచికరమైన ఫిష్ టిక్కా రెసిపీ గురించి తెలుసుకుందాం..

Fish Tikka: టేస్టీ టేస్టీ స్నాక్ ఫిష్ టిక్కా రెసిపీ.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండి ఇలా..
Fish Tikka
Surya Kala
|

Updated on: Jun 16, 2025 | 1:00 PM

Share

నాన్ వెజ్ ప్రియులలో సీ ఫుడ్ ప్రియులు వేరు. వీరికి చేపలు, రొయ్యలు, పీతలు వంటి వాటితో చేసిన ఆహరాన్ని అమితంగా ఇష్టం. అయితే చేపలను తినడానికి అమితంగా ఇష్టపడేవారున్నారు. వీరు చేపలతో రకరకాల పదార్దాలను తయారు చేస్తారు. ఇష్టపడతారు. ఇండియన్ స్టైల్ లో కూర, పులుసు, వేపుడు మాత్రమే కాదు చైనీస్ స్టైల్ లో చేప మంచూరియన్, చేప టిక్కాలను కూడా ఇష్టంగా తింటారు. ఫిష్ టిక్కా అనేది ఒక ప్రసిద్ధ భారతీయ వంటకం. చేప ముక్కలను మసాలా దినుసులతో కలిపి మ్యారినేట్ చేసి.. తరువాత కాల్చి లేదా వేయించి వడ్డిస్తారు. ఇది రుచికరమైన ఫిష్ టిక్కా సులభంగా తయారుచేసే వంటకం. రెసిపీ ఏమిటంటే..

ఫిష్ టిక్కా తయారీకి కావాల్సిన పదార్ధాలు

  1. సాల్మన్ లేదా ఏదైనా ఇతర ముల్లులు లేని చేప – 300 గ్రాముల
  2. వెల్లుల్లి రెబ్బలు- 8
  3. ఇవి కూడా చదవండి
  4. అల్లం- 1 ముక్క
  5. నిమ్మ తొక్క- 1 టేబుల్ స్పూన్ (తురిమినది)
  6. జీలకర్ర పొడి- 1/2 స్పూన్
  7. ఉప్పు- అవసరమైనంత
  8. శనగ పిండి -3 టేబుల్ స్పూన్లు
  9. కొత్తిమీర- 2 గుప్పెళ్ల
  10. నిమ్మరసం- 2 టేబుల్ స్పూన్లు
  11. కారం పొడి- 1 టేబుల్ స్పూన్
  12. గరం మసాలా పొడి- 1/2 టేబుల్ స్పూన్
  13. నూనె- 1 కప్పు
  14. పెరుగు- ఒక కప్ప

తయారీ విధానం: ఒక పాన్ లో నూనె వేడి చేసి శనగపిండి వేసి.. పేస్ట్ లా చేసి వేసి ఒక నిమిషం పాటు వేయించి.. సుగంధ ద్రవ్యాలు వేసి లేత రంగు వచ్చేవరకు వేయించాలి.

తీసుకున్న చేపలను శుభ్రంగా కడిగి.. ఒక గిన్నెలోకి తీసుకోవాలి.

ఇప్పుడు ఒక గిన్నెలో సగం నూనె, వెల్లుల్లి, కొత్తిమీర, అల్లం, కారం, జీలకర్ర పొడి, గరం మసాలా, నిమ్మరసం, నిమ్మ తొక్కు, ఉప్పు వేసి ఈ మిశ్రమాన్ని కలిపి మెత్తని పేస్ట్ గా చేయాలి.

ఈ మిశ్రమాన్ని రెడీ చేసుకున్న శనగ పిండి మసాలా పేస్ట్‌లో వేసి పెరుగుతో కలపండి.

చేపల మ్యారినేట్ కోసం తీసుకున్న అన్ని పదార్థాలను బాగా కలపండి.

చేపల ముక్కలపై సిద్ధం చేసుకున్న శనగపిండి మసాలా మిశ్రమాన్ని చేపలకు పట్టించండి.

