AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బర్రె పాలు, ఆవు పాలు, ప్యాకెట్ పాలు.. మీ పిల్లలకు ఏది మంచిది..? ఈ తప్పులు చేయొద్దు..

పిల్లల పెంపకంలో ప్రతి తల్లిదండ్రులను వేధించే అతిపెద్ద ప్రశ్న.. బిడ్డకు ఏ పాలు పడితే మంచిది? ఆవు పాలు తాగించాలా? గేదె పాలు పడితే ఒళ్లు చేస్తుందా? లేక ప్యాకెట్ పాలే నయమా? చాలామంది కేలరీలు ఎక్కువగా ఉన్న పాలు ఇస్తే పిల్లలు బలంగా తయారవుతారని నమ్ముతారు. కానీ శిశువైద్య నిపుణులు మాత్రం ఇందులో తీవ్రమైన ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. పిల్లలకు ఏ పాలు ఎప్పుడు ఇవ్వాలి? అనేది తెలుసుకుందాం..

బర్రె పాలు, ఆవు పాలు, ప్యాకెట్ పాలు..  మీ పిల్లలకు ఏది మంచిది..? ఈ తప్పులు చేయొద్దు..
Cow Milk Vs Buffalo Milk Vs Packet Milk
Krishna S
|

Updated on: Sep 23, 2026 | 6:16 PM

Share

చిన్నారుల ఆహారం విషయంలో ప్రతి తల్లిదండ్రులకు ఎన్నో సందేహాలు, మరెన్నో సలహాలు ఎదురవుతుంటాయి. ముఖ్యంగా బిడ్డకు ఆవు పాలు మంచివా? బర్రె పాలు పడితే బలం వస్తుందా? లేక ప్యాకెట్ పాలే నయమా? అన్న విషయంలో తరచూ గందరగోళం నెలకొంటుంది. అయితే కేలరీలు ఎక్కువగా ఉన్నంత మాత్రాన ఆ పాలు బిడ్డ ఆరోగ్యానికి అన్ని విధాలా మంచివని భావించడం పొరపాటని ప్రముఖ శిశువైద్య నిపుణుడు డాక్టర్ కె. రావణ స్పష్టం చేస్తున్నారు. పిల్లల వయస్సు, జీర్ణశక్తి, బరువు, పాల అలర్జీలను పరిగణనలోకి తీసుకుని మాత్రమే సరైన పాలను ఎంచుకోవాలని ఆయన సూచిస్తున్నారు.

ఆవు పాలు vs బర్రె పాలు – తేడాలేంటి?

సాధారణంగా ప్రతి 100 మిల్లీలీటర్ల ఆవు పాలలో 3 నుండి 3.5 గ్రాముల ప్రొటీన్, 3 నుండి 4 గ్రాముల కొవ్వు, దాదాపు 120 మిల్లీగ్రాముల కాల్షియం లభిస్తాయి. ఇవి పిల్లల ఎముకలు, దంతాల పటిష్టతకు అవసరమైన కాల్షియం, ప్రొటీన్, ఫాస్ఫరస్, విటమిన్-బిని సమకూరుస్తాయి. ఆవు పాలలో కొవ్వు శాతం తక్కువగా ఉండి చిక్కదనం తక్కువగా ఉంటుంది. అయితే ఆవు పాలు పిల్లలందరికీ తేలికగా జీర్ణమవుతాయి అన్నది అందరికీ వర్తించే సాధారణ సూత్రం కాదని నిపుణులు గుర్తుచేస్తున్నారు.

మరోవైపు గేదె పాలలో ప్రొటీన్, కాల్షియం అధిక మోతాదులో ఉంటాయి. ప్రతి 100 మి.లీ. గేదె పాలలో 4 నుండి 4.5 గ్రాముల ప్రొటీన్, దాదాపు 200 మి.గ్రా. కాల్షియం లభిస్తాయి. ముఖ్యంగా ఆవు పాలతో పోలిస్తే గేదె పాలలో దాదాపు రెట్టింపు కొవ్వు ఉంటుంది. దీనివల్ల ఇవి అధిక కేలరీలు కలిగి, ఎంతో చిక్కగా ఉంటాయి. పోషకాలు ఎక్కువగా ఉన్నప్పటికీ, అధిక కొవ్వు కారణంగా గేదె పాలు కొంతమంది పిల్లలలో అజీర్తి, కడుపుబ్బరం వంటి సమస్యలకు దారితీయవచ్చు.

ప్యాకెట్ పాలతో జాగ్రత్తలు..

ప్యాకెట్ పాలు అనేది ఒక ప్రత్యేక రకం పాలు కాదు. విశ్వసనీయ సంస్థల ద్వారా శాస్త్రీయ పద్ధతిలో క్రిమిరహితం చేసి, సురక్షితంగా ప్యాక్ చేసిన ఆవు లేదా బర్రె పాలు మాత్రమే. ఆరోగ్య దృష్ట్యా నాణ్యమైన బ్రాండ్ల నుంచి సేకరించిన పాలను సరిగ్గా మరిగించి ఉపయోగించడం సురక్షితం. కొనుగోలు చేసే సమయంలో అది ఫుల్ క్రీమ్ పాలా, టోన్డ్ పాలా అనేది గమనించి పిల్లల అవసరాలకు తగ్గట్టు ఎంచుకోవాలి.

పాల అలర్జీ ఉంటే ప్రత్యామ్నాయం ఏది?

