AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఈ పుట్టగొడుగును ఒక్క ముక్క తిన్నా చావు ఖాయం.. గంటల్లోనే మీ లివర్, కిడ్నీ పని అయిపోయినట్లే..

చూడటానికి మార్కెట్లో దొరికే సాధారణ పుట్టగొడుగుల్లాగే అమాయకంగా కనిపిస్తాయి.. కానీ ఒక్క అర ముక్క తిన్నా ప్రాణాలు గాల్లో కలవడం ఖాయం. ప్రపంచవ్యాప్తంగా పుట్టగొడుగుల విషప్రభావంతో జరిగే మరణాలలో ఏకంగా 90 శాతానికి కారణమవుతున్న అత్యంత ప్రాణాంతక పుట్టగొడుగు డెత్ క్యాప్. ఎంత ఉడికించినా, వేయించినా దీనిలోని విషం ఎందుకు నశించదు? శరీరంలోకి చేరాక కాలేయం, కిడ్నీలపై ఇది సాగించే నిశబ్ద మారణహోమం గురించి తెలుసుకుందాం..

ఈ పుట్టగొడుగును ఒక్క ముక్క తిన్నా చావు ఖాయం.. గంటల్లోనే మీ లివర్, కిడ్నీ పని అయిపోయినట్లే..
Death Cap Mushroom
Krishna S
|

Updated on: Oct 09, 2026 | 7:28 PM

Share

చూడటానికి అచ్చం మనం మార్కెట్లో కొనే పుట్టగొడుగుల మాదిరిగానే కనిపిస్తాయి. కానీ, పొరపాటున ఒక్క అర ముక్క తిన్నా ప్రాణాలు గాల్లో కలవడం ఖాయం. అందుకే దీనికి డెత్ క్యాప్ అనే భయంకరమైన పేరు వచ్చింది. శాస్త్రీయంగా దీన్ని అమానిటా ఫాలోయిడ్స్ అని పిలుస్తారు. ప్రపంచవ్యాప్తంగా విషపూరిత పుట్టగొడుగులు తిని చనిపోయే వారిలో దాదాపు 90 శాతం మంది మరణాలకు కారణం ఈ ఒక్క పుట్టగొడుగే కావడం దీని తీవ్రతకు నిదర్శనం. లేత పసుపు, ఆలివ్ గ్రీన్ లేదా తెలుపు రంగులో ఉండే ఈ పుట్టగొడుగులు అడవుల్లో, ముఖ్యంగా ఓక్, పైన్ వంటి పెద్ద చెట్ల మొదళ్ల వద్ద ఎక్కువగా పెరుగుతాయి.

సాధారణంగా ఆహారంలో ఉండే సూక్ష్మక్రిములు లేదా కొన్ని విషపదార్థాలు ఉడికించినప్పుడు నశిస్తాయి. కానీ డెత్ క్యాప్ మష్రూమ్ విషయంలో అది అస్సలు జరగదు. దీనిని ఎంత అధిక ఉష్ణోగ్రత వద్ద వండినా, నూనెలో వేయించినా, ఉడకబెట్టినా లేదా ఎండబెట్టినా సరే.. ఇందులో ఉండే ప్రాణాంతక విషం వీసమెత్తు కూడా తగ్గదు. ఇందులో అమాటాక్సిన్స్, ఫాలోటాక్సిన్స్ అనే అత్యంత ప్రమాదకరమైన టాక్సిన్లు ఉంటాయి. ఇవి మానవ శరీరంలోని కణాల్లో ఉండే ఆర్‌ఎన్‌ఏ పనితీరును అడ్డుకుని, కణ విభజనను పూర్తిగా ఆపేస్తాయి.

శరీరంలో నిశ్శబ్ద దాడి.. మూడు దశల్లో ప్రాణాంతకం

డెత్ క్యాప్ పుట్టగొడుగు శరీరంలోకి వెళ్లిన తర్వాత జరిగే పరిణామాలు వైద్యులను సైతం విస్మయానికి గురిచేస్తాయి.

తొలి దశ (6 నుండి 12 గంటల తర్వాత): తిన్న వెంటనే ఎలాంటి లక్షణాలు కనిపించవు. 6 నుంచి 12 గంటల తర్వాత తీవ్రమైన కడుపునొప్పి, ఆగని వాంతులు, నీళ్ల విరేచనాలు మొదలవుతాయి. శరీరంలో నీటిశాతం వేగంగా తగ్గిపోయితీవ్రమైన నీరసం వస్తుంది.

రెండో దశ : 24 నుంచి 48 గంటల తర్వాత వాంతులు, విరేచనాలు ఆగిపోతాయి. రోగి అంతా సర్దుకుందని, తాను కోలుకున్నానని భ్రమపడతాడు. కానీ, లోపల ఆ విషం నిశ్శబ్దంగా కాలేయం, మూత్రపిండాల కణాలను నాశనం చేస్తూనే ఉంటుంది.

తుది దశ: 3 నుండి 6 రోజుల నాటికి పరిస్థితి పూర్తిగా విషమిస్తుంది. కాలేయం, మూత్రపిండాలు పూర్తిగా పనిచేయడం మానేస్తాయి. చర్మం, కళ్లు పచ్చబడతాయి, శరీరంలో అంతర్గత రక్తస్రావం మొదలవుతుంది. క్రమంగా రోగి కోమాలోకి వెళ్లి మరణిస్తాడు. ఈ దశలో తక్షణ కాలేయ మార్పిడి జరిగితే తప్ప ప్రాణాలు దక్కడం అసాధ్యం.

నిపుణులు ఏమంటున్నారు? అడవి పుట్టగొడుగులతో జాగ్రత్త

ప్రకృతిలో లేదా పొలాల్లో, అడవుల్లో దొరికే పుట్టగొడుగులను నాటు పుట్టగొడుగులు లేదా ఔషధ గుణాలున్నవి అనుకుని కోసుకుని వండుకుతినే అలవాటు చాలా గ్రామీణ ప్రాంతాల్లో ఉంటుంది. అయితే తినే పుట్టగొడుగులకు, విషపూరితమైన డెత్ క్యాప్ వంటి వాటికి మధ్య బాహ్య తేడాలను గుర్తించడం నిపుణులకు సైతం కొన్నిసార్లు కష్టమవుతుంది.

Follow Us