AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PM Kisan: పీఎం కిసాన్ నిధుల విడుదలకు లైన్ క్లియర్.. అకౌంట్లోకి వచ్చేది అప్పుడే.. కేంద్రం రెడీ..

పీఎం కిసాన్ 24వ విడత సాయం కోసం దేశవ్యాప్తంగా రైతులు ఎదురుచూస్తున్నారు. ఎప్పుడెప్పుడు అందుతాయా అని ఆశగా చూస్తున్నారు. అయితే ఎట్టకేలకు నిధుల విడుదలపై క్లారిటీ వచ్చింది. వచ్చే నెలలో దసరా కానుకగా విడుదల చేసే అవకాశముంది. ఈ మేరకు కేంద్రం సిద్దమవుతోంది.

PM Kisan: పీఎం కిసాన్ నిధుల విడుదలకు లైన్ క్లియర్.. అకౌంట్లోకి వచ్చేది అప్పుడే.. కేంద్రం రెడీ..
Pm Kisan
Venkatrao Lella
|

Updated on: Sep 23, 2026 | 6:05 PM

Share

పీఎం కిసాన్ 24వ విడత సాయంపై కీలక అప్డేట్ వచ్చింది. త్వరలోనే నిధుల విడుదలకు కేంద్ర ప్రభుత్వం సిద్దమవుతోంది. అక్టోబర్ నెలలో రైతుల బ్యాంక్ ఖాతాల్లో జమ చేసే అవకాశముందని తెలుస్తోంది. 23వ విడత సొమ్ము విడుదల చేసి నాలుగు నెలలు కావొస్తుండటంతో.. 24 విడత చెల్లించేందుకు మోదీ సర్కార్ సిద్దమవుతోంది. అక్టోబర్‌లో విడుదలపై అధికారిక ప్రకటన రానప్పటికీ.. ఎల్‌నివో ప్రభావంతో పంట సాగుకు రైతులు దూరమవ్వడం, దసరా, దీపావళి పండగులు వస్తుండటంతో వచ్చే నెలలోనే రిలీజ్ కావొచ్చని తెలుస్తోంది. 24వ విడత కింద ఒక్కొక్క లబ్దిదారుడి ఖాతాలో రూ.2 వేలు విడుదల చేస్తారు. డీబీటీ ప్రక్రియ ద్వారా వీటిని కేంద్రం నేరుగా రైతుల బ్యాంక్ ఖాతాలకు పంపనుంది.

జూన్ 20,2026న ప్రధాని మోదీ పశ్చిమబెంగాల్‌లోని తారకేశ్వర్‌లో 23వ విడత నగదును విడుదల చేశారు. దేశవ్యాప్తంగా 9.44 కోట్ల మంది రైతులకు ఒకేసారి రూ.18,880 కోట్లు చెల్లించారు. సాధారణంగా ప్రతీ నాలుగు నెలలకు ఒకసారి వీటిని విడుదల చేస్తున్నారు. జూన్ 20న 23వ విడత అందించగా.. అక్టోబర్ 20తో నాలుగు నెలలు అవుతుంది. వచ్చే నెలలో 20న దసరా పండుగ కూడా వస్తుంది. ఆ తర్వాత నెలలో దీపావళి వస్తోంది. దీంతో పండుగ కానుకగా పీఎం కిసాన్ నిధులను విడుదల చేసే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. 2019లో ఈ స్కీమ్ ప్రారంభించగా.. ప్రతీ ఏడాది రైతులకు రూ.6 వేలు అందిస్తున్నారు. వీటిని మూడు విడతలుగా పంపిణీ చేస్తున్నారు. ఇప్పటివరకు రైతులకు రూ.4.46 లక్షల కోట్లు అందించినట్లు కేంద్రం చెబుతోంది. అయితే త్వరలోనే విడుదల కానున్న 24 విడత నిధులు అందుకోవాలంటే రైతులు కొన్ని పనులు పూర్తి చేయాలి. ఈకేవైసీ తప్పనిసరిగా పూర్తి చేయాలి. ఈకేవైసీ యాక్టివ్‌లో ఉంటేనే పీఎం కిసాన్ నిధులు మీకు అందుతాయి. కేవైసీ ఇనాక్టివ్‌లో ఉంటే నిధులు నిలిచిపోతాయి. మళ్లీ కేవైసీ పూర్తి చేసినప్పుడు మాత్రమే అందుతాయి.

ఇక బ్యాంక్ అకౌంట్‌తో ఆధార్ అనుసంధానం చేయాలి. ఇక పీఎం కిసాన్ పోర్టల్‌లో భూమి రికార్డులు పరిశీలించుకోవాలి. ఒక కుటుంబంలో ఒకరికి మాత్రమ పీఎం కిసాన్ ప్రయోజనం అందుతుంది. ఇద్దరికి ఉన్నట్లు తేలితే రద్దు చేస్తారు. ఇక ఫార్మర్ రిజిస్ట్రీలో తప్పనిసరిగా రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫార్మర్ రిజిస్ట్రీలో నమోదు చేసుకుని ఐడీ నెంబర్ పొందాల్సి ఉంటుంది. రైతులకు యూనిక్ ఐడీగా ఇది పనిచేస్తోంది. ప్రభుత్వ సంక్షేమ పథకాలు, రాయితీలు, సబ్సిడీలు, ఇతర ప్రయోజనాలు సులభంగ పొందవచ్చు. దీంతో ఈ నాలుగు పనులు త్వరగా పూర్తి చేయండి.

Follow Us