కొందరు తల్లిదండ్రులు బిడ్డకు ఆవు పాలు పడకపోతే వెంటనే బర్రె పాలు పట్టించడం ప్రారంభిస్తారు. కానీ ఇది సరైన పద్ధతి కాదని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఆవు పాలు, గేదె పాలు రెండింటిలోనూ ఒకే తరహా పాల ప్రొటీన్లు ఉంటాయి. కావున కౌ మిల్క్ ప్రొటీన్ అలర్జీ ఉన్న చిన్నారులకు బర్రె పాలు ఏమాత్రం ప్రత్యామ్నాయం కావు. బిడ్డకు పాలతో అలర్జీ ప్రతిచర్యలు కనిపిస్తే పాలను మార్చడం కాకుండా వెంటనే వైద్యులను సంప్రదించాలి.

పాలతో మాత్రమే సంపూర్ణ పోషకాహారం అందుతుందా?

పాలు ఎక్కువగా తాపితే బిడ్డకు కావలసిన అన్ని పోషకాలు అందుతాయనుకోవడం అతిపెద్ద అపోహ. ఆవు పాలైనా, బర్రె పాలైనా వాటిలో ఐరన్ శాతం చాలా తక్కువగా ఉంటుంది. కేవలం పాల మీదే ఆధారపడితే పిల్లలు రక్తహీనత బారినపడే ప్రమాదం ఉంది. అందుకే పిల్లల ఎదుగుదలకు అవసరమైన ఇనుము అందాలంటే వారి రోజువారీ ఆహారంలో పప్పులు, ఆకుకూరలు, పాలకూర, గుడ్లు వంటి పోషకాహారాన్ని భాగం చేయాలి.

ఏడాది లోపు పిల్లలకు ఏ పాలు ఇవ్వాలి?

ఆరు నెలల వయస్సు వరకు శిశువులకు తల్లిపాలు మాత్రమే అమృతం వంటి సంపూర్ణ ఆహారం. ఆరు నెలల తర్వాత తల్లిపాలతో పాటు ఆహారాన్ని ప్రారంభించాలి. అయితే ఏడాది లోపు పిల్లలకు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆవు పాలు, బర్రె పాలు లేదా ప్యాకెట్ పాలను తాగించకూడదు. వీటివల్ల పసిపిల్లలలో తీవ్రమైన ఐరన్ లోపం, పాల ప్రొటీన్ అలర్జీలు, విరేచనాలు, ప్రేగు సంబంధిత సమస్యలు తలెత్తే ముప్పు ఎక్కువ. బిడ్డకు ఒక సంవత్సరం దాటిన తర్వాత మాత్రమే వారి బరువు, జీర్ణవ్యవస్థను బట్టి నాణ్యమైన ఆవు పాలు లేదా పాశ్చరైజ్డ్ పాలను పరిచయం చేయాలని వైద్యులు స్పష్టం చేస్తున్నారు.

Follow Us
బర్రె పాలు, ఆవు పాలు, ప్యాకెట్ పాలు.. మీ పిల్లలకు ఏది మంచిది..?
బర్రె పాలు, ఆవు పాలు, ప్యాకెట్ పాలు.. మీ పిల్లలకు ఏది మంచిది..?
రాబోయే 3 నెలల్లో వీరి జీవితం టర్న్.. అపార ధనలాభం, భోగభాగ్యాలు!
రాబోయే 3 నెలల్లో వీరి జీవితం టర్న్.. అపార ధనలాభం, భోగభాగ్యాలు!
మీరు ఉండాల్సిన పనిలేకుండా.. డబ్బును తెచ్చిపెట్టే 8 వ్యాపారాలు
మీరు ఉండాల్సిన పనిలేకుండా.. డబ్బును తెచ్చిపెట్టే 8 వ్యాపారాలు
మష్రూమ్స్‌ కొనగానే ఈ పొరపాటు చేస్తే త్వరగా పాడవుతాయి!
మష్రూమ్స్‌ కొనగానే ఈ పొరపాటు చేస్తే త్వరగా పాడవుతాయి!
పీఎం కిసాన్ నిధుల విడుదలపై కీలక అప్డేట్.. అకౌంట్లోకి అప్పుడే..
పీఎం కిసాన్ నిధుల విడుదలపై కీలక అప్డేట్.. అకౌంట్లోకి అప్పుడే..
ఏపీలో ఇకపై ఇన్‌ఫ్లుయెన్సర్లకు చెల్లింపులు.. ప్రభుత్వ నిర్ణయం..
ఏపీలో ఇకపై ఇన్‌ఫ్లుయెన్సర్లకు చెల్లింపులు.. ప్రభుత్వ నిర్ణయం..
ప్రేమించి పెళ్లి చేసుకున్నా అనుమానం వీడలేదు.. భార్యపై అనుమానంతో..
ప్రేమించి పెళ్లి చేసుకున్నా అనుమానం వీడలేదు.. భార్యపై అనుమానంతో..
ఈ అవయవాలు దెబ్బతింటే బాగుచేయడం దేవుడి వల్ల కూడా కాదట!
ఈ అవయవాలు దెబ్బతింటే బాగుచేయడం దేవుడి వల్ల కూడా కాదట!
సంపూర్ణేష్‌కు అంత తక్కువా..!!
సంపూర్ణేష్‌కు అంత తక్కువా..!!
గురువారం ఈ పనులు చేస్తే లక్ష్మీదేవి వీరివైపు కన్నెత్తి కూడా చూడదు
గురువారం ఈ పనులు చేస్తే లక్ష్మీదేవి వీరివైపు కన్నెత్తి కూడా చూడదు