Fish Benefits: చేపలు తింటే కంటి చూపు మెరుగు..! అంతేకాదు ఇంకా ఎన్నో ఆరోగ్య సమస్యలకు చెక్..
Health Benefits of Fish: మానవులకు లభించే ముఖ్యమైన మాంసహార పదార్థాల్లో చేపలు ఒకటి. చేపల్లో కొవ్వు పదార్థాలు తక్కువ.. నాణ్యమైన పోషకాలు ఎక్కువగా

Health Benefits of Fish: మానవులకు లభించే ముఖ్యమైన మాంసహార పదార్థాల్లో చేపలు ఒకటి. చేపల్లో కొవ్వు పదార్థాలు తక్కువ.. నాణ్యమైన పోషకాలు ఎక్కువగా ఉంటాయి. అందుకే వారంలో కనీసం రెండు సార్లయినా చేపలు తింటే.. మనం ఎన్నో ఆరోగ్య సమస్యల నుంచి బయటపడవచ్చంటున్నారు వైద్యనిపుణులు. చేపలను తినడం వల్ల బీపీ, కొలెస్ట్రాల్, డయాబెటిస్ లాంటివి కంట్రోల్‌లో ఉంటాయి. దీంతోపాటు గుండె జబ్బులు, హార్ట్ ఎటాక్, మెదడు సంబంధింత సమస్యల నుంచి కూడా గట్టెక్కవచ్చని పేర్కొంటున్నారు. ఎందుకంటే.. చేపల్లో కొవ్వు తక్కువ, నాణ్యమైన ప్రోటీన్స్ ఎక్కువగా లభిస్తాయి. చేపలను రెగ్యూలర్‌గా తినడం వల్ల పలు అనారోగ్య సమస్యల నుంచి గట్టెక్కవచ్చని.. నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు చూద్దాం..
చేపలు తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు.. ➼ చేపల్లో ముఖ్యమైన పోషకాలు, విటమిన్లు అధికంగా ఉంటాయి. ➼ చేపల్లో 9 రకాల అమైనో యాసిడ్స్ ఉంటాయి. ఇవి మనం ఆరోగ్యవంతంలా ఉండేలా చేస్తాయి. ➼ ఎముకల్ని గట్టిగా చేసే విటమిన్-డీ, కాల్షియం చేపల్లో పుష్కలంగా ఉంటుంది. ➼ గుండెపోటు ప్రమాదాన్ని తగ్గించడంలో చేపలు కీలక పాత్ర పోషిస్తాయి. ➼ మెదడు చురుకుగా.. ఆరోగ్యవంతంగా ఉండేలా చేపలు సాయపడతాయి. ➼ డిప్రెషన్, ఒత్తిడిని నివారించి ఆరోగ్యవంతంగా ఉండేలా చేస్తాయి. ➼ పలు రకాల కాన్సర్లకు చేపలు చెక్ పెడతాయని నిపుణుల అధ్యనంలో తేలింది. ➼ పిల్లల్లో అస్తమాను నివారించేందుకు చేపలు ఔషధంగా పనిచేస్తాయి. ➼ చేపలు దృష్టిని మెరుగుపర్చడంతోపాటు.. నిద్ర సమస్యలను దూరం చేస్తాయి. ➼ టైప్-1 డయాబెటిస్‌తో బాధపడుతున్నవారు చేపలు తింటే మంచిది. ➼ చేపల్లోని ఐరన్.. రక్తంలో హిమోగ్లోబిన్ సరిపడా ఉండేలా చేస్తుంది. ➼ పేగుల్లో గ్యాస్ ఇతరత్రా సమస్యలు కూడా తగ్గుముఖం పడుతాయి. ➼ శరీర ఉష్ణోగ్రతను చేపలు క్రమబద్ధీకరించి.. శక్తిని అందిస్తాయి. ➼ చేపల్లో ఉండే జింక్.. వ్యాధి నిరోధక శక్తిని సైతం పెంచుతుంది. ➼ అందుకే ఆహారంలో చేపలను చేర్చాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.
Also Read:




