AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tea Side Effects: వీటిని తీసుకున్న తర్వాత టీ అస్సలు తాగకండి.. అలా చేస్తే ప్రమాదమేనంట..

అల్లం టీ, సొంటి టీ, హెర్బల్ టి ఇలా ఎన్నో రకాల టీలు చాలామందికి రిలీఫ్ ఇస్తున్నాయి. అయితే.. రిలాక్స్ కోసం టీ తాగడం మంచిదే.. కానీ.. ఎక్కువగా తాగితే అనారోగ్య సమస్యలు వస్తాయి.

Tea Side Effects: వీటిని తీసుకున్న తర్వాత టీ అస్సలు తాగకండి.. అలా చేస్తే ప్రమాదమేనంట..
Tea
Shaik Madar Saheb
|

Updated on: May 24, 2022 | 9:58 AM

Share

Tea side effects: జీవితానికి సంబంధించి ఎంత పెద్ద నిర్ణయమైనా అందరూ ఒక కప్పు టీతో చర్చించుకుంటారు. టీ తాగే అలవాటు భారతీయులలో చాలా పురాతన కాలం నుంచి ఉంది. కొందరు దీనికి బానిసలు కాగా.. మరికొందరు ఒత్తిడి నుంచి కాస్త రిలాక్స్ కోసం టీ తాగుతుంటారు. ఉదయాన్నే నిద్ర నుంచి లేచిన తర్వాత.. అలాగే సాయంత్రం టీ తాగనిదే కొంతమంది ఏం తోచదు. అందుకే చాయ్‌ని ఇష్టంతో కప్పులకు కప్పులు లాగేస్తుంటారు. అయితే.. టీ లల్లో కూడా చాలా రకాలున్నాయి. అల్లం టీ, సొంటి టీ, హెర్బల్ టి ఇలా ఎన్నో రకాల టీలు చాలామందికి రిలీఫ్ ఇస్తున్నాయి. అయితే.. రిలాక్స్ కోసం టీ తాగడం మంచిదే.. కానీ.. ఎక్కువగా తాగితే అనారోగ్య సమస్యలు వస్తాయి. దీంతోపాటు కొన్ని ఆహార పదర్ధాలను తీసుకున్న తర్వాత టీ అస్సలు తగకూడదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అందుకే టీ తాగిన తర్వాత ఎలాంటి పదార్థాలు తీసుకోకూడదో ఇప్పుడు తెలుసుకోండి..

ఇలాంటివి తీసుకున్న తర్వాత టీ తాగకండి..

ఇవి కూడా చదవండి
  • మీరు చల్లటి పదార్థాలు తిన్నప్పుడు.. లేదా చల్లటి నీరు తాగిన తర్వాత వెంటనే టీ తాగకూడదు. ఇలా చేస్తే ఇది జీర్ణవ్యవస్థపై ప్రతికూల ప్రభావం చూపుతుంది.
  • నిమ్మరసం తీసుకున్న తర్వాత టీ తాగకూడదు. దీని కారణంగా అపానవాయువు లేదా అసిడిటీ సమస్య కలుగుతుంది.
  • అట్లు, దోశలు, శెనగపిండితో చేసిన ఆహార పదార్థాలను తిన్న తర్వాత టీ తాగకూడదు.. ఇలా చేస్తే జీర్ణవ్యవస్థకు సంబంధించిన సమస్యలు వస్తాయి.
  • భోజనం చేసిన వెంటనే టీ తీసుకోవడం మానేయాలి. ఇలా చేయడం వల్ల రక్తపోటుకు సంబంధించిన సమస్యలను కలిగిస్తుంది. దీంతో గుండెకు ప్రమాదకరంగా మారుతుంది.
  • షుగర్ ఉన్నవారు పూర్తిగా టీని మానేయడం మంచిది. తాగాలనిపిస్తే.. షుగర్ ఫ్రీ లేదా.. చక్కెర లేకుండా తాగవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
యూట్యూబ్‏ను షేక్ చేస్తోన్న 'దివానా' మూవీ సాంగ్..
యూట్యూబ్‏ను షేక్ చేస్తోన్న 'దివానా' మూవీ సాంగ్..
శ్రీరామనవమి శుభాకాంక్షలు మీ స్నేహితులకు ఇలా పంపండి
శ్రీరామనవమి శుభాకాంక్షలు మీ స్నేహితులకు ఇలా పంపండి
ఇంట్లోని సిలిండర్‌లో గ్యాస్ ఎంత ఉందో సులభంగా తెలుసుకోవడం ఎలా.?
ఇంట్లోని సిలిండర్‌లో గ్యాస్ ఎంత ఉందో సులభంగా తెలుసుకోవడం ఎలా.?
హైదరాబాదీలకు బిగ్‌ అలర్ట్.. ఈ రూట్స్‌లో ట్రాఫిక్ మళ్లింపు
హైదరాబాదీలకు బిగ్‌ అలర్ట్.. ఈ రూట్స్‌లో ట్రాఫిక్ మళ్లింపు
అలర్ట్: పూజ గదిలో ఈ వస్తువు ఉంటే దురదృష్టం తప్పదు! వెంటనే..
అలర్ట్: పూజ గదిలో ఈ వస్తువు ఉంటే దురదృష్టం తప్పదు! వెంటనే..
ఏపీలో కొత్త పథకం.. ప్రతీ ఏడాది అకౌంట్లోకి రూ.2,400
ఏపీలో కొత్త పథకం.. ప్రతీ ఏడాది అకౌంట్లోకి రూ.2,400
మంగళగిరి నుంచి విజయవాడ వెళ్లే ప్రయాణికులకు బిగ్ అలర్ట్
మంగళగిరి నుంచి విజయవాడ వెళ్లే ప్రయాణికులకు బిగ్ అలర్ట్
సింగిల్-హెడ్ ఎంబ్రాయిడరీ మెషీన్‌ ‘టర్బో 1.5’ను పరిచయం చేసిన HSW..
సింగిల్-హెడ్ ఎంబ్రాయిడరీ మెషీన్‌ ‘టర్బో 1.5’ను పరిచయం చేసిన HSW..
ఈ ఫొటోలోని అమ్మాయిని గుర్తు పట్టారా? ఇప్పుడు తెలుగులో ఫేమస్ నటి..
ఈ ఫొటోలోని అమ్మాయిని గుర్తు పట్టారా? ఇప్పుడు తెలుగులో ఫేమస్ నటి..
డిమార్ట్ vsరిలయన్స్ మధ్యతరగతి వారి బడ్జెట్ షాపింగ్‌కు ఏది బెస్ట్?
డిమార్ట్ vsరిలయన్స్ మధ్యతరగతి వారి బడ్జెట్ షాపింగ్‌కు ఏది బెస్ట్?