Cool Drinks in Periods: పీరియడ్స్‌లో క్రేవింగ్స్ అని అదేపనిగా కూల్ డ్రింక్స్ తాగుతున్నారా..

|

Oct 26, 2024 | 3:57 PM

ప్రెగ్నెన్సీ సమయంలోనే కాదు.. పీరియడ్స్ సమయంలో కూడా కొంత మంది లేడీస్ క్రేవింగ్స్ వస్తూ ఉంటాయి. స్పైసీ ఫుడ్స్ తినాలని.. స్వీట్స్ తినాలని.. కాఫీ, టీలు తాగాలని.. ఫాస్ట్ ఫుడ్ తినాలని.. కూల్ డ్రింక్స్ తాగాలని ఇలా చాలా రకాలుగా అనిపిస్తుంది. తినాలనిపిస్తే ఆగుతారా.. వెంటనే తెచ్చుకుని తింటూ ఉంటారు. పీరియడ్స్ సమయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎంత క్రేవింగ్స్ ఉన్నా.. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకునేందుకే ట్రై చేయాలి. ఎందుకంటే ఆరోగ్యం చాలా ముఖ్యం. అనవసరమైన ఆహారాలు తింటే..

Cool Drinks in Periods: పీరియడ్స్‌లో క్రేవింగ్స్ అని అదేపనిగా కూల్ డ్రింక్స్ తాగుతున్నారా..
Periods
Follow us on

ప్రెగ్నెన్సీ సమయంలోనే కాదు.. పీరియడ్స్ సమయంలో కూడా కొంత మంది లేడీస్ క్రేవింగ్స్ వస్తూ ఉంటాయి. స్పైసీ ఫుడ్స్ తినాలని.. స్వీట్స్ తినాలని.. కాఫీ, టీలు తాగాలని.. ఫాస్ట్ ఫుడ్ తినాలని.. కూల్ డ్రింక్స్ తాగాలని ఇలా చాలా రకాలుగా అనిపిస్తుంది. తినాలనిపిస్తే ఆగుతారా.. వెంటనే తెచ్చుకుని తింటూ ఉంటారు. పీరియడ్స్ సమయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎంత క్రేవింగ్స్ ఉన్నా.. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకునేందుకే ట్రై చేయాలి. ఎందుకంటే ఆరోగ్యం చాలా ముఖ్యం. అనవసరమైన ఆహారాలు తింటే తిప్పలు తప్పవు. అలా నెలసరి సమయంలో క్రేవింగ్స్ ఉన్నాయని కూల్ డ్రింక్స్ అదే పనిగా తాగితే.. ప్రాణాల మీదకు వస్తుందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. పీరియడ్స్‌ టైమ్‌లో కూల్ డ్రింక్స్ తాగితే ఎలాంటి నష్టాలు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.

డీహైడ్రేట్‌కు గురి కావడం:

రుతు స్రావంలో ఉన్నప్పుడు కూల్ డ్రింక్స్ అధికంగా తాగితే.. శరీరం డీ హైడ్రేషన్‌కు గురి అవుతుందట. దీని వలన రక్త పోటు బాగా తగ్గిపోయి ప్రాణాల మీదకు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయని పలు అధ్యయానలు చెబుతున్నాయి.

నొప్పులు పెరుగుతాయి:

ఈ సమయంలో కూల్ డ్రింక్స్ తాగాలి అనిపిస్తే చిన్న టీ గ్లాస్ పరిమాణంలో తీసుకోవడం మంచిది. అంతకంటే ఎక్కువగా తాగితే మాత్రం.. మీ పీరియడ్స్‌లో వచ్చే నొప్పుల కంటే మరింతగా నొప్పులు వస్తాయి. కూల్ డ్రింక్స్‌లో ఉండే కెఫీన్, షుగర్ లెవల్స్.. రక్త నాళాలను సంకోచింపజేసి.. గర్భాశయానికి రక్త ప్రవాహాన్ని తగ్గిస్తాయి. దీంతో నొప్పులు అనేవి మరింతగా వస్తాయి.

ఇవి కూడా చదవండి

శరీరంలో వాపులు:

డేట్ టైమ్‌లో కూల్ డ్రింక్స్ ఎక్కువగా తాగితే శరీరంలో వాపులు కూడా రావచ్చు. కూల్ డ్రింక్స్‌లో ఉండే షుగర్ లెవల్స్.. శరీరంలో వాపులను పెంచుతుంది. ఇది పీరియడ్స్ సమయంలో అసౌకర్యాన్ని కలిగిస్తుంది. ఎక్కువగా తాగితే పీరియడ్స్ కూడా ఆలస్యంగా లేదా ముందు వచ్చే అవకాశాలు ఉన్నాయి.

వెయిట్ లాస్:

పీరియడ్స్‌లో ఎక్కువగా కూల్ డ్రింక్స్ తీసుకుంటే.. బరువు పెరుగుతారు. ఎందుకంటే కూల్ డ్రింక్స్‌లో చక్కెర శాతం అనేది అధికంగా ఉంటుంది. ఇది శరీరంలో కొవ్వుగా మారి బరువును పెంచుతుంది. అంతే కాకుండా గుండె జబ్బులు, డయాబెటీస్, కిడ్నీ సమస్యలు, ఎముకలు బలహీన పడటం వంటి సమస్యలు కూడా రావచ్చు.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే.)

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..