Bigg Boss Telugu 10: బిగ్ బాస్ 10 వైల్డ్ కార్డు ఎంట్రీలో ఊహించని కంటెస్టెంట్.. ఇక టీఆర్పీ రికార్డులు బద్దలు
బిగ్ బాస్ 10 తెలుగు సీజన్ లో భాగంగా ఈ వీకెండ్ లోనే వైల్డ్ కార్డు కంటెస్టెంట్స్ రానున్నారు. మొత్తం ఆరుగురు కంటెండర్స్ హౌస్ లోకి అడుగు పెట్టనున్నారని సమాచారం. అయితే ఈ వైల్డ్ కార్డు ఎంట్రీల్లో ఓ ఊహించని ట్విస్ట్ చోటు చేసుకుందని సమాచారం.

బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 రసవత్తరంగా, ఆసక్తికరంగా సాగుతోంది. సెప్టెంబర్ 07న ప్రారంభమైన ఈ రియాలిటీ షో ఇప్పటికే సక్సెస్ ఫుల్ గా నాలుగు వారాలు పూర్తి చేసుకుంది. ఐదో వారం కూడా దాదాపు ఎండింగ్ కు వచ్చేసింది. ఫస్ట్ వీక్ లో నటి ఛైత్ర ఎలిమినేట్ కాగా రెండో వారంలో కృష్ణుడు బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వెళ్లిపోయాడు. ఇక మూడో వారం ఎలాంటి ఎలిమినేషన్ జరగకపోగా, నాలుగో వారం అనూహ్యంగా సృష్టి వ్యాకరణం బిగ్ బాస్ నుంచి ఎలిమినేట్ అయ్యింది. ఇక ఐదో వారంలో డబుల్ ఎలిమినేషన్ ఉండనుందని తెలుస్తోంది. ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్ లో 14 మంది ఉన్నారు. వీరిలో అమన్, అపూర్వ, రోహిత్, ఝాన్సీ, చరణ్, షాలిని, నరేశ్, రాంప్రసాద్, త్రిగుణ్, ముకేష్ ఈ వారం నామినేషన్స్‌లో ఉన్నారు. వీరిలో ఇద్దరు ఈ వీకెండ్ లో బయటకు వెళ్లనున్నారని టాక్. ఇదిలా ఉంటే బిగ్ బాస్ తెలుగు రియాలిటీ షోకు సంబంధించి ఐదో వారం వచ్చిందంటే కచ్చితంగా వైల్డ్ కార్డ్ ఎంట్రీలు ఉంటాయి. పదో సీజన్ లోనూ ఐదారుగురు కంటెస్టెంట్స్ వైల్డ్ కార్డ్ ఎంట్రీలుగా బిగ్ బాస్ హౌస్ లోకి రానున్నారని సమాచారం. ఇందుకు సంబంధించి చాలా పేర్లే వినిపిస్తున్నాయి. అయితే ఈ లిస్టులో ఒక అమ్మడి పేరు ప్రముఖంగా వినిపిస్తోంది.
ప్రముఖ సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్, డ్యాన్సర్ శ్వేతా నాయుడు వైల్డ్ కార్డ్ ఎంట్రీ దాదాపు ఫిక్స్ అయ్యిందని సోషల్ మీడియాలో టాక్ వినిపిస్తోంది. ప్రముఖ డాన్స్ రియాలిటీ షో ‘ఢీ’ (Dhee) లో కంటెస్టెంట్‌గా, టీమ్ లీడర్‌గా వ్యవహరించి బుల్లితెర ప్రేక్షకులకు చాలా దగ్గరైంది శ్వేతా నాయుడు. అలాగే ఢీ17 సీజన్ లో రన్నరప్ గానూ నిలిచింది. కేవలం డ్యాన్సర్ గానే కాదు కామెడీ పంచులు వేయడంలోనూ శ్వేతా నాయుడుకు మంచి గుర్తింపే ఉంది. ఢీ షోలో భాగంగా హైపర్ ఆది వంటి స్టార్ కమెడియన్లతో సై అంటే సై అందీ అందాల తార. ఇక సోసల్ మీడియాలోనూ ఈ ముద్దుగుమ్మకు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ముఖ్యంగా యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్‌లలో డ్యాన్స్ రీల్స్, ఇంటర్నేషనల్ ట్రావెల్ వ్లాగ్స్ ద్వారా మిలియన్ల కొద్దీ వ్యూస్ సాధిస్తూ టాప్ ఇన్‌ఫ్లుయెన్సర్‌గా ఎదిగింది శ్వేత. ఇక బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్ మెహబూబ్ దిల్‌సే, శ్వేతల మధ్య మంచి ఫ్రెండ్ షిప్ ఉంది. వీరిద్దరూ కలిసి చేసిన కవర్ సాంగ్స్, డ్యాన్స్ వీడియోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి. గతంలోనే శ్వేతా నాయుడు బిగ్ బాస్ హౌస్‌లోకి వెళ్తుందనే ప్రచారం జరిగింది. అయితే అదేమీ జరగలేదు. ఎట్టకేలకు ఇప్పుడీ ముద్దుగుమ్మ బిగ్ బాస్ సీజన్ 10లో వైల్డ్ కార్డ్ ద్వారా ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అయ్యిందని టాక్. శ్వేతా నాయుడుతో పాటు నీతు నటరాజ్, శివ్ కుమార్, నవరసాలు ఆర్కే, కావ్య శ్రీ కూడా వైల్డ్ కార్డు ఎంట్రీ ఇవ్వబోతున్నారని సమాచారం.
బర్త్ డే వేడుకల్లో శ్వేతా నాయుడు..
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