ఇలా మ్యారినేట్ చేసిన చేప ముక్కలను గంటసేపు ఒక పక్కన పెట్టండి. ఓవెన్‌ను 200 డిగ్రీల సెల్సియస్‌కు వేడి చేసి మ్యారినేట్ చేసిన చేపలను బేకింగ్ డిష్‌లో వేయండి.

తందూరి చేపలను పై రాక్‌లో 10-15 నిమిషాలు కాల్చండి. చేపల ముక్కలను ఒకసారి తిప్పండి. ఇలా చేప ముక్కలను గ్రిల్ చేసే సమయంలో చేప ముక్కలను వెన్నతో ఒకటి లేదా రెండుసార్లు కాల్చండి.

గ్రిల్ చేయడంతో ఫిష్ టిక్కా రెడీ. ఇప్పుడు వీటిని చట్నీ లేదా సాస్‌తో వేడిగా వడ్డించండి. పిల్లలు పెద్దలు లోట్టలేసుకుంటూ తింటారు.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

ప్రభాస్ లేకపోతే చనిపోయేవాడిని.. చత్రపతి శేఖర్ ఎమోషనల్..
ప్రభాస్ లేకపోతే చనిపోయేవాడిని.. చత్రపతి శేఖర్ ఎమోషనల్..
ధర ఎక్కువైనా ఈ పండును కచ్చితంగా తినండి.. ఎందుకో తెలిస్తే..
ధర ఎక్కువైనా ఈ పండును కచ్చితంగా తినండి.. ఎందుకో తెలిస్తే..
సిమ్ కార్డులతో భారీ సైబర్ క్రైమ్.. చెక్‌ పెట్టిన ఏపీ సీఐడి!
సిమ్ కార్డులతో భారీ సైబర్ క్రైమ్.. చెక్‌ పెట్టిన ఏపీ సీఐడి!
విజయ్ హజారే ట్రోఫీకి విరాట్, రోహిత్ శాలరీ ఎంత?
విజయ్ హజారే ట్రోఫీకి విరాట్, రోహిత్ శాలరీ ఎంత?
ఇదో పవర్‌ ఫుల్‌ డిటాక్స్‌ డ్రింక్..!షాకింగ్‌ బెనిఫిట్స్‌ తెలిస్తే
ఇదో పవర్‌ ఫుల్‌ డిటాక్స్‌ డ్రింక్..!షాకింగ్‌ బెనిఫిట్స్‌ తెలిస్తే
థియేటర్లలో సంచలనం.. ఇప్పుడు ఓటీటీలోకి చిన్న సినిమా..
థియేటర్లలో సంచలనం.. ఇప్పుడు ఓటీటీలోకి చిన్న సినిమా..
ఛీ.. ఛీ.. చేతులెలా వచ్చాయ్‌ రా.. మనవరాలి వయసని కూడా చూడకుండా..
ఛీ.. ఛీ.. చేతులెలా వచ్చాయ్‌ రా.. మనవరాలి వయసని కూడా చూడకుండా..
దీప్తి శర్మ రికార్డుల వేట..రేణుకా సింగ్ వికెట్ల కోత
దీప్తి శర్మ రికార్డుల వేట..రేణుకా సింగ్ వికెట్ల కోత
దేశంలో అత్యంత సంపన్నుడైన చెఫ్‌ ఇతనే నట..ఆయన ఆస్తుల విలువ తెలిస్తే
దేశంలో అత్యంత సంపన్నుడైన చెఫ్‌ ఇతనే నట..ఆయన ఆస్తుల విలువ తెలిస్తే
వందేభారత్ ప్రయాణీకులకు తీపికబురు.. ఇకపై ఆ స్టేషన్‌లోనూ..
వందేభారత్ ప్రయాణీకులకు తీపికబురు.. ఇకపై ఆ స్టేషన్‌లోనూ..