నీళ్లు ఎక్కువగా తాగితే బరువు తగ్గుతారా ? అధ్యయనాల్లో బయటపడ్డ ఆసక్తికర విషయాలు..
ప్రస్తుతం కాలంలో ప్రతి ఒక్కరిని ఇబ్బందిపెడుతున్న సమస్య అధిక బరువు. దీనికి కారణం పోషకాహార లోపం, తీవ్రమైన ఒత్తిడి, నిద్రలేమి
ప్రస్తుతం కాలంలో ప్రతి ఒక్కరిని ఇబ్బందిపెడుతున్న సమస్య అధిక బరువు. దీనికి కారణం పోషకాహార లోపం, తీవ్రమైన ఒత్తిడి, నిద్రలేమి సమస్యలు కారణమవుతాయి. ఇక తమ బరువును తగ్గించుకోవడానికి అనేక రకాలుగా ప్రయత్నిస్తుంటారు. అయితే దీనికి ఎక్కువగా ఖర్చు పెట్టాల్సిన పనిలేకుండా కేవలం నీళ్ళు తాగితే శరీరంలోని కొవ్వు, కేలరీలను కరిగించవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. అంతేకాదు… రోజూ ఎక్కువగా వాటర్ తాగితే బరువు తగ్గుతారని ఇటీవలే చాలా అధ్యయనాలు చెబుతున్నాయి.
ఎక్కువగా లిక్విడ్ ఫుడ్ తీసుకోవడం వలన ఆరోగ్యంగా ఉండడమే కాకుండా.. బరువును కూడా నియంత్రణలో ఉంచుతుంది. ఇందుకోసం కొంతమంది శాస్త్రవేత్తలు కొందరికి ఒక సంవత్సరం పాటు కేవలం లిక్విడ్ ఫుడ్ అందించారు. వారిలో బరువు తగ్గడమే కాకుండా.. ఇన్సులిన్ సెన్సిటివిటీ మెరుగుపడుతుందని తెలిపారు. వీరి శరీరాల్లో కొలెస్ట్రాల్ స్థాయిలు నియంత్రణలో ఉన్నట్లు తెలిపారు. 2011లో ఒబెసిటీ అనే జర్నల్ వెలువరించిన స్టడీ ప్రకారం 12 నెలల పాటు డైట్ లో కేవలం డ్రింక్స్, పానీయాలను సాధారణ నీళ్ళు తాగిన వారిలో బరువు తగ్గడమే కాకుండా.. వారిలో కొలెస్ట్రాల్ స్థాయిలు కూడా తగ్గినట్లుగా తెలిపారు. అయితే రోజూ నీళ్లు తాగేందుకు కొంత సమయాన్ని ముందే నిర్ణయించుకోవాలి. అవెంటంటే..
☞ భోజనానికి ముందు 10-15 నిమిషాల కంటే ముందు కడుపు నిండా నీళ్ళు తాగడం వలన ఆకలి ఉన్నా గానీ తక్కువగా తింటారు. నీళ్ళు ఎక్కువగా తాగడం వలన రోజు కంటే కాస్త తక్కువగా తింటారట. దీంతో బరువు తగ్గడం క్రమంగా ప్రారంభవుతుంది. ☞ నీళ్లు ఎక్కువగా తాగడం వల్ల కండరాలు బాగా పనిచేస్తాయి. అందువల్ల నీళ్లు ఎక్కువగా తాగుతూ వ్యాయామం చేస్తే మంచి ఫలితాలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. ☞ బరువు తగ్గాలనుకునేవారు రోజూ 4–6 లీటర్ల నీటిని తాగాలి. అయితే వయసు, శరీరాకృతి, ఆరోగ్య స్థితిగతులను బట్టి నీళ్లు తీసుకోవాలి. మనం నివసించే ప్రాంతం వాతావరణాన్ని బట్టికూడా నీరు తీసుకోవాల్సి ఉంటుంది. ఇక వృద్ధులు, గర్భిణీలు ఎంత వాటర్ తాగాలో అనేది డాక్టర్ల సలహామేరకు తీసుకోవాలి. ☞ ఒక్కోసారి ఆకలి వేసినప్పుడు ఏదోఒకటి తింటుంటాం. అలా కాకుండా… ఆ సమంయలో వాటర్ తాగడం వలన ఆకలిని నియంత్రించగలుతాం. ☞ శరీరానికి తగినన్ని నీరు అందకపోతే టాక్సిన్‌లు పేరుకుపోతాయి. అధికంగా నీరు తాగడం వల్ల శరీరంలోని టాక్సిన్స్ బయటకి పోతాయి. ☞ మన శరీరంలో నిల్వ ఉండే కొవ్వు, కార్బొహైడ్రేట్స్‌ను కరిగించడంలో నీళ్లు ప్రముఖ పాత్ర పోషిస్తాయని పరిశోధకులు చెబుతున్నారు.
Also Read:
మహాశివరాత్రి స్పెషల్ సత్తుపిండి లడ్డూలు.. శివుడికి ఎంతో ప్రీతికరమట.. ఎలా చేయాలో తెలుసా..