Dry Fruits For Uric Acid: ఇటీవల కాలంలో చాలామంది శరీరంలో యూరిక్ యాసిడ్ సమస్యతో బాధపడుతున్నారు. యూరిక్ యాసిడ్ అనేది ఒక వ్యర్థ పదార్థం. ఇది శరీరంలో మూత్రపిండాల పనితీరును ప్రభావితం చేస్తుంది. యూరిక్ యాసిడ్ పెరగడం వల్ల కిడ్నీల్లో రాళ్లతో (Uric Acid issue) పాటు హైబీపీ (High BP) సమస్యలు, కీళ్ల నొప్పులు, నడవడంలో ఇబ్బంది, వాపు వంటి అనారోగ్య సమస్యలు వస్తాయి. యూరిక్ యాసిడ్ పెరగడం వల్ల మూత్ర విసర్జనలో సైతం ఇబ్బంది ఏర్పడుతుంది. అయితే.. ఈ సమస్యను దూరం చేయడంలో కొన్ని డ్రై ఫ్రూట్స్ చాలా ఉపయోగకరంగా ఉంటాయి. అన్ని డ్రై ఫ్రూట్స్ ఆరోగ్యానికి ముఖ్యమైనవే అయినప్పటికీ యూరిక్ యాసిడ్ సమస్యతో బాధపడుతున్న వారికి కొన్ని డ్రై ఫ్రూట్స్ తినడం చాలా మంచిది. అయితే.. ఏయే డ్రై ఫ్రూట్స్ తీసుకుంటే.. యూరిక్ యాసిడ్ సమస్య నుంచి ఉపశమనం కలుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం..
బాదం నొప్పిని కూడా తగ్గిస్తుంది:
యూరిక్ యాసిడ్ పేషెంట్లు బాదంపప్పును తినాలి. ఇది మీకు ఉపశమనం కలిగిస్తుంది. వాస్తవానికి దీనిలో కాల్షియం, ఫైబర్, మెగ్నీషియం, కాపర్, విటమిన్ కె, ప్రొటీన్, జింక్ దీనిలో పుష్కలంగా ఉంటాయి. ఇలాంటి పరిస్థితిలో ప్రతిరోజూ బాదం తినడం మరింత ప్రయోజనకరంగా ఉంటుంది. దీన్ని తినడం వల్ల కీళ్ల నొప్పులు, వాపుల సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది.
జీడిపప్పు:
జీడిపప్పులో పొటాషియం, విటమిన్ సి, ఫైబర్ వంటి అనేక పోషకాలు ఉన్నాయి. ఇవి యూరిక్ యాసిడ్‌ను నియంత్రించడంలో సహాయపడతాయి. నొప్పి ఎక్కువగా ఉన్న వారు దీన్ని ఆహారంలో చేర్చుకోవచ్చు.
వాల్‌నట్‌లతో ప్రయోజనం:
సాధారణంగా వాల్‌నట్‌లను సూపర్‌ఫుడ్‌గా పరిగణిస్తారు. వాస్తవానికి దీనిలో యాంటీ-ఆక్సిడెంట్లు, పాలీ అన్‌శాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్‌లు ఇందులో ఉన్నాయి. ఇవి మీ శరీరం నుంచి యూరిక్ యాసిడ్‌ను బయటకు పంపడంలో సహాయపడుతాయి.
మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..